Vettaiyan Twitter Review: వేట్టయన్ ట్విట్టర్ రివ్యూ.. రజనీ, అమితాబ్ మ్యాజిక్ ఎలా ఉందంటే?
సూపర్‌స్టార్ రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ నటించిన చిత్రం వేట్టయన్: ది హంటర్. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, ఫహద్ ఫాజిల్, మంజు వారియర్ తదితరులు నటించారు. విజయదశమి పండుగ సందర్భంగా అక్టోబర్ 10న రిలీజైంది, జై భీమ్ ఫేమ్ టీ జే జ్ఞానవేల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్‌తో కలిసి ఏసియన్ సునీల్, దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో నెటిజన్లు వెల్లడించిన రివ్యూ, ఫీడ్ బ్యాక్ వివరాల్లోకి వెళితే..
రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. సినిమా అనే దానికి భాష లేదు.. హద్దుల్లేవు. కథను బట్టి ఆ చిత్రం ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఇప్పటి వరకు రజినీకాంత్ చేసిన అన్ని సినిమాల్లోకెల్లా వేట్టయన్ చాలా భిన్నంగా ఉంటుంది. ఈ చిత్రం భారీ తారాగణంతో వస్తోంది. రజినీకాంత్ గారు, అమితాబ్ గారు, ఫాహద్ గారు, మంజు వారియర్ గారు.. ఇలా అన్ని పాత్రలు అద్భుతంగా ఉంటాయి. రియలిస్టిక్ మూవీలో ఇన్ని మంచి పాత్రలు ఉండటం చాలా అరుదు. రజినీకాంత్ గారి ముందు నిలబడి డైలాగ్ చెప్పడం, నటించే ఛాన్స్ రావడం చాలా లక్కీ. ఈ చిత్రాన్ని అందరూ చూసి ఎంజాయ్ చేయండి అని అన్నారు.

వేట్టయన్ ఫస్టాఫ్ అదిరిపోయింది. మాస్‌ను మించిన కంటెంట్ ఉంది. తొలి 25 నిమిషాల్లో రజనీకాంత్ యాక్టింగ్ గూస్ బంప్స్, బీజీఎం, రీరికార్డింగ్ అనిరుధ్ కెరీర్ బెస్ట్. తలై ఇంట్రో మ్యూజిక్ సూపర్‌గా ఉంది. ఎమోషనల్ క్రైమ్,ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.
వేట్టయన్ ఫస్టాఫ్ టెర్రిఫిక్, స్క్రీన్ ప్లే విషయంలో జైలర్ సినిమాను మించి పోయింది. రజనీకాంత్ యాక్టింగ్, అనిరుధ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. సినిమాలో పాటల ప్లేస్‌మెంట్ బాగుంది. బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. ఇంటర్వెల్ సీన్ అదిరిపోయింది అని ట్వీట్ చేస్తున్నారు.
వేట్టయన్ సినిమాలో రజనీకాంత్, ఫాహద్ ఫాజిల్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. ఫన్నీగా సూపర్‌గా అనిపిస్తాయి. మీరు ఊహించని క్యారెక్టర్‌లో ఫాహద్ ఫాజిల్ కనిపించడం బాగుంటుంది అని నెటిజన్ కామెంట్ చేశాడు. ఫస్ట్ 20 నిమిషాలు మాస్ మూమెంట్స్‌తో రజనీకాంత్ సెలబ్రేషన్స్‌లా ఉంటుంది. అనిరుధ్ బీజీఎం,సాంగ్స్ బాగున్నాయి. ఎమోషన్స్ కనెక్ట్ అయ్యాయి. దుషారా స్పెషల్ రోల్‌లో కనిపిస్తాడు అని ట్వీట్ చేశాడు.
వేట్టయన్ ది హంటర్ మూవీ రిలీజ్ సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, ఆయన యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు. ఈ సందర్బంగా రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ విషెస్ అందజేస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలు మించి రికార్డులు క్రియేట్ చేస్తుందని విశ్వసిస్తున్నాం అని ప్రభాస్ ట్రెండ్స్ ట్వీట్ చేసింది.
వేట్టయన్ సినిమాకు తమిళనాడులో భారీ స్పందన కనిపిస్తున్నది. ఈ సినిమాకు చెన్నైలో అడ్వాన్స్ బుకింగ్ రూపంలో బ్రహ్మరథం పడుతున్నారు. చెన్నైలోని మాయాజల్ థియేటర్‌లో ఏకంగా తొలి రోజు 80 షోలు ప్రదర్శిస్తున్నారు. ఇది తమిళ సినీ చరిత్రలో ఓ రికార్డుగా చెప్పుకొంటున్నారు.
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ నటించిన వేట్టయాన్ సినిమా అదిరిపోతుంది. ఈ మూవీ క్లైమాక్స్ ఇండస్ట్రీలో టాక్‌గా మారిపోతుంది. రేపటి నుంచి అందరూ ఈ సినిమా క్లైమాక్స్ గురించే మాట్లాడుకొంటారు. తైలవర్ ఎంట్రీ కోసం వెయిట్ చేయండి అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
రజనీకాంత్ నడిచి వస్తుంటే.. ఈ ప్రపంచానికి బాస్ ఎవరో తెలిసి పోతుంది. సూపర్ స్టార్ మేనరిజం, ఆయన ఆరాకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఏఎంబీలో ఈ సినిమాను చూడాలనుకొనే వారు ఎంతమంది? వాళ్లు పోస్టు కింద కామెంట్ చేయమని ఏఎంబీ థియేటర్ యాజమాన్యం ట్వీట్ చేసింది.
రజనీకాంత్ నటించిన వేట్టయన్ సినిమాపై అధికంగా పాజిటివ్ టాక్ ఉంది. ఈ సినిమా ఇంటర్నల్ రిపోర్టు విషయానికి వస్తే.. ఈ సినిమా లాంగ్ రన్‌ను కొనసాగిస్తుందని చెబుతున్నారు. ఈ మూవీ గ్యారెంటీగీ 500 కోట్ల రూపాయలు వసూలు చేయడం గ్యారెంటీ అని ఓ నెటిజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











