twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Varudu Kavalenu Movie Review: పెళ్లిచూపులు లాంటి ప్రేమకథ

    |

    Rating: 3/5

    తెలుగు సినీ తెర మీద పెళ్లి, పెళ్లిచూపులు కథాంశంతో కూడిన ప్రేమకథలు ఎన్నో వచ్చాయి. అయితే ప్రతీ చిత్రం ఏదో విభిన్న పాయింట్‌తో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాయి. అయితే తాజాగా పెళ్లి, పెళ్లిచూపులు, ప్రేమ కథ అంశాలతో వచ్చిన చిత్రం వరుడు కావలెను. యువ హీరో, హీరోయిన్లు నాగశౌర్య, రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య తొలి దర్శకురాలిగా ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఈ చిత్రం ఎలాంటి అనుభూతిని కలిగించిందనే విషయంలోకి వెళితే..

    వరుడు కావలెను కథ ఇలా

    వరుడు కావలెను కథ ఇలా

    ప్యారిస్‌లో ఆకాశ్ (నాగశౌర్య) ఆర్కిటెక్ట్. ఎన్నో ఏళ్లుగా సాగిస్తున్న యాంత్రిక జీవితంపై విసుగుపుట్టి స్వదేశానికి రావాలని అనుకొంటాడు. కోట్ల రూపాయల ప్రాజెక్టును వదులుకొని ఇండియాకు వచ్చేస్తాడు. ఆ క్రమంలో ముక్కొపి, కెరీర్‌ తప్ప మరో విషయంపై దృష్టిపెట్టని భూమి (రీతూ వర్మ) రూపొందించే ఓ ప్రాజెక్ట్ కోసం ఆర్టిటెక్ట్‌గా చేరుతాడు.

    భూమి కట్టుబొట్టు, యాటిట్యూడ్ చూసి దగ్గరవుతాడు. అయితే ఆకాశ్‌ తన పట్ల చూపించే ప్రేమానురాగాల కారణంగా తన ప్రవర్తనను మార్చుకొంటుంది. ఈ క్రమంలో ఒకరినొకరు ప్రేమను వ్యక్తం చేసుకోవాలనుకొంటారు. కానీ ఓ విషయం వారి ప్రేమకు చిన్న జర్క్ ఇచ్చి వారి గతంలోకి తీసుకెళ్తుంది.

    వరుడు కావలెను మూవీలో ట్విస్టులు

    వరుడు కావలెను మూవీలో ట్విస్టులు

    అయితే ఆకాశ్ ప్రేమను భూమి అంగీకరించిందా? కోపం, పట్టుదల విషయంలో భూమి తన ప్రవర్తను ఎందుకు మార్చుకొన్నది? ఆకాశ్ తన ప్రేమను భూమికి వ్యక్తీకరించాడా? ఆకాశ్ జీవితంలో జరిగిన సంఘటనలు ఏమిటి? భూమి జీవితంలో ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఆకాశ్, భూమి జీవితాలకు సంబంధించిన గత అనుభూతులు ఏమిటి? చివరకు భూమి, ఆకాశ్ ప్రేమకు ముగింపు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే వరుడు కావలెను సినిమా కథ.

    కథ, కథనాలు ఎలా సాగాయంటే..

    కథ, కథనాలు ఎలా సాగాయంటే..

    వరుడు కావలెను సినిమా కథ అందరి ఇంట్లో ఉండే పెళ్లి గొడవతోనే మొదలవుతుంది. వయసు వచ్చిన పిల్లలు ఇంట్లో ఉంటే తల్లిదండ్రులు పెట్టే పోరుతో చక్కటి ఫ్యామిలీ వాతావరణంతో ఫీల్‌గుడ్ డైలాగ్స్‌తో ప్రారంభం అవుతుంది. ఇక నాగశౌర్య ఇండియాకు వచ్చి రీతూ వర్మను కలిసి తర్వాత అప్పటి వరకు స్లోగా సాగిన సన్నివేశాలు కాస్త జోరు అందుకొంటాయి.

    ఈ కథను డైలాగ్ డ్రామాగా మార్చడంతో ప్రతీ పది నిమిషాలకు మాటలు మనసును ఆకట్టుకొనేలా వినిపించడమే కాకుండా పెదవిపై చిరునవ్వును చిగురింపజేస్తాయి. దర్శకురాలు లక్ష్మీ సౌజన్య చాలా నెమ్మదిగా.. నింపాదిగా, హడావిడిగా కథ చెప్పడం ఆకట్టుకొన్నది. తొలి భాగంలో అషురెడ్డి, ప్రవీణ్ వేసే పంచులతో వినోదంగా, హీరో, హీరోయిన్ల సన్నివేశాలు ఫీల్‌గుడ్‌గా సాగుతాయి. ఓ ఎమోషనల్ ఎపిసోడ్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్.. సినిమా ద్వితీయార్థంపై ఆసక్తిని పెంచుతుంది.

    సెకండాఫ్‌లో ఎలా ఉందంటే..

    సెకండాఫ్‌లో ఎలా ఉందంటే..

    వరుడు కావలెను సెకండాఫ్‌ విషయానికి వస్తే సినిమాకు కీలకంగా మారింది.. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌తోను, అలాగే దిగు దిగు నాగ పాటతో జోష్‌గా కనిపిస్తుంది. కాలేజ్ ఎపిసోడ్స్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా మారుతాయి. ఇక అరకు ఎపిసోడ్ కథావేగం మరీ నెమ్మదించినట్టు అనిపించే సమయంలో సాయి ఎంట్రీతో ల్యాగ్ ఎపిసోడ్ సినిమాకు హిలేరియస్‌గా మారుతుంది. క్లైమాక్స్‌ సన్నివేశాలు సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్తాయి. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనే ఫీలింగ్ కలిగిస్తుంది.

    దర్శకురాలి ఫస్ట్ అటెంప్ట్ ఎలా ఉంది?

    దర్శకురాలి ఫస్ట్ అటెంప్ట్ ఎలా ఉంది?

    దర్శకురాలు లక్ష్మీ సౌజన్య అందరికి సుపరిచితమైన కంటెంట్‌నే కొత్తగా భావోద్వేగాలను నింపి వరుడు కావలెనుగా అందించింది. ప్రయోగాలకు వెళ్లకుండా సేఫ్ జోన్‌లో అందర్ని కనెక్ట్ చేసే పెళ్లి అంశాన్ని మరోసారి తనదైన శైలిలో చెప్పేందుకు ప్రయత్నించడమే కాకుండా మంచి మార్కులే కొట్టేసింది. తన కథకు బలమైన డైలాగ్స్, మంచి స్క్రీన్‌ప్లేను సమకూర్చుకొని ఎలాంటి తడబాటు లేకుండా హైవే రైడ్ కొనసాగించినట్టు కథను చెప్పింది. కాకపోతే కథనమే మరీ స్లోగా ఉండటం కొంత ప్రతికూలం అని చెప్పవచ్చు. మిగితా విషయాల్లో ఎలాంటి కంప్లయింట్స్ కనిపించవు.

    నాగశౌర్య, రీతూ వర్మ పెర్ఫార్మెన్స్ గురించి

    నాగశౌర్య, రీతూ వర్మ పెర్ఫార్మెన్స్ గురించి

    తన మొదటి సినిమా నుంచే నాగశౌర్య విభిన్నమైన పాత్రలను ఎంచుకోవడం తెలిసిందే. వరుడు కావలెను విషయానికి వస్తే ఓ ఎమోషనల్ క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. సినిమా సగభారాన్ని తన తీసుకొని.. మరో సగం భాగాన్ని రీతూ వర్మకు అప్పగించారు. రీతూ వర్మ చీరకట్టులో తెర మీద నిండుగా కనిపిస్తే.. నాగశౌర్య తన యాక్టింగ్‌తో ఆకట్టుకొన్నాడు, ఎమోషనల్‌ సీన్లలో నాగశౌర్య హావభావాలు ప్రేక్షకులను టచ్ చేస్తాయి. కాసేపు మాస్ క్యారెక్టర్‌లో కూడా అలరించాడు. ఈ సినిమాలో కథ, పాత్రల పరిధి మేరకు నాగశౌర్య, రీతూ వర్మ పోటాపోటీగా నటించారు.

     నదియా, మిగితా క్యారెక్టర్ల ప్రతిభ

    నదియా, మిగితా క్యారెక్టర్ల ప్రతిభ

    వరుడు కావలెను సినిమాలో మిగితా క్యారెక్టర్ల విషయానికి వస్తే.. నదియా సినిమాకు వెన్నముకగా నిలిచారు. కథతోపాటు సాగుతూ సినిమాకు బలంగా నిలిచారు. కాఫీ షాప్‌లో పెళ్లిచూపులు సన్నివేశాల్లోను, అలాగే ఇంటిలోని కుటుంబ సభ్యులతో కూడా సన్నివేశాల్లో మంచి అనుభూతిని కలిగించే తల్లిగా ఆకట్టుకొన్నారు. ఇక ఈ చిత్రం హిమజ తనదైన శైలిలో ఫీల్‌గుడ్ కామెడీని అందించారు. అలాగే వెన్నెల కిషోర్ మార్కు కామెడీని ప్రేక్షకులకు మంచి వినోదంగా మారింది. బిగ్‌బాస్ ఫేమ్ దేత్తడి హరిక ఉన్న పెద్దగా గుర్తింపు లేని పాత్రకే పరిమితమైంది. మిగితా పాత్రల్లో నటించిన వారు న్యాయం చేశారు.

    టెక్నికల్ విభాగాల పనితీరు

    టెక్నికల్ విభాగాల పనితీరు

    వరుడు కావలెను సినిమా సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. నరేష్ అందించిన వంశీ పచ్చిపులుసు అందించిన సినిమాటోగ్రఫి సినిమాకు హైలెట్. లైటింగ్‌ గానీ, ఆర్ట్ విభాగంతో సమన్వయం తెర మీద రిచ్‌గా కనిపించేలా చేశాయి. రీతూ వర్మ ఆఫీస్ సీన్లు, అరకు సీన్లు, అలాగే కాలేజ్ ఎపిసోడ్‌లో సీన్లు బాగున్నాయి. ఇక దిగు దిగు దిగు నాగ పాట తప్పిస్తే.. మిగితా పాటలన్నీ సినిమాకు మైనస్. కథలోని ఫీల్‌కు పాటలు అడ్డుకొట్ట వేశాయా అనే అనుమానం కలుగుతుంది. కాకపోతే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా సన్నివేశాలను మరింత ఎమోషనల్‌గా మార్చాయి. గణేష్ రావూరి మాటలు బాగున్నాయి.

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    సితారా ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలకు సంబంధించి ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్‌గా ఉంటాయనేది కొత్తగా చెప్పనక్కర్లేదు. పాత్రలకు తగినట్టు నటీనటుల ఎంపిక ఈ సినిమాకు బలంగా మారింది. లొకేషన్లు, కథ డిమాండ్ మేరకు పెట్టిన ఖర్చు ప్రతీ ఫ్రేమ్‌లోను కనిపిస్తుంది. నాగవంశీ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    ప్రేమ, ఫ్యామిలీ వ్యాల్యూస్‌తో కూడిన చక్కటి కుటుంబ కథా చిత్రం వరుడు కావలెను. పాత్రల మధ్య భావోద్వేగాలు, నటీనటుల ఫెర్ఫార్మెన్స్ సినిమాకు మరింత ప్లస్ అయ్యాయి. కథ సాగడం కాస్త స్లోగా అనిపించినా.. దానికి ఓ పర్పస్ ఉందనేది స్పష్టమవుతుంది. పండుగ సమయంలో కుటుంబ సభ్యులంతా కలిసి చూసే చిత్రంగా వరుడు కావలెను తెరకెక్కించారు. పళ్లెంలో అని రుచులతో కూడిన భోజనాన్ని అరిటాకులో వడ్డించినట్టు అనిపిస్తుంది. దీపావళి సమయంలో సినీ అభిమానులు కేరాఫ్ అడ్రస్ మాత్రేమే కాకుండా కొన్న టికెట్ పైసా వసూలు అని చెప్పవచ్చు.

    Recommended Video

    Akash Puri 'Romantic' Movie Team Interview
    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నాగశౌర్య, రీతువర్మ, నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష, హిమజ, దేత్తడి హారిక తదితరులు
    కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య
    నిర్మాత: సూర్య దేవర నాగవంశీ
    మాటలు: గణేష్ కుమార్ రావూరి
    ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు
    సంగీతం: విశాల్ చంద్రశేఖర్
    ఎడిటర్: నవీన్ నూలి
    ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్
    పి.ఆర్.ఓ. లక్ష్మీవేణుగోపాల్
    సమర్పణ: పి.డి.వి.ప్రసాద్

    English summary
    Varudu Kavalenu movie review: Varudu Kavalenu' marks the directorial debut of Lakshmi Sowjanya. Starring Naga Shaurya and Ritu Varma in the lead roles. This movie release d on October 29th in theatres. Here is the exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X