twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాసు- పాత చింతకాయే బాసూ!

    By Staff
    |

    Vasu
    -జలపతి
    చిత్రం: వాసు
    నటీనటులు: వెంకటేష్‌, భూమిక, అలీ, సునీల్‌, అచ్యుత్‌
    సంగీతం: హరీష్‌ జైరాజ్‌
    మాటలు: త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌
    నిర్మాత: కె.ఎస్‌.రామారావు
    కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: కరుణాకరన్‌

    యూత్‌ వెల్లువలో కొట్టుకుపోకుండా ఉండేందుకు పెద్ద హీరోలు కూడా యూత్‌ బాటలో నడిస్తే...ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో వాసు చిత్రం తెలుపుతుంది. వెంకటేష్‌ తో వాయిస్‌ ఆఫ్‌ యూత్‌ అంటూ చిత్రం తీయడమే పెద్ద తప్పు అయితే, మరీ పాత చింతకాయ పచ్చడి కథతో మళ్ళీ ఓ చిత్రాన్ని నూరడం క్షమించరాని నేరం. ఇప్పటికీ దాదాపు ఓ డజన్‌ చిత్రాలు ఇదే కథతో రూపొందాయి. రెండు భుజాలకు టట్టూస్‌ పెట్టుకొని, మెళ్ళో రకరకాల గొలుసులు వేసుకుంటే యువకుడు అయిపోతాడని వెంకటేష్‌ భావించాడా? వెంకీ పెట్టుకొన్న విగ్‌ అతని అసలు వయసును బయటపెట్టింది.

    'మీకు(తల్లితండ్రులు) మేం డాక్టర్లు, పోలీసు ఆఫీసర్స్‌, కలెక్టర్లు కావాలని ఉంటుంది. కానీ మా కోరికలు ఎందుకు పట్టించుకోరు. మా ఇష్టాఇష్టాలు అక్కర్లేదా' ఈ డైలాగ్‌ మీరు ఎన్ని సినిమాల్లో వినలేదూ. ఈ డైలాగ్‌ మీదే వాసు సినిమా అంతా. ఈ బోడి డైలాగ్‌ చుట్టు కథ తయారు చేసుకొని, కరుణాకరన్‌ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. రెండేళ్ళు కష్టపడి ఆయన ఈ కథ రూపొందించుకున్నాడట! దీనికి తోడు వెంకీ పిచ్చి, పిచ్చి యాక్టింగ్‌, కుర్రచేష్టలు చేయాలని ప్రయత్నించడం చిరాకుగా ఉంటుంది. ఇది సరిపోలేదన్నట్లు సిస్టర్‌ సెంటిమెంట్‌ మధ్యమధ్యలో వస్తుంటుంది.

    వెంకటేష్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌ కావాలని అనుకుంటాడు. వాళ్ళ నాన్న మాత్రం వెంకీ పోలీసాఫీసర్‌ కావాలని అనుకుంటాడు. తండ్రికి అబద్దం చెప్పి..మ్యూజిక్‌ ప్రాక్టీస్‌ చేస్తుంటాడు. ఇంతలో కరుణాకరన్‌ అన్ని సినిమాల్లో మాదిరిగానే హీరోయిన్‌ తటిల్‌ మని మెరుపులా రోడ్డు మీద పరుగెడతూ..హీరో మనసును చెదరగొడుతుంది. మ్యూజిక్‌ గాల్లోకి ఎగిరిపోయి..హీరోగారు హీరోయిన్‌ తో పాటలు పాడతూ..టైం పాస్‌ చేస్తాడు. క్లైమాక్స్‌ లో ఎలాగోలా ఓ మ్యూజిక్‌ కాంపిటీషన్‌ లో గెలుస్తాడు. తండ్రి కూడా పశ్చతాప చెంది, హీరో 'అసలు టాలెంట్‌ ' తెలుసుకుంటాడు.

    ఇదీ కథ. మంచి డైలాగ్‌ రైటర్‌ గా పేరుపొందిన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైలాగ్స్‌ సాధారణంగా ఉన్నాయి. స్క్రీన్‌ ప్లే లో కూడా పట్టులేదు. హీరో పొరపాటున ఒకరిమీద జారిపడడం...అలా ఇంకొకరి మీద పిండి పడడం..వేరే వారిమీద ఐస్‌ క్రీం పడడం...ఇలాంటి టిఫికల్‌, అతిసాధారణ కామెడీ సీన్స్‌ తో సినిమా నడిపించాడు కరుణాకరన్‌. చెలి చిత్రంతో సంచలనం సృష్టించిన సంగీత దర్శకుడు హరీష్‌ జైరాజ్‌ నిరాశపర్చాడు. రెండు పాటలు మినహా చెప్పుకోదగ్గ సంగీతం కాదు. 'సౌండ్‌' తప్ప మ్యూజిక్‌ లేదు. వెంకటేష్‌ నటన గురించి చెప్పుకోవడం దండగ. భూమిక నవ్వడం, ఫేషియల్‌ ఎక్స్‌ ప్రెషన్స్‌ ఇవ్వడానికే పరిమితం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X