twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒక 'వి' చిత్రం

    By Staff
    |

    V Chitram
    -జోశ్యుల సూర్యప్రకాష్‌
    సినిమా: ఒక 'వి' చిత్రం
    నటీనటులు: ప్రదీప్‌ పి. శెట్టి, వంశి, దీప, మధుశాలిని,
    రఘుబాబు, తెలంగాణ శకుంతల, తణికెళ్ల, ఎం.యస్‌. నారాయణ,
    శ్రీనివాస్‌ రెడ్డి, పూజా భారతి తదితరులు
    సంగీతం: శ్రీ మురళి
    పాటలు: శివగణేష్‌
    కొరియోగ్రఫీ: శంకర్‌, కృష్ణారెడ్డి
    కెమెరా: ఎస్‌. సందీప్‌ రెడ్డి
    ఎడిటింగ్‌: శంకర్‌
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తేజ
    సమర్పణ: దాసరి నారాయణరావు

    సినిమా తియ్యడమనేది ఒక సామాన్య కుర్రాడి కల. దాని అతి తక్కువ సమయంలో ఎలా నెరవేర్చుకున్నాడనేది ఆసక్తికరమైన పాయింటే. అందులోను 'చిత్రం'తో తెలుగు తెరపై తనదైన ముద్ర వేసిన తేజ తీస్తున్నాడంటే మరింత క్రేజు. కాని ఆ కలలు భగ్నమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 'బౌ ఫింగర్‌' అని కామెడి ఆంగ్ల చిత్రం స్ఫూర్తిగా దీన్ని తీసినా కామెడీని సీరియస్‌ చేయడాన్ని కథ, కథనాల్లో నిబద్ధత లేకపోవడం, పాత్ర చిత్రణ లేకపోవడం, చీప్‌ కామెడీ నిరాశకు గురి చేస్తాయి.

    సంతోష్‌బాబు (వంశి) పేరు, పొగరు ఉన్న పెద్ద స్టార్‌. పాలకొండలో ఉండే అతని వీరాభిమాని బలరాం (ప్రదీప్‌ పి. శెట్టి). లారీ క్లీనర్‌గా చేస్తూ ఎనిమిదవ తరగతి చదివాక అతను ఒక రోజు అనుకోకుండా ఫ్రెండ్స్‌తో తగువు పడతాడు. ఓ సంవత్సరంలో సంతోష్‌తో సినిమా తీస్తానని లేకపోతే చస్తానని పందెం కాసి, ఎగ్రిమెంట్‌ రాస్తాడు. తల్లి గాజులు తీసుకుని హైదరాబాద్‌లో వాలుతాడు. తెలంగాణ శకుంతల ఇంట్లో తనలాగే వచ్చిన మరి కొంత మంది ఔత్సాహికులతో దిగుతాడు. కవి ఫ్రీ ఫ్రీ (రాజేష్‌) సాయంతో రచయిత (రాళ్లపల్లి)కి అసిస్టెంటుగా జాయిన్‌ అవుతాడు. నాలుగు నెలలు క్లాప్‌ కొట్టే సినిమా కళను పట్టేసి స్క్రిప్టు రాసేసి సంతోష్‌ బాబు వెనక పడతాడు. అతని అసిస్టెంట్‌ పున్నారావు (రఘుబాబు)ని పట్టేసి కథ వినిపించబోతాడు. కాని సంతోష్‌బాబు బయటకు నెట్టేస్తాడు. ఏం చేయాలని ఆలోచించి ఎండ్రిన్‌ తాగేస్తాడు. ఫ్రెండ్స్‌ సాయంతో బతికి తల్లి ఓదార్పు, ప్రోత్సాహంతో ఎలాగైనా సినిమా తీస్తానని మరోసారి ప్రతిజ్ఞ చేస్తాడు. తెలంగాణ శకుంతలను మోసం చేసి డబ్బు సంపాయించి కెమెరామెన్‌ని మాట్లాడి సంతోష్‌బాబుకి తెలియకుండా షూటింగ్‌ ప్రారంభిస్తాడు. చివరకు ఇలా ప్రారంభమై ఎలా పూర్తి చేస్తాడనేది తెరపై చూడాల్సిందే.

    సినిమా తియ్యడం అనేది చాలా మంది కలే. కాని ఆ కల నెరవేరాలంటే కళని ఔపోశన పట్టాలి. సృజనాత్మకత ఉరకలెయ్యాలి. కాని పందాలు కాసి పరిగెట్టుకు వచ్చి విజయం సాధించడం అనేది రాంగ్‌ మెసేజీ. 'బౌ ఫింగర్‌'లో కాన్సెప్ట్‌ ఆ విధంగానే సరిగ్గా వుంటుంది. సినిమా తీయడం జీవిత లక్ష్యమైన స్టీవ్‌ మార్టిన్‌ చిన్నతనం ఉండి డాలర్లు పోగు చేసి, స్క్రిప్టు అంతటినీ రెడీ చేసుకుంటాడు. తనను నమ్మిన అందరినీ బాధపెట్టడం ఇష్టంలేని స్థితిలో ఆర్టిస్టుని మోసం చేయడానికి పూనుకుంటాడు. అంతేగాని దీనిలో లాగా పందెం కాసి స్వార్థంతో చేయడు. అప్పుడు సానుభూతి బాగా వర్కవుట్‌ అయి పాత్ర డెప్త్‌ పెరిగి ఎలాగైనా ఆ పాత్ర గెలవాలనే కోరిక చూసివారిలో పుడుతుంది. స్క్రీన్‌ప్లే స్ట్రెయిట్‌గా వెళ్లినా సెటప్‌ అయ్యేసరికి మొదటి వైపు వచ్చి ఇంటర్వెల్‌ రావడం జరిగింది. అంతేగాక ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఓ కొత్త పాత్ర ప్రత్యక్షమవుతుంది. స్క్రిప్టు సమస్యే. దాంతో ఆ పాత్రని అర్థం చేసుకోవడానికి సమయం తీసుకుని కథలో పడిపోతుంది. అలాగే సినిమాపై సెటైర్లు కథకు అడ్డుపడుతాయన్నది స్పష్టం. అనుభవం లేని అభిమానులు వస్తే వారి దర్శకత్వంలో హీరోలు సినిమాలు చేయాలా అనేది ప్రశ్న.

    ఇక పాత్రల్లో వంశి బాగా చేశాడు. తణికెళ్ల, కృష్ణభగవాన్‌, సుసాన్‌ వంటి సీనియర్లు మామూలుగానే సీన్లు పండించారు. కెమెరాతో విజువల్‌ ట్రీట్‌ చేస్తాడనే ఆశ అడియాసే. సంగీతం, పాటలు బాగా నాశిగా ఉన్నాయి. కోరియోగ్రఫీ ఓ పాటలో బాగుంది. ఎడిటింగే కొంత కాపాడింది. కాని కొన్ని సీన్లు జంప్‌లు వచ్చాయి. క్లైమాక్స్‌ కోర్టు సీను పండలేదు. ఉన్నంతలో రఘుబాబు బాగా చేశాడు. పాయింట్‌ వెరైటీది అయినా ఆశించే చిత్రం కాదిది.

    గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X