ముచ్చట లేని మూడో చిత్రం

By Staff

Vamsi
నటీనటులు: కృష్ణ, మహేష్‌ బాబు, నమ్రతా శిరోడ్కర్‌, మయూరి కాంగో, నాజర్
కెమెరా: అజయ్‌ విన్సెంట్
కథ: సత్యానంద్‌
సంగీతం: మణిశర్మ
నిర్మాత: జి.ఆదిశేషగిరిరావు
దర్శకత్వం: బి.గోపాల్

హీరో కృష్ణ కుమారుడిగా కాకుండా తనకంటూ ఓ ఇమేజ్‌ సంపాందించుకున్న మహేష్‌ బాబు మూడో చిత్రం ఇది. ఉన్న ఇమేజ్‌ ను పోగొట్టే చిత్రం వంశీ. తండ్రి, కొడుకులిద్దరి ఇమేజ్‌ గాలిలో కలిసిపోయే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. రొటీన్‌ కథతో మాస్‌ మసాలాగా రూపొందించిన చిత్రంలో నవ్యత అనేది లేదు. కృష్ణ అభినయం మరీ పేలవంగా ఉండడం ఈ చిత్రంలో ప్రత్యేకత. కృష్ణ అనారోగ్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. మహేష్‌ బాబు కెరీర్‌ కు ఏమాత్రం ఉపయోగపడని చిత్రం ఇది. పద్మాలయ సంస్థ ఇలాంటి చిత్రాన్ని నిర్మించడం చిత్రమే.

మహేష్‌ బాబు ఫ్యాషన్‌ డిజైనర్‌. బ్రహ్మనందం, మయూరి కాంగో అతని మిత్ర బృందం. వీరందరూ కలిసి ఓ కాంట్రాక్ట్‌ నిమిత్తమై ఆస్ట్రేలియా వెళతారు. అక్కడ మిత్ర బృందం, మహేష్‌ విడిపోతారు. ఆస్టేలియాకు టూర్‌ కు వచ్చిన నమ్రతా శిరోడ్కర్‌ కూడా తప్పిపోయి మహేష్‌ కు పరిచయం అవుతుంది. ఇద్దరూ ఓ హోటల్‌ లో రూం అద్దెకి తీసుకుంటారు. కానీ పరాయి మగాడితో కలిసి ఒకే రూంలో పడుకోవద్దు కాబట్టి నమ్రతా బయట చలిలోనే నిద్రిస్తుంది. చలికి తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోతే హీరోగారు లోపలకి తీసుకొచ్చి డ్రెస్‌ మార్చి పడుకోబెడుతాడు. తర్వాత ఏముంది? కథ మామూలే.

ఇద్దరూ గాఢంగా ప్రేమలో పడతారు. అయితే వారిద్దరి ప్రేమను నమ్రతా తండ్రి(నాజర్‌) అంగీకరించడు. దీంతో గుడిలో పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. కానీ అంతలోనే ట్విస్ట్‌. సూపర్‌ స్టార్‌ కృష్ణ హీరోయిన్‌ ను కిడ్నాప్‌ చేస్తాడు. మరోవైపు హీరోను నాజర్‌ జైల్లో పెట్టిస్తాడు. కృష్ణ కిడ్నాప్‌ వెనుక కూడా ఓ రీజన్‌ ఉంది. అదేమిటంటే కృష్ణ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ గా పనిచేస్తోన్న సమయంలో ఓ స్మగ్లింగ్‌ ముఠాను పట్టుకుంటాడు. ఆ ముఠాకు చెందిన సభ్యులు ఆయన భార్యపిల్లల్ని హత్య చేస్తారు. ఆ ముఠాలో నాజర్‌ కూడా సభ్యుడే. పగతీర్చుకునేందుకు నమ్రతాను కిడ్నాప్‌ చేస్తాడు. కానీ మహేష్‌ తన మిత్రుడి కొడుకు అని తెలుసుకున్న కృష్ణ ప్రేమికులిద్దరిని కలపాలని నిశ్చయించుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి విలన్ల భరతం పడతారు.

సాధారణమైన కథకు భారీ ఖర్చుపెట్టి ఎందుకు తీశారో అర్థం కాదు. సినిమాలో చెప్పుకోవాల్సిందేమైనా ఉందా అంటే అజయ్‌ విన్సెంట్‌ కెమెరా పనితనం, బ్రహ్మనందం కామెడీ మాత్రమే. మహేష్‌ నటనలో కొంచెం ఈజ్‌ పెరిగింది. హీరోయిన్‌ పాత్ర గ్లామర్‌ కే పరిమితం అయింది. మయూరి కాంగో పాత్ర అవసరమేంటో దర్శకుడికే తెలియాలి. సంగీతం అతిసాధారణం. గోపాల్‌ దర్శకత్వం అంటే నమ్మలేని విధంగా ఉందీ చిత్రం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X