Induvadana movie review.. వరుణ్ సందేశ్, ఫర్రాజ్ శెట్టి కెమిస్ట్రీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా

Rating: 2.75/5

నటీనటులు: వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి, రఘుబాబు, ధన్ రాజ్, ఆలీ, నాగినీడు, సురేఖవాణి, తాగుబోతు రమేష్, మహేష్ విట్టా, పార్వతీశం తదితరులు
దర్శకత్వం: ఎం శ్రీనివాస రాజు
నిర్మాత: మాధవి అదుర్తి
మ్యూజిక్: శివ కాకాని
కథ: సతీష్ ఆకేటి
సినిమాటోగ్రఫి: బీ మురళీకృష్ణ
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
రిలీజ్ డేట్: 2022-01-01

ఇందువదన కథ ఏమిటంటే

ఇందువదన కథ ఏమిటంటే

వాసు ( వరుణ్ సందేశ్) ఫారెస్ట్ ఆఫీసర్. తన సిబ్బంది (ధన్‌రాజ్, మహేష్ విట్టా, పార్వతీశం)తో కలిసి అక్రమ కలప స్మగ్లింగ్‌ను ఆడ్డుకొనేందుకు విధుల నిర్వహిస్తుంటారు. అడవిలో గిరిజన యువతి ఇందు (ఫర్నాజ్ శెట్టి)ను చూసి వాసు తొలిచూపులోనే ప్రేమలో పడుతాడు. అయితే కులం కారణంగా వాసు, ఇందు ప్రేమను పెద్దలు నిరాకరిస్తారు. కానీ అనూహ్య పరిస్థితుల్లో ఇందు హత్యకు గురవుతుంది.

 ఇందువదనలో ట్విస్టులు

ఇందువదనలో ట్విస్టులు

ఇందు హత్యకు గురైన తర్వాత వాసు పరిస్థితి ఏమిటి? ఇందు హత్యకు గురైన తర్వాత వాసు తీసుకొన్న తీవ్రమైన నిర్ణయం ఏమిటి? ఇందును ఎవరు హత్య చేశారు? హత్యకు గురైన తర్వాత ఇందు తన ప్రత్యర్థులపై ప్రతీకారం ఎలా తీర్చుకొన్నది. ఇంకా ఈ కథలో ఆలీ, నాగినీడు, సురేఖవాణి, మహేష్ విట్టా పాత్రలు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఇందువదన సినిమా కథ.

ఇందువదన ఎలా ఉందంటే

ఇందువదన ఎలా ఉందంటే

ఇందుపై దాడి, ఫారెస్ట్‌లో మాఫియా ఎటాక్ లాంటి అంశాలతో కథ ఎమోషనల్‌గా మొదలవుతుంది. ఆ తర్వాత వాసు, ఇందు ప్రేమ సన్నివేశాలు సినిమాకు ఫీల్‌గుడ్ అంశాలుగా కనిపిస్తాయి. ఇందుగా ఫర్నాజ్ శెట్టి అందం, అభినయం ఆకట్టుకొనేలా ఉంటుంది. ఇంటర్వెల్‌‌కు ముందు మంచి ట్విస్టుతో సెకండాఫ్‌పై మరింత ఆసక్తి పెరుగుతుంది. సెకండాఫ్‌లో మహేష్ విట్టా, పార్వతీశం, ధన్ రాజ్ కామెడీతో సరదాగా సాగిపోతుంది. ఆలీ ఎంట్రీతో వినోదం మరింత ఆకట్టుకొనేలా ఉంటుంది. అయితే ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఎమోషనల్‌గా సాగడం థ్రిల్లింగ్‌గా ఉంటుంది. చివర్లో వరుణ్ సందేశ్‌కు సంబంధించిన ట్విస్ట్ సినిమాను మరో మెట్టు ఎక్కిస్తుంది.

వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ఫెర్ఫార్మెన్స్

వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ఫెర్ఫార్మెన్స్

ఇప్పటి వరకు వరుణ్ సందేశ్‌ను లవర్ బాయ్ ఇమేజ్‌తో చూశాం. కానీ ఇందువదన చిత్రంలో పలు రకాల వేరియేషన్స్ ఉన్న పాత్రలో కొత్తగా కనిపిస్తాడు. యాక్షన్, సీన్లు, ఎమోషనల్ సీన్లతో వరుణ్ సందేశ్ పెర్ఫార్మెన్స్ బాగుంది. వరుణ్ సందేశ్ అభిమానులకు మాత్రం కొత్త అనుభూతిని అందిస్తుంది. ఇక హీరోయిన్ ఫర్నాజ్ శెట్టి సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. గ్లామర్‌తోనే కాకుండా పెర్ఫార్మెన్స్‌తో మెప్పించింది. కొత్త నటి అనే ఫీలింగ్ ఎక్కడా కలగకుండా తన పాత్రలో దూరిపోయింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లలో పవర్ ప్యాక్‌గా చక్కటి ఫెర్ఫార్మెన్స్‌తో అందర్ని ఆకట్టుకొనేలా నటించింది.

ఇతర నటీనటులు గురించి

ఇతర నటీనటులు గురించి


ఇందువదన చిత్రంలో ఆలీ, మహేష్ విట్టా, పార్వతీశం, ధన్ రాజ్, తాగుబోతు రమేష్ హస్యంగా సున్నితంగా ఉంది. తమ పాత్రల పరిధి మేరకు నటీనటులు ఒకే అనిపించారు. నాగినీడు పోషించిన పాత్రకు సంబంధించిన ట్విస్టు కథను మలుపు తప్పడం పాజిటివ్ అంశంగా మారుతుంది. వరుణ్ సందేశ్‌కు తల్లిగా సురేఖ వాణి ఓ కీలక పాత్రలో కనిపిస్తుంది.

దర్శకుడు ఎంఎస్ఆర్ గురించి

దర్శకుడు ఎంఎస్ఆర్ గురించి


దర్శకుడు శ్రీనివాస రాజు ఎంచుకొన్న పాయింట్ రెగ్యులర్ అయినప్పటికీ.. ట్రీట్‌మెంట్ బాగుంది. పాత్రలను రాసుకొన్న విధానం, వాటిని తెరకెక్కించిన విధానం కొత్తగా ఉంది. ఫర్నాజ్ శెట్టిని చూపించిన విధానం ఆకట్టుకొన్నది. కథ, కథనాలపై మరింత దృష్టిపెట్టి ఉంటే బెస్ట్ హారర్, థ్రిల్లర్ అయి ఉండేదనిపిస్తుంది. తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఆంధ్ర ప్రాంతాలను కవర్ చేస్తూ కమెడియన్లతో పాత్రలు రాసుకొన్న తీరు బాగుంది.

సాంకేతిక విభాగాల పనితీరు

సాంకేతిక విభాగాల పనితీరు

శివ కాకాని మ్యూజిక్ బాగుంది. కీలక సన్నివేశాను రీరికార్డింగ్ బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రాఫర్ బీ మురళీకృష్ణ సన్నివేశాలను తెర మీద అందంగా చూపించాడు. లైటింగ్ వాడుకొన్న విధానం బాగుంది. మిగితా సాంకేతిక నిపుణుల ప్రతిభ బాగుంది. నిర్మాత మాధవి ఆదుర్తి పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల ఎంపిక సినిమాపై వారికి ఉన్న అభిరుచిని తెలియజెప్పింది.

Recommended Video

Induvadana Will Be My Comeback Movie - Varun Sandesh | Filmibeat Telugu
ఫైనల్‌గా

ఫైనల్‌గా

హారర్, థ్రిల్లర్, రొమాంటిక్, లవ్ అంశాలు కలబోసి రూపొందించిన చిత్రం ఇందువదన చిత్రం. నటీనటుల ప్రతిభ, ముఖ్యంగా ఫర్నాజ్ శెట్టి, వరుణ్ సందేశ్ ఫెర్ఫార్మెన్ ఆకట్టుకొనేలా ఉంది. యూత్‌ను ఆకర్షించే విధంగా ఫెర్నాజ్ శెట్టి, వరుణ్ సందేశ్ రొమాన్స్, కెమిస్ట్రీ ఉన్నాయి. ఆత్మలు, దెయ్యాలు లాంటి అంశాలతో కూడిన లవ్ స్టోరిలను ఆదరించే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. బీ, సీ సెంటర్లలో సినిమాకు మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది. ప్రమోషన్స్ గట్టిగా చేస్తే సాధారణ ప్రేక్షకుల మెప్పు పొందడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X