Veera Dheera Soora Censor Review: వీర ధీర శూర సెన్సార్ రివ్యూ.. విక్రమ్, ఎస్‌జే సూర్య నువ్వా? నేనా?
హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై రియా షిబు నిర్మించిన చిత్రం వీర ధీర సూరన్: పార్ట్ 2. యువ దర్శకుడు ఎస్‌యూ అరుణ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, దుషారా విజయన్, సిద్దిఖీ, ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజరమూడు తదితరులు నటించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. క్రైమ్, యాక్షన్ చిత్రంగా రూపొందిన ఈ సినిమా సెన్సార్ రిపోర్టు విషయానికి వెళితే..
వీర ధీర సూర సినిమా సినిమా కథ విషయానికి వస్తే.. కిరాణం షాప్ నడుపుకొనే కాళి (విక్రమ్) ఓ ఫ్యామిలీ మ్యాన్. తన కుటుంబం తప్ప మిగితా జోలికి వెళ్లని కాళి.. ఊహించని విధంగా ప్రమాదకరమైన క్రైమ్, మాఫియా ఉచ్చులో చిక్కుకొంటారు. అరుణగిరి (ఎస్‌జే సూర్య) అనే పోలీస్ ఆఫీసర్‌తో పోరాడాల్సి వస్తుంది. ఈ చివరకు కాళీ ఏ విధంగా క్రైమ్ ముఠా ఆటకట్టించారనేది ఈ సినిమా కథ.

వీర ధీర శూర సినిమాను అత్యంత భారీ యాక్షన్ సీన్లతో తగెరకెక్కించారు. ఈ సినిమాను విజువల్ గ్రాండియర్‌గా తీర్చి దిద్దారనే విషయం టీజర్, ట్రైలర్ల రూపంలో స్పష్టమైంది. మాస్, క్లాస్ ఎలిమెంట్స్‌తో కుటుంబ కథాంశాలను జొప్పించి ఈ సినిమాను తెరకెక్కించారు. థేనీ ఈశ్వర్ సినిమాటోగ్రఫి ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది అని చిత్ర యూనిట్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
వీర ధీర శూర సినిమా విషయంలో ఆసక్తికరంగా ఓ విషయాన్ని హీరో వెల్లడించారు. పార్ట్ 1 రాకుండానే ఈ సినిమాకు పార్ట్ 2 అని టైటిల్ పెట్టారు. అయితే పార్ట్ 2 మూవీలో ఫ్లాష్ బ్యాక్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా పార్ట్ 1 పెట్టాలని నిర్ణయించాం. అందుకే ఈ సినిమాకు పార్ట్ 2 అని టైటిల్ ఫిక్స్ చేశామని విక్రమ్ చెప్పాడు.
సెన్సార్ బోర్డు వెబ్‌సైట్‌లో పొందుపరిచిన ప్రకారం.. ఈ సినిమాకు యూఏ (U/A) సర్టిఫికెట్ ఇచ్చినట్టు తెలిసింది. ఈ సినిమా థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్‌తోపాటు సినిమాటిక్ అనుభూతిని కూడా ఇస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విక్రమ్, దుషారా, ఎస్‌జే సూర్య, సురాజ్ నటన హైలెట్‌గా ఉంటుంది. వీరి పెర్పార్మెన్స్‌తోపాటు టెక్నికల్ అంశాలు కూడా ప్రేక్షకుడిని థ్రిల్ చేస్తాయి. ఈ సినిమా నిడివి సుమారుగా 2 గంటల 42 నిమిషాలుగా పేర్కొన్నారు. ఈ సినిమా సర్టిఫికెట్‌ను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











