Veera Dheera Soora Review: వీర ధీర శూర తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

మూవీ: వీర ధీర శూర - పార్ట్ 2
నటీనటులు: విక్రమ్, తుషారా విజయన్, 30 ఇయర్స్ పృథ్వీ, సూరజ్ వెన్జారమూడు, రమేష్ ఇందిర తదితరులు
కథ, దర్శకత్వం: ఎస్ యూ అరుణ్ కుమార్
నిర్మాతలు: రియా శిబు
సంగీతం: జీవి ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ: థేని ఈశ్వర్
రిలీజ్ డేట్: 2025-03-25

చాలా మంది ఈ చిత్రం ఒక పీరియాడిక్ టైం లో జరిగే కథ అనుకోవచ్చు కానీ ఈ సినిమాలో కథ ప్రస్తుత కాలంలోనే జరుగుతుంది. వరంగల్ జిల్లాలోని మేడిచర్ల గ్రామంలో బాగా పేరు మోసిన పెద్ద మనిషి రవి (30 ఇయర్స్ పృథ్వీ) అక్కడ పెద్దాయనగా చెలామణి అవుతారు. కాగా తనకి ఉన్న కొడుకు సూరజ్ వెన్రాజ్ (కన్నన్) కి ఆ ఏరియా ఇన్స్పెక్టర్ అరుణగిరి (ఎస్ జే) సూర్యకి కొన్నేళ్ల నుంచి వైరం ఉంటుంది. ఈ సమయంలో ఒక సరైన సమయం కోసం చూస్తున్న అరుణగిరికి ఒక సరైన సమయం దొరుకుతుంది.

Veera Dheera Soora Movie Review

ఒకరోజు రాత్రి తన భర్త కనిపించడం లేదు అని ఒకామె పెద్దాయన ఇంటికి వచ్చి పెద్ద గొడవ చేస్తుంది. ఆ తర్వాత ఆమె మిస్ అవ్వడం చిన్న లూప్ హోల్ గా ఎస్ జే సూర్యకి చిక్కుతుంది. ఈ ఛాన్స్ వదులుకోకూడదు అని ఆమె నిజంగా మిస్ అయినా కాకపోయినా ఫేక్ బాడీ పెట్టించి ఇద్దరు తండ్రీకొడుకులని ఎలాగైనా ఆ రాత్రికే చంపేయాలని పక్కా స్కెచ్ వేస్తాడు. ఇది గమనించిన పెద్దాయన తన కొడుకుని ఎలాగైనా కాపాడుకోవాలని చాలా ప్రయత్నిస్తాడు.

అలా ఎవరినీ నమ్మని పెద్దన అదే ఊరిలో ఉన్న కలైమని - కాళీగా పిలవబడే విక్రమ్ తన భార్య (తుషారా విజయన్) తమ పిల్లలతో కలిసి చిన్న కిరాణా కొట్టు పెట్టుకొని లైఫ్ లీడ్ చేస్తారు. అయితే అసలు తన గతం ఏంటి? పెద్దాయనకి కాళీకి ఉన్న సంబంధం ఏంటి? ఎస్ జే సూర్యని చంపడానికి సిద్ధమైన కాళీ రివర్స్ లో పెద్దాయన కొడుకునే ఎందుకు చంపుతాడు? అసలు చివరికి ఏమైంది అనేది అసలు కథ..

ఈ సినిమాలో ఆరంభమే మంచి ఆసక్తిగా మొదలవుతుంది. కథలో డెవలప్మెంట్ అలా నెమ్మదిగా ఒక సీన్ తర్వాత ఒక సీన్ ని డీసెంట్ కథనం అల్లికుంటూ ముందుకు వెళుతుంది. ప్రధానంగా సినిమాలో కనిపించే ఒక రకమైన సహజమైన కథనంలో చాలా ఇంటెన్సిటీ కనిపిస్తుంది. చాలా సీన్స్ లో అయితే అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది విక్రమ్ ఇచ్చే ట్విస్ట్ లు తాను తీసుకునే నిర్ణయాలు సినిమాలో ఆకట్టుకునే విధంగా కనిపిస్తాయి.

ఇలా ఆసక్తికర ప్రొసీడింగ్స్ తో కథనం ఇంటర్వెల్ ముందు వరకు డీసెంట్ గానే సాగుతుంది. అయితే ఇంటర్వెల్ బ్లాక్ లోనే ఎస్ జె సూర్యతో ఒక సన్నివేశం ఉంటుంది అక్కడ ఇంటర్వెల్ కానీ కట్ చేసి ఉంటే దాని ప్రభావం ఆడియెన్స్ కి గట్టిగా అనేది అలాగే ఫస్టాఫ్ లో దాదాపు అరగంట వరకు విక్రమ్ ఎంట్రీ కనిపించదు. అయినప్పటికీ డీసెంట్ గా సినిమా నడుస్తుంది. తాను వచ్చాక మరింత గ్రిప్పింగ్ గా మారుతుంది. అలానే కొన్ని మందు పాతర సీన్స్ మంచి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి.

ఇలా కంప్లీట్ అయ్యే ఫస్టాఫ్ తర్వాత సెకండాఫ్ కూడా ఇదే పేస్ లో కొనసాగుతుంది కానీ నెమ్మదిగా కథనం డ్రాగ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కథనం కొన్ని చోట్ల ఫాస్ట్ గా నడిపించి ఉంటే మంచి గ్రిప్పింగ్ గా అనిపించేది. ఇక సెకాండఫ్ లో మెయిన్ గా క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాలో హైలైట్ అని చెప్పవచ్చు. ఒక ఊరిలో గొడవలు జరిగితే అవి ఎలా ఉంటాయో వాటిని చాలా నాచురల్ గా దర్శకుడు చూపించడం ఒక రకమైన సాలిడ్ ట్రీట్ ని ఇలాంటి రా అండ్ రస్టిక్ సినిమాలు కోరుకునేవారికి మంచి ట్రీట్ అనిపిస్తాయి.

ఇంతకు ముందు వరకు కథనం అలా చాలా చోట్ల సాగదీస్తున్నట్టుగా అనిపిస్తుంది బట్ ఓకే అనిపిస్తాయి. ఇక వీటితో పాటుగా ఒక టైం లో ఈ సినిమా కథనం రొటీన్ గా చాలా సినిమాల్లో చూసిన పాత టెంప్లెట్ లోనే కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పంజా, ఇంకా మరికొన్ని సినిమాలు ఒక పెద్దాయన తన కొడుకుని చూసుకోమనే భాద్యత ఇస్తే దానిని హీరోనే చంపడం వంటివి పలు సినిమాల్లో చూసేసాం. కానీ ఇది కొంచెం వేరే నేపథ్యం వేరే కథనం కాబట్టి అవి అక్కడక్కడా గుర్తు రావచ్చు. ఇంకా సినిమాలో కొన్ని పాయింట్స్ ఇంకొంచెం డీటెయిల్డ్ గా చూపించాల్సి ఉంది కానీ వాటిని దర్శకుడు మిస్ చేశారు. అయితే సినిమా ఎక్కడైతే స్టార్ట్ అయ్యిందో క్లైమాక్స్ లో దర్శకుడు ఇచ్చిన బ్యూటిఫుల్ ఎండింగ్ బాగుంది.

ఇక నటీనటుల్లో అయితే డెఫినెట్ గా చాలా పేర్లు చెప్పుకోవాలి.. మొదటిగా విక్రమ్ నుంచే మొదలు పెడితే చియాన్ తన పాత్రలో దుమ్ము లేపేశారు. తనలోని నటుడు కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో సినిమాలలో తన పెర్ఫామెన్స్ చూసేసాం. అలానే ఇందులో కూడా విక్రమ్ తన మార్క్ సహజ నటనతో ఈ రోల్ ని పుల్ చేసారని చెప్పవచ్చు.

ఒక శివపుత్రుడు, ఈ మధ్య తంగలాన్ సినిమాల్లో ఒక ఊరి కుర్రాడి తరహా పాత్రల్లో ఎలా షైన్ అయ్యారో అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమాలో కూడా తనని తాను హింసించుకొని అదరగొట్టారు. మెయిన్ గా క్లైమాక్స్ పోర్షన్ లో తన డెడికేషన్ కి హ్యాట్సాఫ్ చెప్పొచ్చు. ఇక సినిమాలో మరో సర్ప్రైజ్ ప్యాక్ మాత్రం 30 ఇయర్స్ పృథ్వీ అని చెప్పడంలో డౌట్ లేదు. ఇన్ని రోజులు తెలుగులో కామెడీ రోల్స్ స్లైట్ నెగిటివ్ పాత్రలు చేశారు కానీ దాన వీర శూర సినిమాలో తన పాత్ర ఊహించనిది అని చెప్పవచ్చు.

కాగా అసలు నెగిటివ్ పాత్రలో తాను నటించిన తీరు అమోఘం. కీలక సన్నివేశాల్లో చూపించిన నెగిటివ్ షేడ్స్ ఇంకా తన నటన ఖచ్చితంగా అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. ఈ మధ్య రాయన్ సినిమాతో షైన్ అయ్యిన యువ బ్యూటీ తుషారా విజయన్ కి మరో మంచి పాత్ర దక్కింది. అలాగే విక్రమ్ తో కెమిస్ట్రీ కూడా బాగుంది. వీరితో పాటుగా ఎస్ జె సూర్య కూడా తన రోల్ లో అదరగొట్టారని చెప్పుకోవచ్చు. సమయాన్ని బట్టి ఎలాగైనా ప్లేట్ మార్చేసే కన్నింగ్ పోలీస్ గా కొన్ని నెగిటివ్ షేడ్ లో తాను పలికించే కొన్ని డైలాగ్స్ తెలుగు ఆడియెన్స్ కి స్ట్రైక్ అవుతాయి. వీరితో పాటుగా ఇతర నటీనటులు బాగానే చేసేసారు.

సాంకేతిక విభాగ పని తీరుకి వస్తే.. జీవి ప్రకాష్ ఇచ్చిన స్కోర్ సినిమాలో ఇంపాక్ట్ చూపిస్తుంది. కొన్ని సీన్స్ ని బాగా ఎలివేట్ చేసింది అని చెప్పవచ్చు. ఇంటర్వెల్ కి ముందు అలాగే క్లైమాక్స్ లో కొన్ని మాస్ మూమెంట్స్ ని తాను బాగా లేపాడు. అలాగే సినిమాటోగ్రఫీ సినిమాలో చాలా క్లీన్ గా ఉంది. ఒక్క రాత్రిలో నడిచే కథగా నైట్ షూట్ ని బాగా చూపించారు. ఎడిటింగ్ మాత్రం ఇంకా ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంది. సన్నివేశాలు బాగానే ఉన్నాయి కానీ ఈ చిత్రానికి టైట్ స్క్రీన్ ప్లే ఎంతైనా అవసరం ఉంది. దీనితో ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్ గా కట్ చేసి ఉంటే సినిమా ఇంకా బెటర్ గా వచ్చి ఉండొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాలో బాగున్నాయి. దర్శకుడు ఎంచుకున్న కథ రొటీన్ లైనే కానీ కథనం ఇంకా వేగవంతంగా డిజైన్ చేసుకొని ఉంటే బాగుండేది.

ఫైనల్ గా వీర ధీర శూర - పార్ట్ 2 మంచి ఇంటెన్సిటీతో కూడిన రూరల్ డ్రామా అని చెప్పవచ్చు. విక్రమ్ మరోసారి తనలోని నటుణ్ని అద్భుతంగా చూపిస్తే నటుడు 30 ఇయర్స్ పృథ్వీ ఒక సర్ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే సినిమాలో కథనం ఇష్యూస్ బాగా ఉన్నాయి. సినిమాని అనవసరంగా సాగదీసి లాక్కొచ్చారు. 2 గంటల 40 నిమిషాల్లో చూపించాల్సిన అవసరం లేదు. ఎడిటింగ్ ఇంకొంచెం టైట్ గా సెట్ చేసి కట్ చేసి ఉంటే ఇంపాక్ట్ ఇంకా బెటర్ గా ఉండేది. అయితే విక్రమ్ ఫ్యాన్స్ కి ఒకింత స్లో ఉన్నా సరే సాలిడ్ విలేజ్ యాక్షన్ సినిమాలు చూడాలి అనుకునేవారు ఒక ట్రై అయితే చేయవచ్చు.

More from Filmibeat

Read more about: vikram dushara vijayan sj suriya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X