Vana Veera Movie Review: వనవీర మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating: 2.75/5

నటీనటులు: అవినాష్ తిరువీధుల, సిమ్రాన్ చౌదరీ, శ్రీ నందూ, శివాజీ రాజా, కోన వెంకట్, ఆమని, అప్పాజీ, చమ్మక్ చంద్ర, సత్య తదితరులు
దర్శకత్వం: అవినాష్ తిరువీధుల
నిర్మాతలు: శంతను పాథి, అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, అంకిత్ రెడ్డి
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
మ్యూజిక్: వివేక్ సాగర్
ఎడిటర్: చోటా కే ప్రసాద్
సినిమాటోగ్రఫి: సుజాత సిద్దార్థ్
బ్యానర్: ఏషియన్ సినిమాస్, సిల్వర్ స్క్రీన్ సినిమాస్ ఎల్ఎల్‌పీ, శంతను పతి
రిలీజ్ డేట్: 2026-01-01

వనపురం గ్రామానికి చెందిన రఘు (అవినాష్ తిరువీధుల) తన తండ్రి (శివాజీ రాజా), మరదలు ఇందు (సిమ్రాన్ చౌదరీ)తో సరదాగా జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. తన జోలికి ఎవరైనా వస్తే.. అంతు చూడకుండా ఉండే మనస్తత్వంతో ఉండే రఘు.. వారి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే అభ్యర్థి దేవా (శ్రీ నందూ)ను చూసి ఇన్స్‌స్పైర్ అయి ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొంటాడు. కానీ అనూహ్యంగా దేవాపై, అతడి అనుచరులపై రఘు తిరుగుబాటు చేస్తాడు. దేవాకు పోటీగా మరో అభ్యర్థిని పోటీకి నిలబెట్టి సవాల్ విసురుతాడు.

Vana Veera Movie Review and Rating in Telugu

అసలు రఘు జీవితంలో ఏం జరిగింది? ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న దేవాకు సపోర్ట్ చేయాలనుకొన్న రఘు తన వ్యూహాన్ని ఎందుకు మార్చాడు? దేవాకు రఘుకు ఉన్న వైరం ఏమిటి? దేవాకు ఎదురు తిరిగిన రఘుకు ఎలాంటి బెదిరింపులు వచ్చాయి? దేవా మనుషుల వార్నింగ్, దాడులను ఎలా తిప్పికొట్టాడు? దేవాకు రఘుకు ఉన్న కులవైరం ఏమిటి? రామయాణంలోని వానర జాతికి, ఈ సినిమా కథకు ఉన్న లింక్ ఏమిటి? దేవాపై రఘు ఎలాంటి ప్రతీకారం తీర్చుకొన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే వనవీర సినిమా కథ.

వనవీర సినిమాకు ముందు పెట్టిన పేరు వానర. సెన్సార్ అభ్యంతరాల కారణంగా వనవీర టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్రామాల్లో కుల రాజకీయాలు, కుల వివక్ష ఓ కుటుంబంపై ఎలాంటి ప్రబావం చూపించింది అనే పాయింట్ చుట్టే రాసుకొన్న యూత్‌ ఫుల్ ఎంటర్‌టైనర్. సినిమాను మంచి ఫీల్‌గుడ్ పాయింట్‌తో ప్రారంభించిన అవినాష్.. ఆ తర్వాత కంటెంట్‌పై కాస్త పట్టు జారిందనిపిస్తుంది. కొన్ని రొటీన్, రెగ్యులర్ సన్నివేశాలు కథావేగానికి అడ్డుపడ్డాయనిపిస్తుంది.

ఈ సినిమాలో హీరోగా నటించిన అవినాష్ స్వయంగా దర్వకత్వం కూడా వహించాడు. యాక్టింగ్ పరంగానే కాకుండా డైరెక్టర్‌గా కూడా తన ప్రతిభను, సత్తాను చాటుకొన్నాడు. కాకపోతే కంటెంట్‌పై మరింత దృష్టిపెట్టాల్సింది. ఇంటెన్స్, ఎమోషనల్ డ్రామాలో ఇంకా స్టోరీ పాయింట్‌ను ఎలివేట్ చేసే బలమైన సన్నివేశాలను రాసుకొని ఉంటే.. ఈ సినిమా మంచి రూరల్ డ్రామాగా మారి ఉండేది. గ్రామీణ నేపథ్యంగా సాగే కథలో రాజకీయాలతోపాటు ఆంజనేయస్వామి కాన్సెప్ట్‌ను కథలో జొప్పించిన తీరు బాగుంది. కమెడియన్ సత్య స్పెషల్ ఎంట్రీ ఈ సినిమాకు జోష్ పెంచేలా చేస్తుంది.

నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఈ చిత్రంలో నటుడు నందూ పోషించిన దేవా పాత్ర బాగుంది. విలన్ టచ్ ఉన్న పొలిటిషీయన్ పాత్రలో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. అవినాష్ నటనకు కొత్తవాడైనా అనుభవం ఉన్న నటుడిగా నందూతో పోటీపడి నటించాడు. అటు నటుడిగా, దర్శకుడిగా రెండు బాధ్యతలను సమర్ధవంతంగా పోషించాడు. సిమ్రాన్ చౌదరీ పాత్ర కనిపించినంత సేపు బాగుంది. గ్లామర్ పరంగానే కాకుండా యాక్షన్ ధమాకాను చూపించే కోణంలో ఆె పాత్ర సాగుతుంది. శివాజీ రాజా తదితరులు తమ పాత్రల పరిధి మేరకు రాణించారు.

ఈ సినిమాకు అత్యంత బలం సాంకేతిక అంశాలు, వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్, సుజాత సిద్దార్థ్ సినిమాటోగ్రఫి అంశాలు రిచ్‌నెస్‌ను తెచ్చిపెట్టాయి. గ్రామీణ వాతావరణంతో సాగే ఈ సినిమాలో సన్నివేశాలు కలర్‌ఫుల్‌గా పెయింటింగ్‌లా అహ్లాదకరంగా తెరపైన కనిపిస్తాయి. ఇక ఈ సినిమాను చోటా కే ప్రసాద్ తన ఎడిటింగ్‌తో పరుగులు పెట్టించారు. వివేక్ సాగర్ మ్యూజిక్, సాయి మాధవ్ బుర్రా మాటలు ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. ఈ సినిమాకు ముఖ్యంగా ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్బ్‌గా ఉన్నాయి. కంటెంట్ బలంగా చెప్పడానికి రాజీ పడకుండా క్వాలిటీతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చిన తీరు చూస్తే వారికి సినిమాలంటే ఎంతంటి ప్యాషన్ ఉందో తెలియజేస్తుంది. లవ్, యాక్షన్, రూరల్ డ్రామాతో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. రూరల్ నేటివిటి, రామాయణం, హానుమాన్ కాన్సెప్ట్‌తో మిళితమైన కథతో రూపొందిన ఈ సినిమా ఈ వారం మీరు చూసే జాబితాలో హ్యాపీగా చేర్చుకోవచ్చు. అంచనాలు లేకుండా మంచి అనుభూతిని పంచుతుంది.

More from Filmibeat

Read more about: nandu simran chowdary Vana Veera
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X