Vanda Devullu Movie Review: వంద దేవుళ్లు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.5/5

నటీనటులు: విజయ్ ఆంటోని, స్వాసిక విజయ్, అజయ్ దిశాన్, లిజోమోల్‌ జోస్, కరుణాస్, బాలాజీ శక్తివేల్, కావ్య అనిల్, అరుల్ దాస్ తదితరులు
దర్శకత్వం: శశి
నిర్మాత: విజయ్ ఆంటోని
మ్యూజిక్: బాలాజీ శ్రీరామ్
సినిమాటోగ్రఫి: ఎస్‌బీ దర్శన్ కిర్లోష్
ఎడిటర్: హరీష్ యువరాజ్
రిలీజ్ డేట్: 2026-06-19

యుక్త వయసులోనే వాసవి (స్వాసిక విజయ్) బర్త చనిపోవడంతో తన ఇద్దరు కొడుకులు భాస్కర్ (అజయ్ దిశాన్), వివేక్ పోషణ బాధ్యత తనపై పడుతుంది. రైతు కూలీగా జీవనం కొనసాగిస్తూ కొడుకులను కార్పోరేట్ చదువులు చదివిస్తుంది. భర్త లేకుండా ఒంటరి జీవితం గడుపుతుండటంతో గ్రామంలోని కొందరు పురుషులు ఆమెను లైంగికంగా వేధిస్తుంటారు. అయితే బొట్టు, పూలు పెట్టుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ.. గ్రామస్థుల భయంతో వాటికి దూరంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వాసవికి రెండో పెళ్లి ప్రపోజల్ వస్తుంది. కానీ కొడుకు భాస్కర్ తీవ్ర అభ్యంతరం తెలిపి గొడవ పెట్టుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. కానీ 4 ఏళ్ల తర్వాత తల్లికి రెండో పెళ్లి ఎంతో అవసరమని రియలైజ్ అవుతాడు. తొలుత రెండో కొడుకు అభ్యంతరం తెలిపినా ఆ తర్వాత తల్లి పెళ్లికి కన్విన్స్ అవుతాడు. ఆ క్రమంలో భార్య చనిపోయి ఒంటరి జీవితం గడుపుతున్న ఏడుకొండలు( విజయ్ ఆంటోని ) అనే రైతుతో పెళ్లి ఖాయం అవుతుంది.

Vanda Devullu Movie Review and Rating

వాసవి భర్త ఎలా చనిపోయాడు? ఇద్దరు కొడుకుల బాధ్యతను ఎలా తీసుకొన్నది? రెండో పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు వాసవి ఏం ఆలోచించింది? వాసవి రెండో పెళ్లిని తొలుత ఎందుకు వ్యతిరేకించాడు? ఆ తర్వాత ఎందుకు ఒప్పుకొన్నాడు? ఏడుకొండలుతో పెళ్లికి వచ్చిన అడ్డంకులు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే వంద దేవుళ్లు సినిమా కథ.

వంద దేవుళ్లు సినిమా కథ విషయానికి వస్తే.. బిచ్చగాడు ఫేమ్ శశి రాసుకొన్న ఎంచుకొన్న పాయింట్.. దానిని విస్తరించిన విధానంలో పస లేదనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో తల్లి కొడుకుల మధ్య ఎమోషనల్ సీన్లు చాలా నాసిరకంగా ఉన్నాయి. సినిమా తొలి భాగం పేలవమైన కథనంలో చాలా స్లోగా, కథ ముందుకు సాగకుండా అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో నైనా కథ ఏమైనా ఊపందుకొంటుందా? అనే వేచి చూసిన ప్రేక్షకుడికి నిరాశే మిగులుతుంది. సెకండాఫ్ చివర్లో విజయ్ ఆంటోని ఎంట్రీ ఇచ్చే వరకు కథలో ఎమోషన్స్ ఉండవు, చలనం ఉండదు. విజయ్ ఆంటోని వచ్చిన తర్వాత సన్నివేశాలు ఫీల్ గుడ్‌గా ఉంటాయి. క్లైమాక్స్‌లో పెళ్లి డ్రామా రక్తికట్టించేలా శశి తన అనుభవాన్ని ఉపయోగించారు.

వంద దేవుళ్ల సినిమా భారాన్నంత వాసవి పాత్రలో నటి స్వాసిక విజయ్ తన భుజాలపైన మోసింది. భర్త లేని మహిళ ఎలాంటి వేధింపులకు గురవుతుందనే కోణంలో సాగే పాత్రలో జీవించింది. అయితే బలమైన సన్నివేశాలు, ఎమోషన్స్ మిస్ అవ్వడంతో ఆమె కృషికి గుర్తింపు లేకుండా పోయింది. భాస్కర్ పాత్రలో అజయ్ దిశాన్ ఫర్వాలేదనిపిస్తాడు. అజయ్ దిశాన్ క్యారెక్టర్ డిజైన్‌లో క్లారిటీ మిస్ అయింది. అయినప్పటికీ.. పెర్ఫార్మెన్స్‌తో మెప్పించే ప్రయత్నం చేశాడు. విజయ్ ఆంటోనిది గెస్ట్ అప్పీయరెన్స్ రోల్. సినిమా చివర్లో తన స్క్రీన్ ప్రజెన్స్, ఫన్ సీన్లతో ఆకట్టుకొన్నాడు. ఆయన పాత్ర ఇంకాస్త ముందుగా వచ్చి ఉంటే సినిమా పరిస్థితి మరోలా ఉండేది అనిస్తుంది. బాలాజీ శక్తివేల్ తదితరులు ఫర్వాలేదనిపిస్తాడు. ఇతర నటీనటులు సినిమాకు కావాల్సిన సపోర్ట్ అందజేశారు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. కథలో బలం లేకపోవడం వల్ల టెక్నిషియన్స్ వర్క్ కూడా స్క్రీన్‌పై పెద్దగా ఎలివేట్ కాలేకపోయింది. మ్యూజిక్ నామమాత్రంగానే ఉంది. పాటలు అంతగా ఆకట్టుకొలేదు. ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్‌లో లోపాలు ఉన్నాయి. సినిమాటొగ్రఫి మంచి అవుట్‌పుట్ ఇచ్చారు. పల్లె, గ్రామీణ వాతావరణాన్ని చక్కగా కెమెరాలో బంధించారు. స్క్రీన్ ప్లే బాగాలేదు. సన్నివేశాలు బలహీనంగా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఓవరాల్‌గా కాన్సెప్ట్ బాగుంది. కానీ ఎగ్జిక్యూషన్‌లో లోపాలు ఉన్నాయి. విజయ్ ఆంటోని సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X