twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాల్మీకి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating:
    3.0/5
    Star Cast: వరుణ్ తేజ్, పూజా హెగ్డే
    Director: హరీష్ శంకర్‌

    'ముకుంద', 'కంచె', 'లోఫర్‌' లాంటి విభిన్నకథా చిత్రాలతో నటుడిగా తనని తాను ప్రూవ్‌ చేసుకొని 'ఫిదా', 'తొలిప్రేమ', 'అంతరిక్షం', 'ఎఫ్‌ 2' లాంటి సక్సెస్‌ ఫుల్‌ కమర్షియల్‌ చిత్రాలతో ఫుల్‌స్వింగ్‌లో ఉన్నారు మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌. ప్రస్తుతం ఆయన హీరోగా పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం 'వాల్మీకి'. సెప్టెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలైంది. ఈ చిత్రం వరుణ్ తేజ్‌, హరీష్ శంకర్‌కు ఎలాంటి ఫలితం అందించిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..

    వాల్మీకి కథ

    వాల్మీకి కథ

    అభి (అధర్వ) అసిస్టెంట్ డైరెక్టర్. తనకు ఎదురైన చేదు అనుభవం వల్ల డైరెక్టర్‌గా మారాలనుకొంటాడు. కథాన్వేషణలో గద్దల కొండ గణేష్ (వరుణ్ తేజ్) అనే ఫ్యాక్షనిస్టు జీవితం తారసపడుతుంది. తన సినిమాకు సరైన కథ అనుకొంటాడు. గద్దల కొండకు వెళ్లి గణేష్ గురించి తెలుసుకొనే ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలో గణేష్ ఫ్యాక్షన్ వ్యవహారాలు, హత్యలు, దొమ్మిలు ప్రత్యక్షం చూస్తాడు. ఈ నేపథ్యంలో నేరుగా గణేష్‌కు అభి దొరికిపోతాడు. తన జీవితాన్ని తెరకెక్కించే ప్రయత్నం తెలుసుకొని ఏకంగా ఆ సినిమాకు హీరోగా మారిపోతాడు.

    వాల్మీకిలో ట్విస్టులు

    వాల్మీకిలో ట్విస్టులు

    గణేష్ ఫ్యాక్షనిస్టుగా ఎందుకు మారాడు? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి? గణేష్ తన తల్లి మనసుకు ఎందుకు దూరమవుతాడు. హీరోగా మారిన గణేష్ జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకొన్నాయి. దేవీ (పూజ హెగ్డే)తో గణేష్ ప్రేమ ఎందుకు విఫలమైంది? బుజ్జితో ఎందుకు మళ్లీ ప్రేమలో పడుతాడు? బుజ్జి, అభి ప్రేమ గురించి తెలుసుకొన్న గణేష్ ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు? తన తల్లి ప్రేమను మళ్లీ ఎలా గెలుచుకొన్నాడు? దేవీ ఎందుకు తన ప్రేమను త్యాగం చేసిందనే ప్రశ్నలకు సమాధానమే వాల్మీకి సినిమా కథ.

    ఫస్టాఫ్ ఎనాలిసిస్

    ఫస్టాఫ్ ఎనాలిసిస్

    అసిస్టెంట్ డైరెక్టర్ అభి లైఫ్‌తో సినిమా కథలోకి వెళ్తుంది. తన కథకు గణేష్ కరెక్ట్ అని తెలుసుకోవడం గద్దలకొండకు వెళ్లడం, అక్కడ చింతపడు కొండమల్లి (సత్య) కలుసుకోవడం లాంటి అంశాలతో చకచకా కథ మొదలైపోతుంది. కొండమల్లి రాకతో వినోదం మిళితమై పోతుంది. ఇక గణేష్ కథ మొదలు కావడంతో యాక్షన్ పార్ట్, సీరియస్ పెరిగిపోతుంది. ఇక ఇంటర్వెల్‌‌ బ్యాంగ్ కోసం మర్డర్ ట్విస్ట్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తుంది.

    సెకండాఫ్ ఎనాలిసిస్

    సెకండాఫ్ ఎనాలిసిస్

    సెకండాఫ్‌కు వచ్చే సరికి కథ, కథనాలు దారితప్పాయనే ఫీలింగ్ కలుగుతుంది. కథ చాలా స్లో సాగడంతో ఇబ్బందిగా అనిపిస్తుంది. కాకపోతే అభి, దేవీ ప్రేమ కథ, అలనాటి అందాల తార శ్రీదేవితో కూడిన సన్నివేశాలు, వెల్లువెత్తే గోదారమ్మ పాట ప్రేక్షకులను మళ్లీ ఉత్తేజానికి గురి చేస్తుంది. గణేష్ హీరోగా సినిమా మొదలుపెట్టిన వద్ద నుంచి సినిమా ఆసక్తిగా మారుతుంది. చివర్లో తల్లితో గణేష్ సన్నివేశాలు ఎమోషనల్‌గా ఉంటాయి. గణేష్ ఫ్యాక్షనిస్టుగా నుంచి హీరోగా మారే క్రమాన్ని మరింత బాగా తీయాల్సి ఉండేదేమో అనే ఫీలింగ్ కలుగుతుంది.

    దర్శకుడు హరీష్ శంకర్ గురించి

    దర్శకుడు హరీష్ శంకర్ గురించి

    దర్శకుడు హరీష్ శంకర్ తన సినిమాలో ప్రత్యేకంగా ఓ మార్కును వదిలే ప్రయత్నం చేస్తాడు. ఈ సినిమా విషయంలో కూడా ఆ ప్రయత్నం సక్సెస్ అయిందని చెప్పవచ్చు. డైలాగ్స్ ఆయన ప్రతిభకు అద్దపట్టాయి. అభి, వరుణ్ కథను బాలెన్స్ చేయడంలో సఫలమయ్యాడనే చెప్పవచ్చు. కాకపోతే సెకండాఫ్‌లో కథ, కథనాల విషయంలో పడిన తడబాటు స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే క్లైమాక్స్‌లో ఆ లోపాన్ని సరిదిద్దుకొనే ప్రయత్నం చేసినట్టు అనిపిస్తుంది.

    వరుణ్ తేజ్ పెర్ఫార్మెన్స్

    వరుణ్ తేజ్ పెర్ఫార్మెన్స్

    ఇక గణేష్‌గా వరుణ్ తేజ్ పాత్రలో ఒదిగిపోయాడు. ప్రతీ సన్నివేశంలో హావభావాలు బాగున్నాయి. క్రూరత్వం, వినోదం, భయానకం, భావోద్వేగం అన్ని కలిపి గణేష్‌ పాత్రను సంపూర్ణంగా చేయడంలో వరుణ్ తప్పు పట్టాల్సిన ఓ చిన్న పాయింట్ కూడా దొరకదు. స్టార్‌గా వరుణ్ ఉన్న క్రేజ్‌ను తుడిపేసుకొని ఫెర్ఫార్మర్ అనే ముద్రను వేసుకోవడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ఫైట్స్, లుక్స్, బాడీ లాంగ్వేజ్ విషయంలో అన్ని చక్కగా కుదిరాయి.

    ఇతర పాత్రలు

    ఇతర పాత్రలు

    పూజా హెగ్డే అతిథి పాత్రలో మరిసింది. దేవత పాటలో శ్రీదేవీని మ్యాచ్ చేసే ప్రయత్నం ఆకట్టుకొన్నది. ఇక అధర్వ వరుణ్‌కు పోటాపోటిగా నటించాడు. కీలక సన్నివేశాల్లో అధర్వ నటనలో మెచ్యురిటీ అందర్నిని ఆకట్టుకొంటుంది. ఇక కమెడియన్ సత్య కొండ మల్లిగా ఇరుగ దీశాడు. ముఖ్యంగా రచ్చ రవి సినిమాకు హైలెట్. రవిని ఈ కోణంలో ఎవరూ ఊహించరు. తనలోని మరో కోణాన్ని రవి పర్ఫెక్ట్‌గా చూపించాడు.

    సాంకేతికంగా

    సాంకేతికంగా

    సాంకేతిక విభాగాల్లో సినిమాటోగ్రఫి అద్భుతంగా ఉంది. లైటింగ్, షాట్స్ రిచ్‌గా ఉన్నాయి. ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ సంగీతం. ముఖ్యంగా రిరికార్డింగ్ బాగుంది. ఎడిటింగ్ విషయంలోనే చిన్న అసంతృప్తి కలుగుతుంది. దాదాపు 15, 20 నిమిషాల సినిమా తగ్గిస్తే కథ, కథనాల్లో వేగం పెరిగే అవకాశం ఉంది.

     ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    వాల్మీకీ కథ, కథనాలు పక్కన పెడితే నటీనటులు ఫెర్ఫార్మెన్స్‌కు పెద్ద పీట వేసిన చిత్రంగా చెప్పవచ్చు. గణేష్‌గా వరుణ్ తేజ్ నటనలో పీక్స్‌ను చూడవచ్చు. దర్శకుడు హరీష్ ఉండే మ్యాజిక్ ఈ సినిమాలో కనపడుతుంది. సినిమా లెంగ్త్ మైనస్ అని చెప్పవచ్చు. మెగా ఫ్యాన్స్‌కు, పక్కా మాస్ సినిమాలను మెచ్చే ప్రేక్షకులకు విపరీతంగా నచ్చతుంది. బీ, సీ సెంటర్లలోని ప్రేక్షకులను ఆకట్టుకొనే అంశాలు చాలా ఉన్నాయి. వసూళ్ల పరంగా మంచి ఓపెనింగ్ రావడానికి అవకాశం ఉంది.

    English summary
    Actor Varun Tej sure has the distinction of being an actor who has tried his hands at different sorts of films since he started his career. Kanche, Antariksham, Fidaa, and F2 amidst all his other films stood out for being a new genre from his end. In his next, Valmiki, he teams up with director Harish Shankar who is known to show his male leads in a new avatar. The duo's first collaboration, Valmiki, is set to hit the screens worldwide on September 13th. Produced on the 14 Reels Plus banner by Ram and Gopi Achanta, the film also stars Tamil actor Atharvaa Murali in a key role. Pooja Hegde and Mrunalini Ravi are the female leads.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X