twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Veyi Subhamulu Kalugu Neeku review.. శివాజీ రాజా కొడుకు టాలీవుడ్ ఎంట్రీ.. విజయ్ రాజా ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే

    |

    టాలీవుడ్‌లోకి సినీ వారసుల ఎంట్రీ 2022 సంవత్సరంలో ఘనంగానే కనిపించబోతున్నది. దిల్ రాజు కుటుంబం నుంచి, అలాగే గల్లా ఫ్యామిలీ, శివాజీ రాజా తనయుడు తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్దమవుతున్నారు. తాజాగా సీనియర్ నటుడు శివాజీ రాజా కుమారుడు విజయ్ రాజా హీరోగా నటించిన చిత్రం వేయి శుభములు కలుగు నీకు జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తండ్రి తరహాలోనే విజయ్ రాజా ప్రేక్షకులను ఆకట్టుకొన్నాడా? తొలి చిత్రంలో విజయ్ రాజ్ ఎలాంటి ప్రతిభను చాటుకొన్నాడు? వేయి శుభములు కలుగు నీకు చిత్రం ఎలాంటి అనుభూతిని కలిగించిందనే విషయాల్లోకి వెళితే..

    ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో పాపులర్ హారర్‌ షోకు చైతు (విజయ్ రాజా) ప్రోగ్రాం డైరెక్టర్‌గా పనిచేస్తుంటాడు. విలాసవంతమైన భవనంలో నివసించాలని కలలు కన్న తన తండ్రి (శివాజీ రాజా) చిరకాల స్వప్నంను నెరవేర్చాలని చాలా కష్టపడుతాడు. చివరకు స్వయంకృషితో ఎదిగిన చైతు ఓ మంచి భవనాన్ని కొనుగోలు చేసి అందులో నివసిస్తూ ఉంటాడు. అయితే ఆ భవంతి నుంచి చైతూని ఖాళీ చేయించడానికి ఓ దెయ్యం ( జ్ఞాన ప్రియ) ప్రయత్నిస్తుంది.

    అయితే ఎంతో వ్యయ ప్రయాసాలకు కోర్చి ఇంటిని కొన్న చైతు ఆ భవనాన్ని వదులుకొన్నాడా? దెయ్యానికి, ఇంటికి ఉన్న సంబంధం ఏమిటి? ఆ ఇంటిలోనే దెయ్యం ఎందుకుంది? చైతూని దెయ్యం ఎందుకు ఖాళీ చేయాలనుకొంటుంది? ఆ దెయ్యంగా మారిన ఆ యువతి కథ ఏమిటి? చైతూ ఆ భవనం వదిలిపెట్టాడా? లేక దానికి విరుగుడు ఏదైనా కనిపెట్టాడా? ఇలాంటి సమస్యల్లో తన ప్రియురాలు దివ్య (తమన్నా వ్యాస్)తో రొమాంటిక్ లైఫ్ ఎలా సాగింది? దివ్యతో ప్రేమ.. పెళ్లిపీటల వరకు వచ్చిందా? అనే ప్రశ్నలకు సమాధానమే వేయి శుభములు కలుగు నీకు సినిమా కథ.

    Veyi Subhamulu Kalugu Neeku movie review and rating: Sivaji Raja son Vijay Raja into Tollywood

    హారర్, థ్రిల్లర్ సినిమాలు తెరకెక్కించడమంటే కత్తి మీద సామే. దెయ్యం కథ పక్కాగా కథనం ఉండాలనేది చాలా చిత్రాలు నిరూపించాయి. ఈ సినిమా తొలిభాగం వినోదాత్మకంగా, రెండో భాగం ఎమోషనల్‌గా సాగుతుంది. కథ, కథనాలు
    ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. చైల్డ్ సెంటిమెంట్ సీన్లు సినిమాను మరింత భావోద్వేగంగా మార్చుతాయి. టెలివిజన్ ఛానెల్స్‌లో ఉండే వ్యవహారాలతో కథ సందడిగా సాగిపోతుంది.

    దర్శకుడు రామ్స్ రోథోడ్ ఎంచుకొన్న పాయింట్ దానిని కథగా రాసుకొన్న విధానం బాగుంది. సన్నివేశాలను థ్రిల్లింగ్‌గా మలిచిన విధానం దర్శకుడు ప్రతిభకు అద్దం పట్టింది. ఫారెస్ట్ సీన్లలో, మరికొన్ని హారర్ సీన్లలో మూడ్‌ను క్రియేట్ చేయడానికి లైటింగ్‌ను వాడుకొన్న విధానం తెర మీద బాగుంది. ప్రేక్షకులను భయపెట్టే విధంగా సన్నివేశాలు ఉండటం వినోదానికి పెద్ద పీట వేసిందని చెప్పవచ్చు.

    వేయి శుభములు కలుగు నీకు సినిమా విజయ్ రాజాకు తొలి చిత్రమైనప్పటికీ.. మంచి ఈజ్‌తో నటించాడు. కీలకమైన, ఎమోషనల్ సన్నివేశాల్లో పరిణతితో కూడిన నటనను ప్రదర్శించాడు. చైతూ పాత్రలో ఒదిగిపోయి నటించాడు. నటనపరంగా కొన్ని లోపాలను సవరించుకొంటే భవిష్యత్‌లో మంచి నటుడిగా రాణించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చైతూకు ప్రియురాలిగా దివ్య పాత్రలో కనిపించిన తమన్నా వ్యాస్ అందం, అభినయంతో ఆకట్టుకొన్నది. నూతన నటుడు వెంకట్ నారాయణ రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో ఒదిగిపోయాడు. దెయ్యం పాత్రలో కనిపించిన జ్ఞానప్రియ ఎమోషనల్‌గా ఆకట్టుకొన్నది. సత్యం రాజేశ్, రచ్చ రవి కామెడి బాగుంది. షియాజి షిండే, శ్రీకాంత్ అయ్యంగార్, జబర్దస్త్ అప్పారావు, అనంత్ తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.

    సాంకేతిక విభాగాల్లో బుజ్జి సినిమాటోగ్రఫి బాగుంది. హారర్, థ్రిల్లింగ్ సీన్లకు కావాల్సిన మూడ్‌ను మంచి క్రియేట్ చేశాడు. లైంటింగ్, తదితర అంశాలు సన్నివేశాలను ఎలివేట్ చేశాయి. గ్యానీ అందించిన మ్యూజిక్.. ముఖ్యంగా బీజీఎం చాలా బాగుంది. తూము నరసింహ పటేల్, జామి శ్రీనివాసరావు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. వినోదం, లవ్, ఎమోషన్స్ కలిసి ఉన్న ఈ చిత్రం ఫ్యామిలీతో సహా థియేటర్లలో చూడవచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే మంచి అనుభూతిని పొందవచ్చు.

    నటీనటులు: విజయ్ రాజా , శివాజీ రాజా, తమన్నా వ్యాస్, ఢీ ఫేం ఫాల్గుణి, సత్యం రాజేష్, జ్ఞాన ప్రియ, వెంకట్ నారాయణ, సన, అనంత్, షాయాజి షిండే, శ్రీకాంత్ అయ్యంగార్, రోహిణి, రచ్చ రవి, జబర్దస్త్ అప్పా రావు, జబర్దస్త్ మురళి, రేసింగ్ రాజు, కోట యశ్వంత్ తదితరులు
    నిర్మాతలు: తూము నరసింహ పటేల్, జామి శ్రీనివాసరావు
    ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విక్రమ్ రమణ
    స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రామ్స్ రాథోడ్
    కథ, మాటలు: శ్రీనాథ్ రెడ్డి
    సినిమాటోగ్రఫి: కే బుజ్జి
    మ్యూజిక్: గ్యాని
    ఆర్ట్ డైరెక్టర్: బీ జగన్
    కో డైరెక్టర్: ప్రకాష్
    కాస్ట్యూమ్: ఎల్ . కిశోరె కుమార్
    ఎడిటర్: వినోద్
    పిఆర్వో: హర్ష
    బ్యానర్ : జయ దుర్గ దేవి మల్టీ మీడియా

    English summary
    Actor Sivaji Raja son Vijay Raja into Tollywood with Veyi Subhamulu Kalugu Neeku movie. This movie hits screens on January 7th. Here is the detailed review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X