'వెంకీ'బాగున్నాడు

By Staff

Venky
- జలపతి గూడెల్లి
చిత్రం: వెంకీ
నటీనటులు: రవితేజ, స్నేహ, అషుతోష్‌ రాణా,
చిత్రం శ్రీను, బ్మ్రనందం, ధర్మవరపు సుబ్రమణ్యం, తదితరులు
సంగీతం: దేవీశ్రీప్రసాద్‌
నిర్మాత: అట్లూరి పూర్ణచంద్రరావు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల

చిన్న లైన్‌తో ఆద్యంతం ఆసక్తికరంగా చెప్పిన చిత్రం ఇది. పూర్తి స్థాయిలో ఎంటర్‌టైనర్‌ అని చెప్పవచ్చు. కథలోని పాయింట్‌ కన్నా దాన్ని చివరివరకు ఇంట్రెస్ట్‌ను సస్టేన్‌ చేయడంలో దర్శకుడు శ్రీను వైట్ల బాగా సక్సెస్‌ అయ్యాడు. స్క్రీన్‌ ప్లేలో పట్టు, రవితేజ ఎంటర్‌టెయినింగ్‌ నటనే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. పాటలు బాగుంటే ఈ సినిమా ఇంకా బాగుండేది.

వెంకీ (రవితేజ) అతని మిత్రబృందం విశాఖలో బలాదురుగా తిరుగుతుంటారు. ఉద్యోగం లేక అప్పోసప్పో చేసి బతికే ఈ కుర్రాళ్ళకి అనుకోకుండా ఎస్పై ఉద్యోగాలు లభిస్తాయి. హైదరాబాద్‌లోని పోలీసు శిక్షణాకేంద్రానికి బయలుదేరుతారు. వెంకీకి జాతకాల పిచ్చి. జ్యోతిష్యచౌదరి (మల్లికార్జునరావు) చెప్పే జ్యోతిష్యం అంటే గురి. తనకు త్వరలోనే ఓ అందాల సుందరి పరిచయం అవుతుందని, ఆమెనే పెళ్ళిచేసుకుంటావని ఆ జ్యోతిష్కుడు చెప్పడంతో రైళ్ళో ఆ సుందరి కోసం చూస్తాడు. తర్వాతి స్టేషన్‌లో శ్రావణి (స్నేహ) ఎక్కుతుంది. ఆవిడే తన కాబోయే భార్య అని రవితేజ ఊహించేకొని .. ఆవిడని పడేసేందుకు నానా తిప్పలు పడుతుంటాడు. ఇదంతా ఓ ఇరవై నిమిషాల పాటు రైళ్ళోనే సరదాగా సాగుతుంటుంది. చివర్లో ఆమెకు ప్రపోజ్‌ చేస్తాడు.

స్నేహ, ఆమె తండ్రి, ఆమె రవితేజను తిట్టి..కొడుతారు. దాంతో రవితేజ మీ ఇద్దర్నీ నరికేస్తానని ఆవేశంగా చెప్పి..పడుకుంటాడు. మర్నాడు హైదరాబాద్‌కు ట్రెయిన్‌ చేరుకోగానే స్నేహ తండ్రి, మరో న్రయాణీకురాలి గొంతు కోసి చంపేసి ఉంటుంది. రవితేజ, వారి బృందమే ఈ పని చేసి ఉంటుందని అందరూ భావిస్తారు. దీంతో రవితేజ, వారి స్నేహితులు..అక్కడ్నుంచి పారిపోయి..పోలీసు అకాడెమీలో చేరుతారు. అకాడెమీలో చేరాకా, వారికి అసలు వారిని ఎవరు చంపారో తెలుస్తుంది. ఇక స్నేహకు ఆ విషయం తెలియచేసి, ఆమెను రక్షించడంతో పాటు, వారిపై నిందను తొలగించుకోవడం సెకాంఢాఫ్‌.

చాలా సింపుల్‌ కథను ఇంట్రెస్టింగ్‌గా చెప్పారు. దర్శకుడు శ్రీను వైట్ల వినోదాత్మక ప్రథమార్థం అంతా వినోదాత్మకంగా చెప్పే పద్దతిని బాగా అలవర్చుకున్నట్లు కన్పిస్తోంది. ఈ సినిమాలో అది బాగా వర్కవుట్‌ అయింది. రవితేజ, బ్మ్రనందంల మధ్య సీన్లు బాగా పండాయి. రవితేజ నటన బాగుంది ఈ సినిమాలో. విలన్‌ పాత్రలో అషుతోష్‌ రాణా బాగా రాణించాడు. ఆ పాత్రకు బాగా సూటయ్యాడు. అయితే, సబ్‌జుడీస్‌లో ఉన్న నకీలీ స్టాంప్‌ కుంభకోణం వంటి కేసు మీద (అంటే కోర్ట్‌లో ఉన్న కేసు) అప్పుడే కథ తయారు చేసుకొని అందులో ఫలానావారు దోషులు అని చెప్పడం బాధ్యతారాహిత్యమే అని చెప్పాలి. స్నేహ డీసెంట్‌గా చేసింది. దేవీశ్రీప్రసాద్‌ స్వరపర్చిన రెండు పాటలు బాగున్నా, పెద్ద హిట్‌ పాటలు కావు. సంగీతం బాగుంటే ఇంకా సినిమా బాగుండేది. చూడదగ్గ చిత్రం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X