twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కుర్రాళ్ళు రావటం కష్టమే(కుర్రాడు రివ్యూ)

    By Srikanya
    |
    Kurradu
    Rating
    -జోశ్యుల సూర్య ప్రకాష్
    సినిమా: కుర్రాడు
    సంస్థ: ఆనంది ఆర్ట్స్‌
    నటీనటులు: వరుణ్‌ సందేశ్‌, నేహా శర్మ, బొమ్మాళి రవి, తనికెళ్ల భరణి,
    వేణు, ఎమ్మెస్‌ నారాయణ, నవీన్‌ తదితరులు.
    కథ: వెట్రిమారన్
    మాటలు: తోట ప్రసాద్
    సంగీతం: అచ్చు
    కెమెరా: సర్వేష్ మురారి
    నేపధ్య సంగీతం: కోటి
    ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్
    నిర్మాత: పి.కిరణ్
    స్క్రీన్ ప్లే..దర్శకత్వం: గుణ్ణం సందీప్‌

    డైరక్టర్ గా పరిచయమయ్యే వారు సాధారణంగా రీమేక్ లు చేయటానికి ఇష్టపడరు. ఎందుకంటే హిట్టయితే ఆ క్రెడిట్ ఒరిజనల్ చిత్రానికి వెళ్ళిపోతుంది. ఫ్లాఫ్ అయితే..చూసీ కాపీ చేయటం కూడా చేతకాలేదనే విమర్శలు వస్తాయి. కానీ ఐతే, అమృతం వంటి విభిన్న కాన్సెప్ట్ లతో ముందుకొచ్చిన గుణ్ణం గంగరాజు గారి కుమారడు సందీప్ గుణ్ణం ఆ ధైర్యం చేసాడు. తమిళంలో హిట్టయిన పొల్లాదవాన్ ని తీసుకొచ్చి కుర్రాడుగా అనువదించాడు. అయితే అక్కడ కథ, కథనంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోకుండా దించాడు. దాంతో అక్కడ హిట్టు అవటానికి ఉన్న రకరకాల కారణాలు ఇక్కడ వర్కవుట్ కాలేదు.

    వరుణ్ కు చిన్నప్పటి నుంచీ బైక్ అంటే పిచ్చి.స్వంత బైక్ కొనుక్కోవటానికి మిడిల్ క్లాస్ జీవితం సహకరించదు. మరో ప్రక్క పనీ పాటా లేకుండా ప్రెండ్స్ తో తిరగటమే జీవిత పరమావధిలా ఫీలవుతునన్నాడని తండ్రి(తణికెళ్ళ) తిడుతూంటాడు.ఓ రోజు త్రాగి రావటంతో ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగి..తండ్రిపై నువ్వేమీ నాకు చేయటం లేదని రెచ్చిపోతాడు. దాంతో ఆ తండ్రి హర్టయి..కూతురు పెళ్లి కోసం దాచి ఉంచిన డబ్బై వేలు తెచ్చి ఇస్తాడు. అప్పుడు మన హీరో గారు టీవీఎస్ అపాచీ బైక్ కొనుక్కుని తన కల తీర్చుకుంటాడు.ఓ బ్యాంక్ లో రికవరీ ఏజెంట్ గా జాబ్ సంపాదిస్తాడు. అంతేగాక ఎన్నాళ్ళగానో లైన్ వేస్తున్న తన గర్ల్ ప్రెండ్(నేహా శర్మ)కి దగ్గరవుతాడు. ఇలా అంతా హ్యాపీస్ అనుకున్న సమయంలో ట్వీస్ట్ పడుతుంది. ఆ బైక్ దొంగతనం జరుగుతుంది. పరిస్ధితులు తిరగబడతాయి..ఆ స్ధితిలో ఏం చేస్తాడు..పోయిన ఆ బైక్ ఎలా దొరికింది..ఈ కథలోకి విలన్ సత్య(బొమ్మాళి రవి)ఎలా వచ్చాడు...అన్న విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

    పై కథ చదివినా,ఈ సినిమా చూసినా పాపులర్ క్లాసిక్ బైస్కిల్ ధీవ్స్ ,రీసెంట్ గా రిలీజైన రైడ్ సిన గుర్తుకు వస్తాయనటంలో సందేహం లేదు. ఎందుకంటే ఆ తమిళ సినిమా బైస్కిల్ ధీప్ ఆధారంగా చేస్తే,రైడ్ చిత్రం పొల్లాదవాన్ ఆధారంగా చేసారు. కాబట్టి ఈ కథ కొత్తనిపించదు. సరే ఈ రెండు చూడని వారికి ఈ కథ నచ్చుతుందా అంటే..కష్టమే. ఎందుకంటే హీరోయిన్ ట్రాక్, అలీ కామిడీ ట్రాక్, విలన్ ట్రాక్ ఏవీ కథలో కలవకుండా జరుగిపోతూంటాయి.వాళ్ళని కలిసినప్పుడు మాత్రమే ఓహో వీళ్ళూ కథలో ఉన్నారనిపిస్తుంది.అంతేగాక విలన్ ఫ్యామిలీ స్టోరి, తమ్ముడుతో శతృత్వం కథ పెరిగిపోయి..హీరో స్టోరిని మించిపోయాయి. హీరోకు బైక్ దొరుకుతుందా లేదా అనే దాని కన్నా విలన్ పరిస్ధితి ఏమవుతుందనే క్యూరియాసిటీ చూసేవాళ్ళలో పెరిగిపోతుంది.ఇక వీటికి తోడు హీరోయిన్ నేహాశర్మ చక్కగా ఒక్క ఎక్సప్రెషన్ కూడా పలకకుండా కోల్గెట్ యాడ్ లా ఎప్పుడూ నవ్వూతూంటుంది. పాటలు వచ్చినప్పుడు డాన్స్ చేసి వెళ్ళటం తప్ప ఆమె పాత్ర కథలో కలవదు. ఇక అలీ జంపు జిలానీ పాత్ర..జంప్ అయిపోతే బావుండనే ఫీలింగ్ కలగచేసింది.బ్యాంకు లోన్ తీసుకున్న అలీ అది తీర్చకుండా రకరకాల వేషాల్లో హీరో ని మోసం చేసి పారిపోతూంటాడు.హీరో అలాంటి పనులు చేస్తూంటే నవ్వు వస్తుందేమో కానీ, హీరోనే మోసం చేస్తే అయ్యో పాపం అని జాలి వస్తుంది.అప్పటికీ ఫస్టాఫ్ కుర్రాళ్ళోయ్..కుర్రాళ్ళు అనే పాటతో కిక్కిచ్చి కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తుంది. సెకెండాప్ కు వచ్చేసరికి ఆ మాత్రం సీన్ కూడా కనపడక, నిముష నిముషానికి కథ ..హీరోని వదిలేసి విలన్ చుట్టూ తిరుగుతూ సహన పరీక్ష పెడుతుంది.

    ఇన్ని అవకతవకలు ఉన్న ఈ సినిమాలో విలన్ గా బొమ్మాళి రవి నటనే కాస్త చూడటానికి బావుంది. అలాగే మిగిలిన విభాగాల్లో కాస్త రిలీఫ్ పాటలే...(అవీ రెండో..మూడో మాత్రమే బావుంటాయి).దర్శకుడుకి గతంలో టీవీ సీరియల్స్ చేసిన అనుభవం ఈ చిత్రాన్ని కొన్ని సన్నివేశాలని టీవీ సీరియల్ గా మార్చటంలో బాగా ఉపయోగపడింది.అలాగే తోట ప్రసాద్ డైలాగ్స్ పెద్దాగా పేలలేదు. వరుణ్ సందేశ్ విషయానికి వస్తే..అతను మాస్ హీరోగా ఎదగాలన్న తాపత్రయం ఈ కథను ఓకే చేయటంలో కనిపిస్తుంది. కానీ తమిళంలో ధనుష్ కున్న ఎనర్జీలో సగం చూపినా ఈ చిత్రం పాస్ అవును. అలాగే పోస్టర్స్ లో వరుణ్ ని చూసి వెళ్ళిన వారు అది ప్రేమ కథ కాకపోవటంతో నిరాశచెందటం మరో దురదృష్టం. గతంలో ఉదయ్ కిరణ్, తరుణ్, అబ్బాస్ లు కూడా లవర్ బోయ్ ఇమేజ్ ని వదిలించుకుందామని చూసారు..కానీ వారిని పరిశ్రమే వదిలించుకుంది. వీరందరు కన్నా ఎమ్మెస్ నారాయణ కనిపించింది రెండు సీన్లే అయినా న్యాయం చేసారు..తన రెగ్యులర్ తాగుబోతు నటనతో. ఇక దర్శకుడుగా సందీప్ చెప్పుకోదన మెరుపులు ఏమీ మెరిపించలేకపోయాడు. ఎడిటింగ్, కెమెరా అధ్బుతం కాదుకానీ,ఫరవాలేదనిపించుకున్నాయి.

    ఏదైమైనా ఈ కుర్రాడు..కుర్రకారుని ఆకట్టుకోవటం కష్టమే. కుర్రకారుని ఆకట్టుకోకపోతే వరుణ్ సందేశ్ కు మార్కెట్ లేదు.అంతేగాక ఫ్యామిలీలను మిడిల్ క్లాస్ సెంటిమెంట్ తో ఆకట్టుకుందామన్నా ఫలించే వ్యూహం కనపడటం లేదు.మరో రీమేక్ బోల్తా పడిందనాలో..మరో కొత్త దర్శకుడు క్రియేటివిటి లేమితో కుప్పకూలాడనాలో తెలియని స్ధితి ఏర్పాటు చేసిందీ సినిమా. ఫైనల్ గా దర్శకుడు..యాక్షన్ సీక్వెన్స్ లు సినిమాలో బాగా తీసాడు కాబట్టి సొంత కథ పట్టుకుంటే పెద్ద హీరోలు ఒప్పుకునే అవకాశం ఉంటుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X