For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Valimai Movie Review: హాలీవుడ్ రేంజ్‌లో అజిత్ యాక్షన్ ఎపిసోడ్స్.. కానీ.. !

  |

  Rating: 2.75/5

  నటీనటులు: అజిత్ కుమార్, కార్తీకేయ, హ్యూమా ఖురేషి, యోగి బాబు, చిత్రా రెడ్డి తదితరులు
  నిర్మాత: బోని కపూర్
  దర్శకత్వం: హెచ్ వినోద్
  సినిమాటోగ్రఫి: నీరవ్ షా
  ఎడిటింగ్: విజయ్ వెల్లుకుట్టి
  మ్యూజిక్: యువన్ శంకర్ రాజా
  బ్యానర్: బేవ్యూ ప్రాజెక్ట్ ఎల్ఎల్‌పీ, జీ స్టూడియోస్
  బడ్జెట్: 150 కోట్లు
  రిలీజ్ డేట్: 2022-02-24

  వలిమై కథ ఏంటంటే?

  వలిమై కథ ఏంటంటే?

  వైజాగ్‌లో చైన్ స్నాచింగ్, డ్రగ్స్ మాఫియా అరాచకాలను అరికట్టేందుకు పోలీస్ ఆఫీసర్‌ అర్జున్‌ (అజిత్ కుమార్)కు బాధ్యతలు అప్పగిస్తారు. అర్జున్‌కు అసిస్టెంట్‌గా సోఫియా (హ్యుమా ఖురేషి) సహకారం అందిస్తుంటారు. అయితే కొలంబియా నుంచి వచ్చిన డ్రగ్స్‌ను చేజిక్కించుకొని వైజాగ్‌‌లో దందా చేయాలని డాన్ (కార్తీకేయ) ప్లాన్ చేస్తాడు. అయితే ఈ డ్రగ్స్‌ వ్యవహారంలో తన సోదరుడు బుజ్జి కూడా సభ్యుడు అనే విషయం అర్జున్‌కు షాక్ కలిగిస్తుంది.

  వలిమైలో ట్విస్టులు ఇలా..

  వలిమైలో ట్విస్టులు ఇలా..

  కొలంబియా నుంచి వచ్చిన డ్రగ్స్‌ను మాఫియా డాన్ చేజిక్కించుకొనేందుకు ఎలాంటి ప్లాన్ చేశాడు? డ్రగ్ మాఫియా కుట్రలను అడ్డుకోవడానికి అర్జున్ ఎలాంటి ఎత్తులు వేశాడు. డ్రగ్స్ మాఫియాలో సోదరుడు చిక్కుకోవడంతో అర్జున్‌ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? డ్రగ్స్ మాఫియాను ఎదుర్కోవడానికి హ్యాకర్‌గా సోఫియా అలాంటి ప్లాన్ అమలు చేసింది. డ్రగ్స్ మాఫియా కోరల్లో నుంచి తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి అర్జున్ ఏం చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే వలిమై సినిమా కథ.

  ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

  ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

  కొలంబియాలో డ్రగ్స్ మాఫియా, వైజాగ్‌లో చైన్ స్నాచింగ్ వ్యవహారాలతో వలిమై కాస్త ఆసక్తిగానే మొదలవుతుంది. కానీ కథనంలో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ లేకపోవడంతో సినిమా యావరేజ్‌గా సాగుతుంది. నాసిరకమైన సన్నివేశాలు, రొటీన్ ఫార్మూలాతో సాగుతుండటంతో కాస్త సహనానికి పరీక్ష పెట్టినట్టుంది. కానీ ఇంటర్వెల్‌కు 30 నిమిషాల ముందు తెరకెక్కించిన యాక్షన్ సీన్లు మాత్రం అదరహో అనేలా ఉంటాయి. ఆద్యంతం ఉత్కంఠను కలిగించే రేసింగ్స్‌ హాలీవుడ్ సినిమాను తలపించేలా ఉంటాయి. దాంతో సెకండాఫ్‌పై భారీ అంచనాలు పెరుగుతాయి.

  సెకండాఫ్‌ నాసిరకంగా

  సెకండాఫ్‌ నాసిరకంగా

  అయితే ప్రేక్షకుల్లో పెరిగిన అంచనాలకు తగినట్టే వలిమై సెకండాఫ్‌లో కూడా 20 నిమిషాల హై ఓల్టేజ్ యాక్షన్ సీన్లు అబ్బురపరుస్తాయి. గాలిలో బైక్ విన్యాసాలు, రోడ్లపై బస్సును చేజింగ్ చేసే సన్నివేశాలు సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్తాయి. ఎప్పుడైతే అర్జున్ ఫ్యామిలీ స్టోరి కథలోకి వచ్చిందో.. అక్కడి నుంచి వలిమై గ్రాఫ్ పడటం మొదలవుతుంది. అప్పటికే కథ, కథనాలపై బ్యాలెన్స్ కోల్పోవడంతో సినిమా యావరేజ్ అనే పరిస్థితి కూడా కనిపించదు.

  అజిత్ పెర్ఫార్మెన్ అదుర్స్

  అజిత్ పెర్ఫార్మెన్ అదుర్స్

  నటీనటులు ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. అజిత్ మరోసారి యాక్షన్ సీన్లలో ఆకట్టుకొన్నాడు. తన మార్కు బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్‌తో అభిమానులను మెప్పిస్తాడు. కానీ సగటు సినీ ప్రేక్షకుడిని మాత్రం మెప్పించలేకపోయాడనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక హ్యూమా ఖురేషి అందంగాను, ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నది. కీలక సన్నివేశాల్లో నటన, గ్లామర్‌తో ఝలక్‌లు ఇచ్చింది. మిగితా పాత్రల్లో నటించిన వారు ఫర్వాలేదనిపించారు.

  విలన్‌గా కార్తీకేయ గుమ్మకొండ

  విలన్‌గా కార్తీకేయ గుమ్మకొండ

  ఇక డ్రగ్ మాఫియా డీలర్‌గా కార్తీకేయ సరికొత్త విలనిజంతో ఆకట్టుకొన్నాడు. సిక్స్‌ప్యాక్ బాడీ, ఆహార్యం, ఫెర్ఫార్మెన్స్‌ అన్ని సమపాళ్లలో కనిపించాయి. కథలో దమ్ము లేకపోవడం వల్ల కార్తీకేయ పాత్రను కొన్ని పరిమితులు వెంటాడాయనిపిస్తుంది. తన ప్రయత్నం లోపం లేకుండా కార్తీకేయ తన పాత్రకు న్యాయం చేశాడని చెప్పవచ్చు. భవిష్యత్‌తో ప్యాన్ ఇండియా స్థాయిలో మంచి నటుడిగా ముద్ర వేసుకొనే అవకాశాలు చాలా కనిపించాయి.

  అత్యున్నత స్థాయిలో టెక్నికల్ వ్యాల్యూస్

  అత్యున్నత స్థాయిలో టెక్నికల్ వ్యాల్యూస్

  ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. వలిమై సినిమాకు సినిమాటోగ్రఫి, యాక్షన్ కోరియోగ్రఫి స్పెషల్ ఎట్రాక్షన్. నీరవ్ షా సినిమాటోగ్రఫి మాత్రం ఇండియన్ స్క్రీన్‌పై నభూతో నభవిష్యత్ అనే విధంగా అనిపిస్తుంది. రేసింగ్, ఛేజింగ్, గాలిలో బైక్ విన్యాసాలను అద్భుతంగా కెమెరాలో బంధించాడు. ప్రేక్షకులకు యాక్షన్ స్టంట్స్ కొత్త అనుభూతిని కలిగిస్తాయి. దిలీప్ సుబ్బరాయన్ యాక్షన్ కోరియోగ్రఫి అద్బుతంగా ఉంది. ఇక విజయ్ వేలుకుట్టి ఎడిటింగ్ కట్స్ థ్రిల్లింగ్ ఉన్నాయి. అలాగే యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు అదనపు ఆకర్షణ.

  బోని కపూర్ ప్రొడక్షన్ వ్యాల్యూస్

  బోని కపూర్ ప్రొడక్షన్ వ్యాల్యూస్

  వలిమై ప్రొడక్షన్ వ్యాల్యూస్ విషయానికి వస్తే.. ఈ చిత్రం కరోనావైరస్ లాక్‌డౌన్‌‌లో చిక్కుకొని విలవిలలాడింది. అయితే ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిర్మాత బోని కపూర్ ఖర్చుకు వెనుకాడలేదు. అత్యున్నత సాంకేతికతను ఉపయోగించడంలో ఎలాంటి రాజీ లేదనే విషయం తెర మీద సన్నివేశాలను చూస్తే స్పష్టమవుతుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి యాక్షన్ ఎపిసోడ్ ఉన్న సినిమాను ప్రేక్షకులు చూసి ఉండరు. అందుకు బోని కపూర్‌ కమిట్‌మెంట్‌ను అభినందించాల్సిందే.

  Recommended Video

  Valimai : Ajith, Shalini నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు - Karthikeya | Filmibeat Telugu
  ఫైనల్‌గా వలిమై గురించి..

  ఫైనల్‌గా వలిమై గురించి..

  వలిమై సినిమా విషయానికి వస్తే.. ప్రధానంగా యాక్షన్‌తోపాటు సాగే సినిమా అయినప్పటికీ కొంత ఎమోషనల్ పాయింట్స్‌ కూడా జత చేశారు. కానీ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకొనేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టడంతో సినిమా నాసిరకంగా కనిపిస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ మినహాయిస్తే.. నటీనటుల పెర్ఫార్మెన్స్, టెక్నికల్, ప్రోడక్షన్ వ్యాల్యూస్ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాయి. హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను ఇష్టపడే ప్రేక్షకులకు, అజిత్, కార్తీకేయ ఫ్యాన్స్‌కు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.

  English summary
  Valimai Movie Review And Rating: Ajith Kumar steal the show with High Voltage action episodes
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X