Vettaiyan Movie Review వేట్టయాన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రోహిణి, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయన్ తదితరులు
నిర్మాత: సుభాస్కరన్
దర్శకత్వం: టీజే జ్ఞానవేల్
మ్యూజిక్: అనిరుద్ రవిచందర్
సినిమాటోగ్రఫీ: ఎస్‌ఆర్ కదిర్
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్
ప్రొడక్షన్ డిజైన్: కే కదిర్
యాక్షన్: అన్బరివు
కొరియోగ్రఫి: దినేష్
బ్యానర్: లైకా ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2024-10-10
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అథియన్ (రజనీకాంత్) ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్. సుప్రీం కోర్టులో పనిచేసే న్యాయమూర్తి సత్యదేవ్ బ్రహ్మదత్ పాండే (అమితాబ్ బచ్చన్) మానవ హక్కులను పరీక్షిస్తుంటాడు. చెన్నైలో ఓ కీలక కేసు దర్యాప్తు ఎస్పీ హరీష్ కుమార్ (కిషోర్), ఏఎస్పీ రూపా (రితికా సింగ్ ఓ సిట్‌ను ఏర్పాటు చేస్తారు. కానీ అథియన్ ఆ కేసులోకి వచ్చి గుణ అనే నిందితుడిని ఎన్ కౌంటర్ చేస్తాడు.

చెన్నైలో పోలీసులకు సవాల్‌గా నిలిచిన నేర సంఘటన ఏంటి? నేరంలో నిందితుడు ఎవరనే విషయంపై సిట్ చేసిన దర్యాప్తు ఏమిటి? సిట్‌లోకి అథియన్‌ను ఎందుకు వచ్చాడు. తమిళనాడును కుదిపేసిన సంఘటనలో నిందితుడిని అథియన్ ఎన్‌కౌంటర్ చేసిన తర్వాత ఏం జరిగింది? సత్యదేవ్, ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు అయిన అథిమన్‌ను సత్యదేవ్ ఎలా తప్పుపట్టాడు. అథియన్ మధ్య విభేదాలకు దారి తీసిన ఆ కేసు ఏమిటి? తాను చేసిన ఎన్‌కౌంటర్ విషయంలో అథియన్ ఎందుకు ప్రాయశ్చిత్తం చెందాల్సి వచ్చింది? ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్, కోర్టు డ్రామాలో నటరాజ్ (రానా దగ్గుబాటి) క్యారెక్టర్ ఏంటి? ఈ కేసులో డీజీపీ శ్రీనివాస్ (రావు రమేష్) పాత్ర ఏంటి? అథియన్ చేసిన ఎన్ కౌంటర్ సరైనదేనా? ఎన్ కౌంటర్ అధియన్ జీవితాన్ని ఎలా కుదిపేసింది? ఆనే ప్రశ్నలకు సమాధానమే వేట్టయాన్ సినిమా కథ.
పాజిటివ్ అంశాలు:
రజనీకాంత్ ఫెర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రజెన్స్
అమితాబ్, ఫాహద్ రానా యాక్టింగ్
డైరెక్షన్, డైలాగ్స్, కథలో ఇంటెన్సిటీ
లైకా ప్రొడక్షన్స్ అనుసరించిన నిర్మాణ విలువలు
అనిరుధ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్
ఫస్టాఫ్‌లో కథ, కథనాలు
ప్రతికూల అంశాలు
ఒకే పాయింట్‌పై నడిచే కోర్టు, కాప్ డ్రామా
సెకండాఫ్‌లో కొన్ని సీన్లు ల్యాగ్
జైభీమ్ తర్వాత టీజే జ్ఞానవేల్ రాసుకొన్న కథ కొత్తగా ఉండటమే కాకుండా సమాజాన్ని మరోసారి ఓ కొత్త పాయింట్‌ను ఆలోచింపచేసేలా చేస్తుంది. టాప్ హీరోలు, యాక్టర్ల పాత్రలను డిజైన్ చేసిన విధానం, కథలో వారి రోల్స్‌ను జొప్పించిన విధానం ఆయన ప్రతిభకు అద్దం పట్టింది. కథలో ప్రతీ పాత్రకు చోటు కల్పించి కథను నడిపించిన విధానం మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. ఫస్టాఫ్‌లో అథియన్‌ను ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా చూపించిన విధానం.. అలాగే ఇంటర్వెల్‌లో అథిరన్‌ను ఫిక్స్ డిజైన్ చేసిన ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయేలా ఉంటుంది.

ఇక సెకండాఫ్‌లో ఎన్‌కౌంటర్‌కు దారి తీసిన లోపాలను అథిరన్ చేత ఇన్వెస్టిగేషన్ చేయడం కథ మరో కోణంలోకి వెళ్తుంది. ఇక నటరాజ్ నడిపే ఎడ్యుకేషన్ చుట్టూ కథను నడిపి ప్రేక్షకుడిని కనెక్ట్ చేసిన తీరు ఈ సినిమాకు హైలెట్. విద్యా, రాజకీయ వ్యవస్థల్లో ఉండే అవినీతిపై దర్శకుడు సంధించిన విమర్శనాస్త్రం ప్రతీ ఒక్కరిని ఆలోచింపచేస్తుంది. ఇక క్లైమాక్స్ హై ఎనర్టీ, మోస్ట్ ఫవర్‌పుల్‌గా ముగించిన విధానం సినిమాను మరో రేంజ్‌లో తీసుకెళ్లేలా చేసింది.
నటీనటుల విషయానికి వస్తే.. రజనీకాంత్ స్టైల్, స్వాగ్, స్క్రీన్ ప్రజెన్స్‌తో అదరగొట్టాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి చెప్పడం కంటే ఆయన యాక్టింగ్‌ను తెరపైనే చూడాలి. అథియన్ క్యారెక్టర్‌లో రకరకాల వేరియేషన్స్‌ను రజనీ అద్బుతంగా పలికించాడు. అమితాబ్ బచ్చన్ తన బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్‌తో తన పాత్రను హుందాగా పోషించారు. రజనీ, బిగ్‌బీ పోటాపోటీగా నటించడంతో ఈ మూవీ మరో రేంజ్‌కు వెళ్లిందని చెప్పాలి. రానా, ఫహాద్ తన పాత్రలతో అదరగొట్టారు. రానా, రజనీ మధ్య వచ్చే సీన్లు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. అనిరుధ్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్, బీజీఎంతో సన్నివేశాలను ఓ రేంజ్‌కు తీసుకెళ్లారని చెప్పొచ్చు. కథిర్ అందించిన సినిమాటోగ్రఫి మూవీకి అదనపు ఆకర్షణ. స్టోరీలో ఉండే మలుపులను కథను సాఫీగా సాగనిచ్చేలా ఎడిటింగ్ విభాగం వర్క్ బాగుంది, ఫైట్స్ విభాగాల పనితీరు బాగుంది. సుభాస్కరన్ నిర్మాతగా అనుసరించిన నిర్మాణ విలువు హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయని చెప్పవచ్చు.

హ్యుమన్ ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సమాజంలోని ఓ కీలక సమస్యను ఆధారంగా తెరకెక్కిన కాప్, కోర్టు డ్రామా. దర్శకుడు టీజే జ్ఞానవేల్ రాసుకొన్న కథ ప్రతీ ఒక్కరిని ఆలోచింపచేస్తుంది. విద్యా వ్యవస్థలో ఉండే లోపాలు, కార్పోరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల పేద, మధ్య తరగతి కుటుంబాలను ఎలా విచ్ఛినం చేస్తున్నది. ఈ కుంభకోణాల్లో పోలీసు, రాజకీయ వర్గాలు ఎలా పావులుగా మారుతున్నారనే విషయాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాడు. దర్శకుడు కమర్షియల్‌గా కథను చెప్పిన విధానం బాగుంది. ఈ సినిమా ఫ్యాన్స్‌కే కాకుండా .. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మంచి వినోదంతో కూడా భావోద్వేగమైన మూవీ. డోంట్ మిస్.


Click it and Unblock the Notifications











