Vedha review శివ రాజ్‌కుమార్ వన్ మ్యాన్ షో.. ఎమోషనల్‌గా మర్డర్స్ మిస్టరీ

Rating: 3/5

నటీనటులు: శివరాజ్ కుమార్, ఘనవి లక్ష్మణ్, శ్వేత చెంగప్ప, ఉమశ్రీ, అదితి సాగర్, భరత్ సాగర్ తదితరులు
రచన, దర్శకత్వం: హర్ష
నిర్మాత: గీతా శివరాజ్ ‌కుమార్
సినిమాటోగ్రఫి: స్వామి జె గౌడ్
ఎడిటర్: దీపు ఎస్ కుమార్
సంగీతం: అర్జున్‌ జన్య
పీఆర్వో: వీఆర్ మధు
డిజిటల్ మీడియా: ప్రసాద్ లింగం
బ్యానర్: జీ స్టూడియో, గీతా పిక్చర్స్
రిలీజ్ డేట్: 2023-02-09

వేద కథ ఏమిటంటే?

వేద కథ ఏమిటంటే?


దుష్ట శక్తులను వెంటాడే వేద (శివ రాజ్‌కుమార్) తమ గ్రామ పరిధిలో తాను చెప్పిందే వేదంగా ఉంటుంది. అయితే
జైలు నుంచి విడుదలైన కూతురు కనక (అదితి సాగర్)తో కలిసి వేద దారుణంగా హత్యలు చేస్తుంటాడు. కోర్టులు, పోలీసులు పట్టించుకోకుండా తన జీవితాన్ని భ్రష్టుపట్టించిన నలుగురు వ్యక్తులను వెంటాడి.. వేటాడి చంపుతాడు.

 వేద సినిమాలో ట్విస్టులు

వేద సినిమాలో ట్విస్టులు


సొంత తల్లినే చంపి కూతురు కనక ఎందుకు జైలుకు వెళ్లింది? గ్రామంలోని ప్రతీ వ్యక్తికి న్యాయం చేసే వేద తన కుటుంబానికి ఎందుకు న్యాయం చేయలేకపోతాడు. ఏ పరిస్థితుల్లో తన కుటుంబాన్ని రక్షించుకోలేకపోతాడు. తన కుటుంబాన్ని నాశనం చేసిన స్వామిజీ, పోలీసు అధికారి, మరో ఇద్దరు గ్రామ పెద్దలపై ఎలా ప్రతీకారం తీర్చుకొన్నారు? వేద సాగిస్తున్న మారణ కాండకు పోలీస్ అధికారిణి రుద్ర (వీణ పొన్నప్ప) ఎందుకు సహాయం చేసింది? భార్య పుష్ప (గానవి లక్ష్మణ్) వేదకు ఎలాంటి పరిస్థితుల్లో దూరమైంది? అనే ప్రశ్నలకు సమాధానమే వేద సినిమా కథ.

ఫస్టాఫ్‌ థ్రిల్లింగ్‌గా

ఫస్టాఫ్‌ థ్రిల్లింగ్‌గా


కనక జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తండ్రితో కలిసి హత్యలు ఎందుకు చేస్తున్నారనే పాయింట్ సినిమా జర్నీ మొదలవుతుంది. ఒక్క హత్య చేసుకొంటూ కనక వెళ్తూ ఉంటే.. తండ్రి వెనుక అండగా తన పనితాను చేసుకొనే పాయింట్ చాలా ఎమోషనల్‌గా కనిపిస్తుంది. అయితే హింసాత్మక సన్నివేశాలు చాలా కష్టంగానే ఉన్నప్పటికీ.. దాని వెనుక వెంటాడే ఎమోషనల్ కంటెంట్ కథలో లీనం చేసేలా ఉంటుంది. తండ్రి, కూతుళ్లు దారుణంగా వ్యవహరించడం వెనుక లాజిక్‌ను దర్శకుడు డీల్ చేసిన విధానం పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. ఒక మంచి ఎమోషనల్ సీన్‌తో తొలి భాగం ముగుస్తుంది.

సెకండాఫ్‌‌లో ఫ్లాష్ బ్యాక్ బ్రహ్మండంగా

సెకండాఫ్‌‌లో ఫ్లాష్ బ్యాక్ బ్రహ్మండంగా


తండ్రి, కూతుళ్ల దుష్ట సంహారంతో రెండో భాగం కూడా చాలా ఎమోషనల్‌గా మొదలవుతుంది. ఫ్లాష్ బ్యాక్‌తో సాగే కథ గుండెను పిండి వేస్తుంది. కనక, వేద చేసే దుష్టసంహారం సరైనదనే ఫీలింగ్‌ను ప్రేక్షకులకు కలిగించేలా ఉంటుంది. చివరల్లో వచ్చే ట్విస్టు కథకు చాలా జస్టిఫికేషన్ ఇచ్చేలా ఉంటుంది. కథ మొత్తం కేజీఎఫ్ స్క్రీన్ ప్లేతో సాగగా.. సన్నివేశాలు భావోద్వేగంతో సాగుతాయి. రక్తపాతం ఎక్కువైనా.. కథలోని ఇంటెన్సిటీ ఆ లోపాన్ని అధిగమించేలా చేస్తున్నది.

 శివ రాజ్‌కుమార్, అదితి ఎలా చేశారంటే?

శివ రాజ్‌కుమార్, అదితి ఎలా చేశారంటే?


ఇక నటీనటులు విషయానికి వస్తే.. కనకగా అదితి సాగర్ అద్బుతమైన పెర్ఫార్మెన్స్‌ను కనబరిచింది. రౌద్రం, ఆవేశం, మౌనం లాంటి అంశాలను కళ్లతోనే పలికించింది. ఇక వేదగా శివ రాజ్‌కుమార్‌తో సమానంగా తన పాత్రను ముందుకు నడిపించింది. వేద సినిమాకు కర్త, కర్మ, క్రియగా మారిన కనక క్యారెక్టర్‌ను మరెవరూ చేయలేరనే ఫీలింగ్‌ను కల్పించింది. ఇక వేదగా శివ రాజ్‌కుమార్ వన్ మ్యాన్ షో అంటే ఎలాంటి సందేహం లేదు. డైలాగ్స్ చాలా తక్కువగా ఉండే పాత్రను కేవలం బాడీ లాంగ్వేజ్‌తో అద్బుతంగా నటించాడు. కళ్లతో చూపించిన తీరు భేష్ అనేలా ఉంటుంది.

గానవి లక్ష్మణ్ ఎమోషనల్‌గా

గానవి లక్ష్మణ్ ఎమోషనల్‌గా


వేద భార్యగా పుష్ప పాత్రలో గానవి లక్ష్మణ్ కథకు వెన్నుముకగా నిలిచిన పాత్రలో మెప్పించింది. వేశ్యగా నటించిన శ్వేతా చంగప్ప, పోలీస్ ఆఫీసర్‌గా నటించిన భరత్ సాగర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ముగ్గురు విలన్లుగా కనిపించిన నటులు కూడా కథకు బలంగా నిలిచారు. వేదకు తోడుగా ఉండే పెద్దవ్వ పాత్రలో నటించిన సీనియర్ నటి ఆకట్టుకొన్నారు. మిగితా పాత్రల్లో నటించిన వారు తమత మ పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు.

టెక్నికల్‌గా ఎలా ఉందంటే?

టెక్నికల్‌గా ఎలా ఉందంటే?


సాంకేతిక విభాగాలు పుష్కలంగా ఉన్న చిత్రం వేద. స్వామి జే గౌడ్ అందించిన సినిమాటోగ్రఫి ప్రతీ సీన్‌ను అందంగా తీర్చి దిద్దారు. యాక్షన్, ఎమోషనల్ సీన్లను బ్రహ్మండంగా తెరకెక్కించారు. ఇక సినిమా సంగీతాన్ని అర్జున్ జన్య అందించారు. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణంగా నిలిచింది. సెకండాఫ్‌లో పలు సీన్లు బీజీఎం కారణంగా మరో లెవెల్‌కు వెళ్లాయని చెప్పవచ్చు. ఎడిటర్ దీపు కుమార్ పనితీనం బాగుంది. ఖర్చుకు వెనుకాడకుండా, కంటెంట్ విషయంలో రాజీ పడకుండా సినిమాను నిర్మాత గీతా శివరాజ్ ‌కుమార్ అందించారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ హై రేంజ్‌లో ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X