twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Drushyam 2 movie review వెంకటేష్ ఖాతాలో మరో విక్టరీ.. దృశ్యం మూవీని మించిందా?

    |

    Rating: 3/5

    Recommended Video

    Drushyam 2 Movie Review | Venkatesh | Meena || Filmibeat Telugu

    విక్టరీ వెంకటేష్, మీనా జంటగా నటించిన దృశ్యం మూవీ 2014లో భారీ సక్సెస్‌గా నిలిచింది. ఆ తర్వాత సుమారు 7 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ సినిమాకు సీక్వెల్‌గా దృశ్యం 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోవిడ్ పరిస్థితుల కారణంగా దృశ్యం 2 చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదల చేశారు. దృశ్యం సినిమా మాదిరిగానే ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతిని మిగిల్చిందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథ, కథనాల గురించి తెలుసుకోవాల్సిందే..

     Venkateshs Drushyam 2 movie review and Rating

    కేబుల్ బిజినెస్ చేసే రాంబాబు (వెంకటేష్) సినిమా థియేటర్ ఓనర్‌గా మారారు. సినిమా తీయడమే తన జీవిత లక్ష్యంగా బతుకుతున్న రాంబాబును గతంలో జరిగిన వరుణ్ హత్య తన కుటుంబాన్ని వెంటాడుతుంది. సాఫీగా సాగుతున్న రాంబాబు జీవితంలోకి మళ్లీ పోలీస్ ఆఫీసర్ గీతా ప్రభాకర్ (నదియా), ప్రభాకర్ (నరేష్) మళ్లీ ప్రవేశిస్తారు. దాంతో మళ్లీ రాంబాబు కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది.

    ఆరేళ్ల క్రితం మరణించిన తన కొడుకు వరుణ్ కేసును ఎందుకు గీతా ప్రభాకరన్ దంపతులు తిరిగదోడారు? రాంబాబు నుంచి వారు ఏం ఆశించారు? గీతా ప్రభాకరన్ దంపతుల కోరికను రాంబాబు ఎందుకు తిరస్కరించాడు? రాంబాబు సినిమా తీసి తన లైఫ్ టైమ్ కోరికను తీర్చుకొన్నాడా? పోలీస్ అధికారి కొడుకు మరణం వెంటాడుతున్న నేపథ్యంలో రాంబాబు ఏం చేశాడు? పోలీస్ స్టేషన్‌లో పూడ్చిన వరుణ్ శవాన్ని పోలీసులు కనుగొన్నారా? ఒకవేళ వరుణ్ శవం లభించిన తర్వాత రాంబాబుకు శిక్ష పడిందా? లేదా వరుణ్ హత్య కేసు నుంచి రాంబాబు సమస్య నుంచి ఎలా గట్టెక్కాడు? ఈ కథలో ప్రఖ్యాత రచయిత విజయ్ చంద్ర పాత్ర ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే దృశ్యం 2 సినిమా కథ.

    వరుణ్ హత్య కేసు వ్యవహారం ఏదో రూపంలో వెంటాడుతున్నప్పటికీ ఆ చేదు విషయాన్ని దిగమింగుతూ రాంబాబు కుటుంబం జీవితాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఊహించని విధంగా గీతా ప్రభాకరన్ (నదియా), ప్రభాకరన్ (నరేష్) అమెరికా నుంచి వచ్చి ఓ కోరిక కోరడంతో సినిమా ఆసక్తికరంగా మారుతుంది. వరుణ్ హత్య నేపథ్యాన్ని సినిమాగా తెరకెక్కించాలనే విషయంలో విజయ్ చంద్రతో చేసిన కథా మార్పులు సినిమాలో మరింత ఆసక్తిని రేపుతాయి. రాంబాబు కుటుంబం నేపథ్యం, చివర్లో వరుణ్ కేసు పున: విచారణ అంశాలతో తొలిభాగం ముగిసిపోతుంది.

    దృశ్యం 2 చిత్రంలో రెండో సగభాగం హత్య కేసు విచారణ, దర్యాప్తు అంశాలు కీలకంగా ఆసక్తికరంగా మారుతాయి. జైలు, కోర్టు సీన్లు కథకు మరింత బలంగా మారాయి. రాంబాబు క్యారెక్టర్‌ను బలంగా డిజైన్ చేయడంతో సినిమా మరింత ఎంగేజింగ్‌గా మారినట్టు కనిపిస్తుంది. చివర్లో ఐజీ (సంపత్ రాజ్) పాత్రతో కథకు ముగింపు పలికిన విధానం సంతృప్తికరంగా అనిపిస్తుంది.

    దృశ్యం సినిమాను ఎంత ఎఫెక్టివ్‌గా తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకొన్నాడో.. అదే విధంగా దర్శకుడు జీతు జోసెఫ్ దృశ్యం2 ను కూడా బలంగా తెరకెక్కించారు. సెకండాఫ్ సినిమాను హై రేంజ్‌లో ముందుకు తీసుకెళ్లడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. పాత్రలను రాసుకొన్న తీరు.. కథలో భావోద్వేగాలను జొప్పించిన తీరు సినిమాకు మరింత పాజిటివ్‌గా మారాయి. సస్పెన్స్, థ్రిల్లర్స్ ఆదరించే వారికి దృశ్యం 2 కూడా నచ్చేలా తెరకెక్కించారని చెప్పవచ్చు

    దృశ్యం 2లో రాంబాబుగా వెంకటేష్, జ్యోతిగా మీనా తమ పాత్రల్లో ఒదిగిపోవడమే కాకుండా తెర మీద పాత్రలను సజీవంగా కనిపించేలా చేశాయి. ఇక కథలో అంజుగా కృతిక, అనుగా ఎస్తర్ అనిల్ భాగమయ్యారు. తమ పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు. సెంటిమెంట్ సీన్లలో మరింతగా మెప్పించారు. సెకండాఫ్‌లో వెంకటేష్ మరోసారి అద్భుతమైన నటనతో ఆకట్టుకొన్నారు. భావోద్వేగాలను భారీగా పండించాడు.

    మిగితా పాత్రల్లో అంటే గీత, ప్రభాకరన్‌గా నదియా, నరేష్ వీకే తమ పాత్రలో ఒదిగిపోయారు. చేతికి అంది వచ్చిన కొడుకు మరణంపై ఎలాంటి ఆచూకీ లేకపోవడంతో తల్లిదండ్రులుగా పడే బాధను వారిద్దరూ చక్కగా తెర మీద ప్రతిబింబింప చేశారు. ఇక ఐజీగా సంపత్ రాజ్, ఇన్స్‌పెక్టర్‌గా వినయ్ వర్మ తమదైన శైలిలో కథలో కీలకంగా మారారు. మిగితా పాత్రధారులు తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.

    దృశ్యం 2 చిత్రానికి అనూప్ రూబెన్ష్ మ్యూజిక్ అదనపు ఆకర్షణగా మారింది. కీలక సన్నివేశాలను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ చేసింది. సినిమాటోగ్రాఫర్ సతీష్ కురూప్ చిత్రకీరించిన సన్నివేశాలు ఆయన ప్రతిభకు అద్దంపట్టింది. ప్రకృతిని, పచ్చటి దృశ్యాలను తెరపైన అందంగా చూపించారు. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ బాగుంది.

    దృశ్యం 2 చిత్రం చక్కటి సస్సెన్స్, థ్రిల్లర్‌గానే ఫ్యామిలీ ఆడియెన్స్ మెప్పించే విధంగా తెరకెక్కిందని చెప్పవచ్చు. దృశ్యం సినిమాకు పక్కాగా సీక్వెల్ అనే ఫీలింగ్‌ను కలిగిస్తుంది. వెంకటేష్, మీనా, నదియా, నరేష్, సంపత్ రాజ్, వినయ్ వర్మ పాత్రలకు సినిమాకు బలంగా మారాయి. ఫ్యామిలీ ఆడియెన్స్ ఎలాంటి సందేహాలు లేకుండా ఓ క్లీన్ గ్రీన్ సినిమా చూశామనే ఫీలింగ్‌ను, అనుభూతిని పొందండం గ్యారెంటి.

    బలం, బలహీనతలు:
    కథ, కథనాలు
    సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలు
    వెంకటేష్, మీనా ఫెర్ఫార్మెన్స్
    డైలాగ్స్

    మైనస్ పాయింట్స్
    తొలి భాగంలో కాస్త సాగదీత

    నటీనటులు, సాంకేతిక నిపుణులు
    నటీనటులు: వెంకటేష్, మీనా, కృతికా, ఈస్టర్ అనిల్, నదియా, నరేష్, పూర్ణ, వినయ్ వర్మ, సత్యం రాజేశ్, తనికెళ్ల భరణి, షఫీ, తాగుబోతు రమేష్, చమ్మక్ చంద్ర, టిల్లు వేణు, చలాకీ చంటి తదితరులు
    కథ, దర్శకత్వం: జీతు జోసెఫ్
    నిర్మాతలు: డీ సురేష్ బాబు, ఆంథోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి
    సినిమాటోగ్రఫి: సతీష్ కురుప్
    మ్యూజిక్: అనుప్ రూబెన్స్
    ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేష్
    బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, రాజ్ కుమార్ థియేటర్స్
    ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
    రిలీజ్ డేట్: 2021-11-25

    English summary
    Venkatesh's Drushyam 2 movie review and Rating: Streeming on Amazon Prime Video
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X