Vidaamuyarchi Movie Review: విదాముయార్చి మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Rating: 2.75/5
నటీనటులు: అజిత్, త్రిషా కృష్ణన్, అర్జున్, రెజీనా కసండ్రా, రమ్య సుబ్రమణ్యన్, ఆరవ్, సంధ్య జనక్ తదితరులు
దర్శకత్వం: మగిజ్ తిరుమెని
నిర్మాత: సుభాస్కరన్ అలిరాజా
సినిమాటోగ్రఫి: ఓం ప్రకాశ్
ఎడిటింగ్: ఎన్ బీ శ్రీకాంత్
మ్యూజిక్: అనిరుధ్ రవిచందర్
బ్యానర్: లైకా ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2025-02-06
అర్జున్ (అజిత్), కాయల్ (త్రిషా కృష్ణన్) భార్యభర్తలు. 12 ఏళ్ల దాంపత్య జీవితాన్ని ఆస్వాదించిన తర్వాత అర్జున్ నుంచి త్రిషా విడాకులు తీసుకోవాలని అనుకొంటుంది. భార్య నిర్ణయాన్ని అర్జున్ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆమోదిస్తాడు. అయితే కోర్టు నుంచి విడాకులు వచ్చే వరకు తన తల్లిదండ్రులతో కలిసి ఉంటానని చెబుతుంది. దాంతో చివరిసారిగా కలిసి ప్రయాణిద్దామని కాయల్ ఇంటికి బయలు దేరుతారు. జర్నీ మధ్యలో రక్షిత్, దీపిక (అర్జున్ సర్జా, రెజీనా కసండ్రా) గ్రూప్ కాయల్‌ను కిడ్నాప్ చేస్తుంది.

అజిత్, కాయల్ పెళ్లికి ముందు ఎలా పరిచయం అయ్యారు? వారి లవ్ జర్నీ ఎలా సాగింది? 12 ఏళ్ల తర్వాత అర్జున్ నుంచి ఎందుకు కాయల్ విడాకులు తీసుకోవాలనుకొన్నది? అర్జున్, కాయల్ ప్రయాణించే చివరి జర్నీలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి? కాయల్‌ను అర్జున్ బ్యాచ్ ఎందుకు కిడ్నాప్ చేసింది? భార్య కిడ్నాప్‌కు గురైన తర్వాత అర్జున్ పరిస్థితి ఏమిటి? కాయల్‌ను అర్జున్ ఎలా రక్షించాడు? చివరకు భర్త నుంచి కాయల్ విడాకులు తీసుకొందా? అనే ప్రశ్నలకు సమాధానమే పట్టుదల (విదాముయార్చి) సినిమా కథ.
దర్శకుడు మగిజ్ తిరుమెని ఎంచుకొన్న పాయింట్ విషయంలో ఎలాంటి కొత్తదనం లేకపోగా.. ఆద్యంత ఆఢియెన్స్‌ను కొత్త అనుభూతికి గురి చేసే అంశం లేకపోవడంతో ఎదో సినిమా నడుస్తుందా? అనే విధంగా సాగుతుంది. అయితే పసలేని కథతో దర్శకుడు ఓ రకంగా సాహాసమే చేశాడని చెప్పాలి. అయితే రెగ్యులర్, రొటీన్ పాయింట్‌తో మూవీని చాలా స్టైలిష్‌గా, కొన్ని ట్విస్టులు, టర్నులతో సినిమాను నడిపించిన విధానం ఆయన ప్రతిభకు అద్దం పట్టిందని చెప్పవచ్చు. ఇంటర్వెల్ సీన్, ప్రీ ఇంటర్వెల్ సీన్ ఉత్సాహాన్ని, జోష్‌ను పుట్టిస్తాయి. సెకండాఫ్ తర్వాత ఏదైనా డిఫరెంట్ పాయింట్‌తో కథను నడిపిస్తారనుకొంటే అది నిరాశను కలిగించే విషయంగా మారింది. అయితే కిడ్నాప్ డ్రామాను సాగదీసి.. సాగదీసి.. చివరకు యాక్షన్ ఎపిసోడ్స్ ముగించేశాడనిపించాడు.

అర్జున్‌గా అజిత్ కొత్త లుక్‌తో రొమాంటిక్‌గా, యాక్షన్ హీరోగా రెండు షేడ్స్‌లో కనిపిస్తాడు. అయితే ఈ సినిమా కథను చూస్తే.. అసలు అజిత్ ఈ మూవీని చేయాల్సిన సినిమా కాదనే అభిప్రాయం కలుగుతుంది. ఎప్పటిలానే డిఫరెంట్ మేనరిజమ్స్, యాక్షన్స్ సీన్లు, కార్ రేసింగ్ సీన్లలో అజిత్ ఆకట్టుకొన్నాడు. ఇక త్రిషకు ఓ డిఫరెంట్ క్యారెక్టర్ లభించిందనే చెప్పాలి. కానీ నటించడానికి పెద్దగా స్కోప్ దక్కలేదు. భర్తకు విడాకులు ఇవ్వాలనే భార్య పాత్రలో కొన్ని సీన్లలో ఎమోషన్స్‌ను పండించింది. ఇక అర్జున్ సర్జా, రెజీనా కంసాడ్రా సర్‌ప్రైజ్ క్యారెక్టర్లే అని చెప్పాలి. ఆ రెండు పాత్రల మధ్య ఎమోషన్ కొత్తగా ఉన్నాయి. వాటిని తెర మీద చూడాల్సిందే. మిగితా పాత్రల్లో నటించిన ఫర్వాలేదనిపించారు,
ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. పసలేని సీన్లను కూడా అనిరుధ్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో జోష్ పుట్టించాడు. యాక్షన్, ఎమోషన్స్ సన్నివేశాలకు అతడు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఓం ప్రకాశ్ అందించిన సినిమాటోగ్రఫి స్క్రీన్‌ను రిచ్‌గా కనిపించేలా చేసింది. అజర్ బైజాన్, బాకు ప్రాంతాల్లో ప్రదేశాలను అందంగా చూపించారు. ఎడిటింగ్ కట్స్ బాగున్నాయి. లైకా ప్రొడక్షన్స్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కథ, కథనాల ఎంపికే సరిగా లేదనిపిస్తుంది. స్టోరీ, స్క్రీన్ ప్లే దృష్టిపెట్టి ఉంటే ఈ సినిమా ఇంకా బెటర్ ఫలితాన్ని ఇచ్చే స్కోప్ ఉందనిపిస్తుంది.

లవ్, రొమాన్స్, యాక్షన్ అంశాలతోపాటు సాగే కిడ్నాప్ డ్రామా విదాముయార్చి. అజిత్, అర్జున్, త్రిషా, రెజీనా స్పెషల్ ప్యాకేజీగా కనిపిస్తారు. అయితే దక్షిణాది ఆడియెన్స్‌కు రుచించిన సబ్జెక్ట్ కావడం వల్ల చాలా డల్, స్లోగా సాగిందనిపిస్తుంది. అజిత్ నుంచి భారీగా మాస్ అంశాలను ఆశిస్తే.. పూర్తిగా నిరాశే మిగులుతుంది. త్రిషా, రెజీనా గ్లామర్ బాగానే పండించారు. స్టైలిష్ యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చడానికి అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











