ప్రేక్షకులపై కురవని 'వెన్నెల'

By Staff

Vennela
-జోశ్యుల సూర్యప్రకాష్‌
సినిమా: వెన్నెల
విడుదల తేదీ: 26-11-2005
నటీనటులు: రాజా, శర్వానంద్‌, పార్వతీ మెల్టన్‌,
బ్రహ్మానందం, రవివర్మ, అచ్యుత రామారావు, మధురెడ్డి,
కిశోర్‌, శాలిని, సునీల్‌, క్రిస్‌ పీటర్స్‌ తదితరులు
సంగీతం: మహేష్‌ శంకర్‌
ఫోటోగ్రఫీ: రాజారావు
ఎడిటింగ్‌ : కోలా భాస్కర్‌
నిర్మాతలు: రవి వల్లభనేని, సచి పినాకపాణి
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కట్టా దేవకౌశిక్‌

ప్రవాసాంధ్రులలో 'ఆనంద్‌' కలిగించిన ఆనందాన్ని 'వెన్నెల' హరించేసింది. ఎన్నారైలు తీసిన ఈ సినిమాలొ కథ లేకుండా కబుర్లతో దర్శకుడు కాలక్షేపం చేయించడంతో ప్రేక్షకులకు నిరుత్సాహం కలుగుతుంది. స్ధిరమైన వ్యక్తిత్వం లేని పాత్రలు ్రస్టక్చర్‌ను అనుసరించని కథనం అసహనం కలిగిస్తాయి. పబ్లిసిటీలో చూపించిన ప్రతిభ ఓపెనింగ్స్‌ను రాబట్టినా నిలబెట్టుకునే అవకాశం లేదు.

అమెరికా నేపధ్యంలో వచ్చిన ఈ చిత్రం అక్కడికి పరుగులు తీసే యువతరం ఆశలతో ప్రారంభమవుతుంది. అది చూసి మనం అమెరికాలోని తెలుగువారి కష్ట సుఖాలు, ఆనంద ఉద్వేగాలు ఆవిష్కరిస్తారని ఆశపడతాం. కానీ దీనికి విరుద్ధంగా కథ నడుస్తుంటుంది. రాజా చదువుకోడానికి తన మిత్రులతో ఆమెరికా వస్తాడు. వాళ్లంతా అమ్మాయిలతో డేటింగ్‌ కోసం చొంగలు కార్చుకుంటూ తిరుగుతుంటారు. మన హీరో మరింత ముందుకెళ్ళి దెబ్బతింటాడు. అదే సమయంలో అక్కడ చేరిన మరో అమ్మాయి పావని (పార్వతి మెల్టన్‌) పరిచయమవుతుంది. ఆమె పరమానందం (బ్రహ్మానందం) నడిపే హోటల్లో వెయిట్రెస్‌గా పనిచేస్తుంటుంది. బ్రహ్మానందం సినిమావాళ్ళ బాడీ షాపింగ్‌ ద్వారా అమెరికాకు వచ్చి సెటిలైపోతాడు. రాజా ఆమెకు వచ్చిన ఒక చిన్న సమస్యను పరిష్కరించి, ఆమె పనిచేసే హోటల్లో చేరుతాడు. వారి రోమాన్సుకు సయ్యద్‌ అనే విద్యార్ధి అడ్డుపడతాడు. సయ్యద్‌ పావనిని ఇండియా నుంచి వెంబడిస్తుంటాడు. సయ్యద్‌ బూతు బొమ్మల మధ్య పావని ఫోటోను ఉంచి ఆనందిస్తుంటాడు. అది చూసిన రాజా కోపంగా మందలిస్తాడు. దానితో విలన్‌ శివమెత్తి పావని క్యారక్టర్‌ మంచిది కాదని, ఓ ఫ్లాష్‌బ్యాక్‌ ఉందని చెప్పడంతో ఇంటర్వల్‌ వస్తుంది. ఆమె ఫ్లాష్‌బ్యాక్‌ ఏమిటన్నది మిగితా కథ.

ఓ అందమైన ప్రేమకథగా ప్రచారం పొందిన ఈ చిత్రంలో కథ విలన్‌ వైపు నుండి నడవడం, నడిపించడం ప్రధాన సమస్య దీనితో హీరో రాజా పాత్ర పాసివ్‌గా మారి దిక్కులు చూడాల్సివచ్చింది. ఈ సినిమాలో ఏంచెప్పాలో స్పష్టత లేకపోవడంతో జోకులు, కబుర్లు, పాటలతో ప్రతి ఫ్రేము నిండిపోయింది. ఇంటర్వల్‌ వచ్చేసినా కథ ఒక్క అడుగూ ముందుకేయదు. ఎక్కడో ట్విస్ట్‌ ఇచ్చి ఆశ్చర్యపరుద్దామన్న తాపత్రయంలో కథనాన్ని కూలదోశారు. హుక్‌, మొదటి మలుపు, రెండో మలుపు వంటి ప్రాధమికాంశాలు కాగడా పెట్టి వెదికినా కన్పించకపోవడం స్క్రిప్టు లోపం. కథ ఎటువెళ్తుందో తెలియకపోవడం 'పాయింట్‌ ఆఫ్‌ వ్యూ' సమస్య. దర్శకత్వపరంగా ఒకటి రెండు మెరుపులు ఉన్నప్పటికీ బలహీన కథనం వల్ల అవి మరుగున పడిపోయాయి. కెమెరా కొన్ని చోట్ల కనువిందు చేసింది. 'ప్రేయసి కావు, నేస్తం కావు', 'నింగీనేల తాకే చోట... సముద్రాలు దాటే చోట' అనే పాటలు బాగున్నాయి. కొన్ని చోట్ల ఎడిటింగ్‌ లోపాలున్నాయి. నటీనటులు ఉన్నంతలో బాగానే చేశారు.

గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X