Veera Dheera Sooran Twitter Review: వీర ధీర శూరన్ ట్విట్టర్ రివ్యూ

తమిళంలో ప్రముఖ నిర్మాణ సంస్థ హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై రియా షిబు నిర్మించిన చిత్రం వీర ధీర సూరన్: పార్ట్ 2. యువ దర్శకుడు ఎస్‌యూ అరుణ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, దుషారా విజయన్, సిద్దిఖీ, ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజరమూడు తదితరులు నటించారు.

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమా మార్చి 27వ తేదీన గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా ప్రీమియర్లు ఓవర్సీస్‌లో ప్రదర్శించబడ్డాయి. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు వెల్లడించిన రివ్యూలు, అభిప్రాయాల గురించిన వివరాల్లోకి వెళితే..

Veera Dheera Sooran Movie Twitter Review

తమిళనాడులో దర్శకుడు ఎస్‌యూ అరుణ్ కుమార్ రూపొందించిన వీర ధీర శూర సినిమాపై నెటిజన్లకు, అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్. అరుణ్ కుమార్ పేరు గుర్తుంచుకోండి. ఇది ప్రమోషనల్ ట్వీట్ కాదు. వీర ధీర శూర వావ్ అనేలా ఉంటుంది అని నెటిజన్లు వరుస ట్వీట్లు వేశారు.

వీర ధీర శూర సినిమా రా, రస్టిక్, రియలిస్టిక్ మేకింగ్‌తో నిర్మించారు. ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్లు, వాటికి నటీనటులు పర్‌ఫెక్ట్‌గా ఎంపిక చేశారు. చియాన్ విక్రమ్‌తోపాటు ఈ మూవీలో నటించిన వారందరూ వారి పాత్రల్లో జీవించారు. ఈ సినిమా ఎలాంటి వేరియేషన్స్ లేకుండా కొన్ని నిడివి ఎక్కువగా ఉన్న సీన్లతో రూపొందించారు. ఈ చిత్రం విక్రమ్ ఎదురైన పరాజయాలను మరిచిపోయేలా చేస్తుంది. ఇది సైలెంట్ బ్లాక్‌బస్టర్ అనే మాకు ఇన్‌సైడ్ రిపోర్టు ఉంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

వీర ధీర శూర సినిమాకు కొన్ని సాంకేతిక కారణాలు అడ్డుగా నిలిచాయి. ఈ సినిమా 27వ తేదీన తప్పకుండా రిలీజ్ అవుతుంది. చిత్ర యూనిట్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకొన్నది. ఈ సినిమాకు సంబంధించిన 9 గంటల షోలు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ ఆ షోలకు వీలు కాకపోతే 11 గంటలకు కానీ, 11.30 గంటలకు గానీ సినిమా షోలు పడుతాయి. కాళీ సంభవమే అని నెటిజన్ సమాచారం అందించారు.

సాంకేతిక కారణాల వల్ల వీర ధీర శూర సినిమా 9.30 గంటల షో క్యాన్సిల్ చేశాం. బుక్ మై షో నుంచి ఈ షోకు సంబంధించిన సమాచారాన్ని తొలగించాం. ఇప్పటికే బుక్ చేసుకొన్న వారికి డబ్బులు వాపసు చేస్తున్నాం. ఏడు రోజుల్లోగా మీ అకౌంట్లలోకి సొమ్ము జమ అవుతుంది. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని చిత్ర యూనిట్ వెల్లడించిన సమాచారాన్ని నెటిజన్ ఓ ట్వీట్ వేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X