twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లభించటం కష్టమే....('విక్టరి' రివ్యూ)

    By Staff
    |

    Rating
    -జోశ్యుల సూర్య ప్రకాష్
    బ్యానర్ :ఆర్.ఆర్.మూవీ మేకర్స్
    నటీనటులు:నితిన్,మమతా మోహన్ దాస్,అశుతోష్ రాణా,సుప్రీత్,
    శశాంక్,సింధు తులానీ,దువ్వాసి మోహన్,రవిబాబు,తణికెళ్ళ భరిణి,
    నూతన ప్రసాద్,రంఘనాధ్,కృష్ణభగవాన్,అలీ,అభినయశ్రీ తదితరులు
    సంగీతం:చక్రి
    ఎడిటింగ్: కె.వి.కృష్ణా రెడ్డి
    యాక్షన్: రామ్ -లక్ష్మణ్
    సినిమాటోగ్రఫి: విజయ్ .సి.కుమార్
    కథ -మాటలు -స్ర్కీన్ ప్లే,దర్శకత్వం: రవి.సి.కుమార్
    నిర్మాత :వెంకట్
    రిలీజ్ డేట్: 27 జూన్ 2008

    ప్రజల్లో ఎవేరనెస్ వచ్చి అందరూ కలిస్తేనే పెనుభూతం లాంటి కభ్జా సమస్యను ఎదుర్కోగలం అనే చక్కని పాయింట్ తో వచ్చిన సినిమా విక్టరీ. అయితే కథకు కీలకమైన రియల్ ఎస్టేట్ సమస్యపై పూర్తిగా అవగాహన లేకుండా పేపర్ కటింగ్స్ దగ్గర పెట్టుకుని అల్లినట్లున్న ఈ కథలో సమస్య సెకెండాఫ్ సగం దాకా రాకపోవడమే సమస్యగా మారింది. అందులోనూ హీరో పాత్ర పాసివ్ గా మారి అసహనం కల్గిస్తుంది. అప్పటికీ నితిన్ ఎయిట్ పాక్ తో,అలీ-బ్రహ్మానందం కామిడీ ఎపిసోడ్ తో అలరిద్దామని ప్రయత్నించారు. కాని విక్టరీ సాధించటానికి అవేమీ వర్కవుట్ అయ్యేటట్లు కనపడటం లేదు.

    సిటీలో మిడిల్ క్లాస్ కుర్రాడు విజయ్ (నితిన్) ఫ్యామిలీ కి స్దలం ఉంటుంది. ఆ స్ధలంపై లాండ్ మాఫియా డాన్, ఎమ్.ఎల్.ఎ అయిన దేవరాజ్(అశుతోష్ రాణా) కన్ను పడుతుంది. డైరక్టుగా విలన్ ని ఎదుర్కోలేని హీరో విజయ్ తన తెలివితో, స్నేహితులు(శశాంక్) ,ప్రియురాలు(మమతా మోహన్ దాస్) సహాయంతో మీడియా(సింధు తులాని)ని అడ్డం పెట్టుకుని గూండాయిజాన్ని,రాజకీయాల్ని ఎదుర్కొని ఎలా స్ధలాన్ని దక్కించుకున్నాడనేది కథ.

    ఈ సినిమా భూదేవి చెప్పుతున్నట్లుగా...జగపతిబాబు వాయిస్ ఓవర్ లో సిటీలో రోజు రోజుకీ పెరిగిపోతున్న భూ కభ్జా సమస్యలను వివరిస్తూ వెరైటీగా ప్రారంభమవుతుంది. కానీ అసలు కథలోని సామాన్యుడు పెయిన్ ని పెద్దగా ఎస్టాబ్లిష్ చేయకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం లవ్,యాక్షన్ ఎపిసోడ్స్ పై ఎక్కువగా ఆధార పడ్డారు. దాంతో ప్రేక్షకుడు ఐడెండటి తగ్గిపోవటమే మెయిన్ మైనస్.

    ఇక సినిమా కబ్జా విషయంతో ప్రారంభమైనా వెంటనే ఆ పాయింట్ వదిలేసి ప్రక్కకు వచ్చి హీరోయిన్ లవ్ ఎపిసోడ్ లో పూర్తిగా మునిగిపోతుంది. దాంతో హీరోకి విలన్ యేం అన్యాయం చేస్తాడు...హీరో దానికి రివెంజ్ ఎలా తీర్చుకుంటాడో చూద్దామని ఫిక్సియిపోతాం. అలా సెకండాఫ్ సగం దాకా ఇదే పరిస్ధితి కొనసాగింది. అందులోనూ యాక్షన్ సినిమాలుకు రెగ్యులర్ గా వచ్చే స్క్రీన్ ప్లే స్కీమ్ అయిన ఎత్తుకు పై ఎత్తులూ కనపడవు. అలాగని మొదట ఎత్తుకున్న సమస్యకు పరిష్కారం ఉంటుందా అంటే అదీ కనపడుదు.

    సరిగ్గా ఇలాంటి పాయింట్ తోటే గతంలో వచ్చిన హిందీ సినిమాలు 'కోస్లా కా గోస్లా' గాని, పాత 'ఘాతక్' గానీ సరిగ్గా చక్కని స్క్రీన్ ప్లే తో సాగి హిట్ అవటం గమనార్హం. అలాగే 'సామాన్యుడు' సినిమాని గుర్తు చేస్తూ మళ్ళీ బ్లాక్ మెయిల్ డ్రామా రావటం మరో మైనస్. ఇక కథకు తగ్గట్టే మాటలు,పాటలు సోసోగా ఉన్నాయి. సంగీతం లో టైటిల్ సాంగ్ మినహా చప్పగా ఉంది. నితిన్ ఎక్సెప్రెషన్స్ లోనూ గాత్రంలోనూ ఇంకా మార్పు రావల్సి ఉంది. మమతా మోహన్ దాస్,సింధు తులానీ పాత్రలుకు వెయిట్ ఉన్నా చెప్పుకోవటానికేం లేదు. ఇక దువ్వాసి మోహన్ 'జయం' తర్వాత మంచి పాత్ర వచ్చినట్లనిపిస్తుంది. విలన్ గా వేసిన అశుతోష్ రాణా క్లైమాక్స్ లో బాగా రాణించాడు. రవిబాబు లైసన్స్ డైలాగ్ ,అలీ అక్రమ సంభందం (చీప్ కామిడీ) పెద్దగా పేలలేదు. కృష్ణ భగవాన్ పంచ్ లు మిస్సయ్యాయి. టెక్నికల్ గా కెమెరా,ఎడిటింగ్ వంటివి డైరక్షన్ కి తగినట్లు గా మౌల్డ్ అయ్యాయి.

    ఇక నితిన్ డైలాగ్ "గాంధీ గారు మహాత్ముడు ఎందుకయ్యారో ఇప్పుడు అర్ధమైంది..కోట్ల మందిలో యూనిటీ ఎలా తీసుకొచ్చారో!" వంటి డైలాగులు అక్కడక్కడా బాగా పడ్డాయి. అలాగే టైటిల్స్ పేపర్స్ లో కరెంట్ ఎఫైర్స్ నుండి గ్రాఫిక్స్ లో రావటం క్రియేటవ్ గా బాగా డిజైన్ చేసారు.

    యేదైమైనా బర్నింగ్ ప్లాబ్లెమ్ పై తీసిన ఈ సినిమా దర్శకుడు ముందుగా అభినందీయుడు. అతను కథ,కథనాలపై మరింత శ్రధ్ధ తీసుకుని ఉంటే బాగా పట్టేది. హింస ఎక్కువవటం,కామిడీ పెద్దగా లేకపోవటంతో ఫ్యామిలీలకు పట్టటం కష్టమే. యూత్ కి నిజంగా ఇలాంటి సమస్యలపై ఆసక్తి ఉంటే వారే బ్రతికించాలి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X