దర్శకుడిగా ఎదిగిన శింబు

By Staff

Vallabha
సినిమా: వల్లభ
విడుదల తేదీ: 11 నవంబర్‌ 2006
కెమెరా: ప్రియన్‌
సంగీతం: యువన్‌ శంకర్‌రాజా
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శింబు
నిర్మాణం: ఎస్సార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
నిర్మాత: బెల్లంకొండ సురేశ్‌

మన్మథ చిత్రం సక్సెస్‌తో తెలుగులో మంచి గుర్తింపు సంపాదించాడు శింబు. తండ్రి టి. రాజేందర్‌లాగే శింబు కూడా తన చిత్రాలలో ఎంతో ఎనర్జీ ప్రదర్శిస్తూ ప్రేక్షకులకు ఏదో కొత్తదనం అందించాలన్న తాపత్రయం కనబరుస్తుంటాడు. బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేసి తర్వాత హీరో అయిన ఈ యువనటుడు దర్శకుడిగా రూపొందించిన చిత్రమే 'వల్లభ' (తమిళంలో వల్లవన్‌). కథాపరంగా చూస్తే ఇది ఒక సాదాసీదా ట్రయాంగిల్‌ ప్రేమకథ. అయితే, ఇందులో కావల్సినన్ని ట్విస్టులు పెట్టడమే కాకుండా నటుడిగా కూడా వైవిధ్యమైన పాత్ర పోషించి శింబు శభాష్‌ అనిపించుకున్నాడు. వల్లభ కాలేజీ నేపథ్యంలో జరిగే ఒక ప్రేమ కథ. అయితే, ఇందులో విలన్‌గా రీమాసేన్‌ని నటింపజేయడం ద్వారా కొంత కొత్తదనం అందించగలిగాడు.

కథ విషయానికొస్తే.. విక్రమ్‌ (విక్కీ) ప్రేమ పట్ల ఎనలేని గౌరవం గలవాడు. ఒకమ్మాయిని చూసి ఇష్టపడటం కాదని, అలాంటి అమ్మాయిని చూసినప్పుడు ప్రేమను ఫీల్‌ కావాలని స్నేహితులతో చెబుతుంటాడు. ఒకరోజు అతడు అనుకోని సంఘటనలో స్వప్న (నయనతార)ను కలుస్తాడు. తను చదివే కాలేజీలోనే ఆమె లెక్చరర్‌. ఆమె కన్నా మూడేళ్లు చిన్నవాడయిన విక్కీ తొలిచూపులోనే లెక్చరర్‌ను ప్రేమించడం మొదలుపెట్టేస్తాడు. తనను కాకుండా తన మనసును ఆమె తెలుసుకోవాలని, అప్పుడే అది నిజమైన ప్రేమ అవుతుందని భావించి తన గెటప్‌ మారుస్తాడు. ఎత్తుపళ్లు, పెద్ద కళ్లజోడు పెట్టుకుని వేషం మార్చుకుని స్వప్న వెంటపడటం ప్రారంభిస్తాడు. అందవిహీనంగా ఉన్నా అతడి సిన్సియారిటీ నచ్చి స్వప్న కూడా అతడి ప్రేమలో పడుతుంది. సరిగ్గా అప్పుడు ఫ్లాష్‌బ్యాక్‌ రివీల్‌ అవుతుంది. విక్కీ తన క్లాస్‌మేట్‌ గంగ (రీమాసేన్‌)ను ప్రేమిస్తుంటాడు. కానీ ఆ అమ్మాయి ఒకలాంటి సైకో. తను ఏం చెబితే అంతా అదే చేయాలని శాసించే మనస్తత్వం ఆమెది. మొదట్లో ఆమె ఎన్ని యిబ్బందులు పెట్టినా ప్రేమిస్తునే ఉండిన విక్కీ తర్వాత గంగ తనను ప్రేమించడం లేదని, కేవలం శాడిస్టుగా వ్యవహరిస్తోందని గ్రహించి ఆమెకు ఒక గుణపాఠం చెప్పి గుడ్‌బై చెప్పేస్తాడు. ఫ్యాష్‌బ్యాక్‌ పూర్తయ్యాక.. విక్కీ ఇక్కడ స్వప్నతో ప్రేమలో మునిగిపోయి ఉన్నప్పుడు వాళ్లిద్దరి మధ్య స్పర్థలు ఏర్పడతాయి. ఎందుకు ఇలా జరిగిందని ఆలోచిస్తుండగా గంగ తిరిగి ప్రత్యక్షమై నీ ప్రేమను చెడగొట్టింది నేనే అని చెబుతుంది. తర్వాత విక్కీ వెళ్లి స్వప్నను కన్విన్స్‌ చేసి.. వయస్సులో చిన్నవాడినైనా ప్రేమలో తను చాలా సీనియర్‌ అని, తన హృదయ వైశాల్యం కూడా అందరి కన్నా చాలా పెద్దదని నచ్చచెబుతాడు. దీనితో స్వప్న, విక్కీ తిరిగి కలుస్తారు. గంగ మెంటల్‌ ఆసుపత్రిలో చేరుతుంది. కొన్నేళ్ల తర్వాత గంగ మెంటల్‌ హాస్పిటల్‌ నుంచి తిరిగి వస్తుంది కానీ ఆమెలో మాత్రం మార్పు రాదు. చివరిగా ఆమె తన పగ చల్లార్చుకుందా, స్వప్న, విక్కీ ప్రేమ సఫలం అయిందా లాంటి ప్రశ్నలకు సమాధానం తెరపై చూడాల్సిందే.

ఈ సినిమాలో ప్లస్‌ పాయింట్లు గురించి చెప్పాలంటే.. శింబు. కథలో ఎక్కడికక్కడ ఆసక్తికరమైన ట్విస్టులు ఉండటంతో ఎక్కడా బోర్‌ కొట్టదు. ఈ సినిమాలో మరొక హైలెట్‌ ప్రియన్‌ కెమెరా పనితనం. అలాగే యువన్‌ శంకర్‌రాజా నేపథ్య సంగీతం కూడా. మిగిలిన నటీనటులు అంతా మంచి పెర్ఫార్మెన్స్‌ అందించారు. నెగెటివ్‌ పాత్రలో రీమాసేన్‌ చక్కని నటన ప్రదర్శించింది. నయనతార అందాలు అలరిస్తాయి.

మైనస్‌ విషయాలకొస్తే.. ఈ సినిమాలో ట్విస్టులు బాగానే ఉన్నా వాటి స్పీడును సగటు ప్రేక్షకులు అందుకోలేరు. రీమాసేన్‌ నటన బాగున్నా ఆమె సైకో అని ప్రేక్షకులు ముందే పసిగట్టేయగలుగుతారు. దీనితో కథపై కొంత ఆసక్తి తగ్గిపోతుంది. క్లయిమాక్స్‌ అర్ధంతరంగా ఉండటం మరో మైనస్‌.

యువన్‌ శంకర్‌రాజా సంగీతం బాగుంది. ఆంథొనీ ఎడిటింగ్‌ బాగుంది. శింబు డాన్సులు అలరిస్తాయి. స్వీయ దర్శకత్వం కావడంతో హీరోయిజమ్‌ని అతిగా బిల్డప్‌ చేసుకున్నాడు శింబు. ఇంకా ఇందులో సంధ్య, సంతానం, ఎస్‌ వి శేఖర్‌ తదితరులు నటించారు.

గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X