twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకీమామ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Recommended Video

    Venky Mama Movie Review And Rating || Filmibeat Telugu

    Rating:
    2.5/5
    Star Cast: వెంకటేష్, నాగచైతన్య, రాశీ ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ తదితరులు
    Director: కె ఎస్ రవీంద్ర (బాబీ)

    విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలిసి వస్తోన్న చిత్రం వెంకీమామ. రియల్ లైఫ్ క్యారెక్టర్స్‌ను తెరపై పోషిస్తుండటంతో ఇటు వెంకీ అభిమానుల్లో అటు అక్కినేని ఫ్యాన్స్‌లో అంచనాలుపెరిగాయి. దానికి తగ్గట్లే పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేశాయి. తన అల్లుడిని నేడు (డిసెంబర్ 13) థియేటర్లోకి వచ్చేశాడు వెంకీమామ. వెంటబెట్టుకుని వచ్చిన మరి ఈ వెంకీ మామ అల్లుడికి ఉపయోగపడిందా? లేదా మామకే కలిసి వచ్చిందా? అన్నది చూద్దాం.

    కథ

    కథ

    జాతకం చెప్పడంలో సిద్దహస్తులైన రామ్ నారాయణ (నాజర్) కొడుకు వెంకటరత్నం (వెంకటేష్).. తన తండ్రిని ఎదురించి అక్కకు పెళ్లిచేస్తాడు. జాతకాలు కలవలేదు పెళ్లి వద్దు, బిడ్డ పుట్టిన ఏడాదికే తల్లిదండ్రులు చనిపోతారని జాతకం చెబుతుందని వారించినా తండ్రి మాట వినకుండా పెళ్లి చేస్తాడు. దీంతో ఆ జాతకమే నిజమై కార్తీక్ శివరామ్ (నాగ చైతన్య) పుట్టిన ఏడాదికి తల్లిదండ్రులు మరణిస్తారు. అలాంటి జాతకాలున్నవారికి పుట్టిన వాడికి అలానే ఉంటుందని, వాడిని అనాథలా వదిలేయండని చెబుతాడు. అయితే జాతకాలను మార్చే శక్తి మనిషి ప్రేమకుందని నమ్మే వెంకటరత్నం తన మేనల్లుడిని పెంచుకుంటాడు. ఇక వారిద్దరికి ఎదురైన కష్టాలు ఏంటన్నదే కథ.

     కథలో ట్విస్టులు..

    కథలో ట్విస్టులు..

    కార్తీక్‌ జాతకం వెనుకున్న రహస్యం ఏంటి? దాని వల్ల వెంకటరత్నంకు ఎలాంటి సమస్యలు ఏర్పడ్డాయి? వెన్నెల (పాయల్ రాజ్‌పుత్), హారిక (రాశీ ఖన్నా)ల కథ ఏంటి? ఎమ్మెల్యే పశుపతి నాయుడు (రావు రమేష్), బ్రిగేడియర్ విజయ్ ప్రకాశ్ ( ప్రకాశ్ రాజ్)లకు ఈ కథతో ఉన్న సంబంధం ఏంటి? తన మామను విడిచి కార్తీక్ ఎందుకు వెళ్లిపోయాడు? చివరకు తన అల్లుడి కోసం వెంకీమామ చేసిన ప్రయత్నం ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే వెంకీమామ.

    ఫస్టాఫ్ అనాలిసిస్..

    ఫస్టాఫ్ అనాలిసిస్..

    ప్రాణానికి ప్రాణంగా పెంచిన మేనల్లుడు చెప్పా పెట్టకుండా వదిలివెళ్లడం, ఆర్మీలో జాయిన్ అయ్యాడని మూడేళ్ల తరువాత ఆచూకి తెలుసుకుని మామ వెళ్లడం లాంటి సీన్లతో ప్రేక్షకులకు కథలోకి తీసుకెళ్లడం బాగుంది. మిలటరీ ఆఫీసర్‌కు తన కథ చెప్పడంతో అసలు స్టోరీ మొదలవుతుంది. మామ అల్లుళ్ల అల్లరి, తాతతో మనవడి గొడవలు ఇలా కథనం ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది. తన కోసం పెళ్లి చేసుకోవడం మానేసిన మామ కోసం అమ్మాయిని వెతకడం, ఆ క్రమంలో స్కూల్ టీచర్ వెన్నెల (పాయల్ రాజ్‌పుత్) కనిపించడం లాంటి సీన్లతో కథనం కాస్త ఎంటర్‌టైనింగ్‌గా మారుతుంది. మరోవైపు ఆ ఊరి ఎమ్మెల్యే కూతురు అయిన హారిక (రాశీ ఖన్నా)కు, కార్తీక్‌కు బ్రేకప్ అయ్యిందని, వెంకటరత్నం వారిద్దని కలిపే ప్రయత్నం చేసే సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. కథనం ఇలా ఫుల్ ఎంటర్‌టైనింగ్ మోడ్‌లో దూసుకుపోతుంటే.. ఇంటర్వెల్ వచ్చే సరికి అసలు ట్విస్ట్ బయట పడటంతో ప్రథమార్థం ముగుస్తుంది. ఈ రకంగా ఫస్టాఫ్ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయిందనే చెప్పవచ్చు.

    సెకండాఫ్ అనాలిసిస్..

    సెకండాఫ్ అనాలిసిస్..

    ప్రథమార్థాన్ని ఫుల్ ఫన్ మోడ్‌లో తీసుకెళ్లగా.. సెకండాఫ్ కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. కార్తీక్ జాతక విషయం బయటపడటం, దానికి అనుగుణంగా సంఘటనలు జరగడం లాంటి సీన్లతో ద్వితీయార్థం ఫాస్ట్‌గా సాగిపోతుంది. మామఅల్లుళ్లు పెళ్లి రెడీ అయిపోవడం, ఓ విషయంలో కార్తీక్‌ను వెంకటరత్నం చేయిజేసుకోవడం, దాంతో బాధపడి మామకు దూరంగా పోవడం ఎమోషనల్‌గా టచ్ చేస్తుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో సీరియస్‌గా అనిపించే కొన్ని సీన్లు.. నవ్వును తెప్పించేలా ఉండటం కాస్త మైనస్‌గా మారవచ్చు. క్లైమాక్స్ ముందు భారీ విధ్వంసం ఉంటే.. బాగుంటుందన్న ఆలోచన చేసినట్టు కనిపిస్తుంది. ఆ సీన్స్‌లో ఇంటెన్సిటీ, ఎమోషన్ మిస్ అయిన భావన ప్రేక్షకులకు కలగవచ్చు. మొత్తంగా ఓ పెద్ద ప్రమాదం నుంచి వెంకీమామ తన అల్లుడిని కాపాడటం, ప్రాణపాయస్థితిలో ఉన్న మామను అల్లుడు బతికించుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది. ప్రేక్షకులను మెప్పించడంలో ద్వితీయార్థం సఫలం కావడంలో కాస్త తడబడినట్టు అనిపిస్తుంది.

    వెంకటేష్, నాగ చైతన్య పర్ఫామెన్స్..

    వెంకటేష్, నాగ చైతన్య పర్ఫామెన్స్..

    వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి నటించడం తొలిసారి కావడంతో ఇద్దరి ఫ్యాన్స్‌కు ఓ రకంగా పండగనే చెప్పవచ్చు. అయితే నటనలో, ఎక్స్‌ప్రెషన్స్‌ పలికించడంలో లో వెంకీకి ఉన్న అనుభవం ముందు నాగచైతన్య తేలిపోయాడనే భావన కలుగుతుంది. ఇద్దరి కాంబినేషన్‌లో ఉన్న సీన్స్‌లో వెంకీనే మార్కులు కొట్టేశాడు. అది నాగ చైతన్య తప్పు కానే కాదు. అయితే సింగిల్‌గా పర్ఫామెన్స్ చేసే అవకాశాన్ని కూడా దర్శకుడు ప్రత్యేకంగా కలిపించాడు. చైతు కోసమే అన్నట్టుగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ రచించినట్టు కనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్‌లో చైతూ ఆకట్టుకునే ప్రయ్నతం చేశాడు. అయితే ఏ రకంగా చూసినా మామను మాత్రం ఢీకొట్టలేకపోయాడనే చెప్పవచ్చు.

    ఇతర నటీనటుల పర్ఫామెన్స్..

    ఇతర నటీనటుల పర్ఫామెన్స్..

    మామఅల్లుళ్ల కథే అయినా, వారి చుట్టే కథనం తిరిగినా కొన్ని పాత్రలు హైలెట్ అయ్యే అవకాశముంది. ఎమ్మెల్యే పాత్రను పోషించిన రావు రమేష్.. తనకు అలవాటైనా పాత్రే కావడంతో అలవోకగా నటించేశాడు. నాజర్, చారు హాసన్‌లు కనిపించేవ కొన్ని సీన్లే అయినా తమ అనుభవంతో పండించేశారు. సగం హిందీ, సగం తెలుగును మిక్స్ చేసి కొత్తగా ట్రై చేసిన పాయల్ పాత్ర కొన్నిసార్లు చిరాకు పుట్టించేలా ఉంది. వెన్నెల పాత్రలో రాశీ ఖన్నా కొత్తగా చేసిందేమీ లేదనిపిస్తుంది. ఎప్పటిలాగే రొటీన్ పాత్రలో నటించింది. మిగతా పాత్రల్లో నటించిన హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, రోలర్ రఘు నవ్వించే ప్రయత్నం చేశారు.

    బలం బలహీనతలు

    బలం బలహీనతలు

    ప్లస్ పాయంట్స్

    వెంకటేష్, నాగచైతన్య
    ఫస్టాఫ్
    సంగీతం

    మైనస్ పాయింట్స్
    రొటీన్ కథ, కథనం
    ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్

    దర్శకుడి పనితీరు..

    దర్శకుడి పనితీరు..

    వెంకీమామ కథ, కథనాలు చూస్తే.. మనం ఏ కాలంలో ఉన్నామనే అనుమానం కలుగుతుంది. మన తాతలు, తండ్రుల కాలం నాటి కథను ఎంచుకున్నాడు దర్శకుడు. అయినా పర్లేదు అనుకుంటే.. కథనాన్ని కూడా ఏమాత్రం ఆసక్తికరంగా మార్చుకోలేదు. ఏ ఒక్క సీన్ కూడా కొత్తగా అనిపించదు. అలా అని బోర్ కొట్టించదు. కానీ కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మాత్రం దర్శకుడు నిరాశకు గురిచేస్తాడు. వెంకటేష్ లాంటి నటుడు ఉండటంతో సినిమాను బాగానే నెట్టుకొచ్చేశాడు డైరెక్టర్. నాగ చైతన్యకు అదిరిపోయే సీన్లు రాయాలన్న తాపత్రయం కనబడింది తప్పా.. వాటిలో ఎమోషన్ వర్కౌట్ అయ్యేలా చేయడంలో విఫలం అయ్యాడు. అయితే కమర్షియల్ ఫార్మాట్‌లో తెరకెక్కించి విజయం సాధించాలనే విషయంలో దర్శకుడు విజయం సాధించినట్టే కనిపిస్తుంది.

    సాంకేతిక నిపుణుల పనితీరు..

    సాంకేతిక నిపుణుల పనితీరు..

    వెంకీమామ చిత్రానికి ఇంత హైప్ రావడం వెనుక థమన్ అందించిన సంగీతం ఓ కారణం. పాటలతోనే కాదు నేపథ్య సంగీతంతోనూ హీరోయిజాన్ని ఎలివేట్ చేశాడు. పల్లెటూరి అందాలను, కాశ్మీర్ సౌందర్యాన్ని తన కెమెరాతో మరింత అందంగా చూపించాడు కెమెరామెన్ ప్రసాద్ మురెళ్ల. ద్వితీయార్థంపై ఎడిటర్ ప్రవీణ్ పూడి ఇంకాస్త దృష్టి పెడితే బాగుందేమోనన్న ఫీలింగ్ కలుగుతుంది. మిగతా సాంకేతిక నిపుణుల పనితీరు, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.

    నటీనటులు

    నటీనటులు

    నటీనటులు : వెంకటేష్, నాగచైతన్య, రాశీ ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ తదితరులు
    దర్శకత్వం : కేఎస్ రవీంద్ర (బాబీ)
    నిర్మాత : సురేశ్ బాబు, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల
    బ్యానర్ : సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
    మ్యూజిక్ : తమన్
    సినిమాటోగ్రఫి : ప్రసాద్ మూరెళ్ల
    ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి

    ఫైనల్‌గా..

    ఫైనల్‌గా..

    ఇది నిజంగానే ‘వెంకీ'మామ సినిమానే. అయితే మామఅల్లుళ్లు తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోవడంతో తెరపై ఓ నిండుదనం కనిపిస్తుంది. మొత్తానికి వెంకీ మామ సక్సెస్ అయ్యాడు. ఇక కమర్షియల్‌గా వెంకీమామ స్టామినా ఏంటన్నది చూడాలి.

    English summary
    Venky Mama is an Telugu language Family Emotional Drama written and directed by KS Ravindra. The film stars Venkatesh, Akkineni Naga Chaitanya, Raashi Khanna, Payal Rajput. This movie released on December 13, 2019.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X