Vidaamuyarchi Twitter Review: విదాముయార్చి ట్విట్టర్ రివ్యూ.. అజిత్, అనిరుధ్ ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?
తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ నటించిన విదాముయార్చి చిత్రం తెలుగులో పట్టుదలగా రిలీజ్‌కు సిద్దమైంది. త్రిషా హీరోయిన్‌గా నటించారు. దక్షిణాదిలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పాపులర్ నిర్మాత సుభాస్కరన్ అలిరాజా నిర్మించారు. మగీజ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అర్జున్ సర్జా, రెజీనా కసండ్రా, ఆరవ్, రమ్య సుబ్రమణ్యం తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
హాలీవుడ్ రైటర్ జోనాథన్ మోస్టో బ్రేక్ డౌన్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దాదాపు ఈ చిత్రాన్ని సుమారుగా 350 కోట్ల రూపాయలతో భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించారు. ఈ సినిమాకు ఓం ప్రకాశ్ సినిమాటోగ్రఫి, ఎన్‌బీ శ్రీకాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఈ మూవీ ఫిబ్రవరి 6వ తేదీన గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై సోషల్ మీడియాలో నెటిజన్లు వెల్లడించిన అభిప్రాయాలు, రివ్యూ వివరాల్లోకి వెళితే..

విదాముయార్చి మాస్టర్ క్లాస్ టెన్షన్ బిల్డింగ్ మూవీ. వేగంగా సాగే సర్వైవల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు స్క్రీన్ ప్లే స్పెషల్ ఎట్రాక్షన్. ఈ చిత్రంలో ప్రతీ సీన్‌ను అజిత్, అర్జున్ క్యారెక్టర్లు ఇరగదీశారు. అజిత్ భార్య అదృశ్యమైన తర్వాత సినిమా కథనం అదిరిపోతుంది. ఈ సినిమా డైలాగ్స్, రైటింగ్ అద్బుతంగా ఉంటుంది. విస్పోటనం లాంటి క్లైమాక్స్ చూస్తే మరింత అద్బుతంగా ఉంటుంది. అభిమానులు కొత్త అజిత్‌ను చూస్తారు. అనిరుద్ బీజీఎం బీపీ పెంచుతుంది. తెరపైన అజిత్‌ను ఓ సూపర్ స్టార్‌గా చూసే కొత్త రకం అనుభూతిని పంచుతుంది అని ట్విట్టర్ రివ్యూలో పేర్కొన్నారు.
ఈ సినిమా క్వాలిటీ థ్రిల్లర్. త్రిష, అజిత్ కెమిస్ట్రీ అదిరిపోయింది. రెజీనా కసండ్రా సర్‌ప్రైజింగ్ రోల్. అర్జున్ తన ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేస్తాడు. విదాముయార్చి సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో తమిళనాడులో 1000 కిపైగా స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమాకు రికార్డు ఓపెనింగ్స్ రావడం ఖాయం. అజిత్ కుమార్ సినిమా రెండేళ్ల తర్వాత వస్తుండటం, అలాగే పద్మభూషణ్ అవార్డు కూడా రావడంతో అభిమానులు మరింత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
విదాముయార్చి సినిమా ఫస్టాఫ్ బాగుంది. మగీజ్ దర్వకత్వం ఇంకా బాగుంది. యాక్షన్ సీన్లు చూస్తే సీటుకు అతుకుపోయేలా ఉన్నాయి. ట్విస్టులు, టర్న్‌లు బాగున్నాయి. తమిళ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు రానటువంటి విధంగా విజువల్స్, సౌండ్ క్వాలిటీ బాగుంది. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
విదాముయార్చి సినిమా స్టోరీని పర్‌ఫెక్ట్‌గా డెలివరీ చేశారు. మాస్ ఇంట్రోలు, స్లో మోషన్ లేకుండా సినిమాను నడిపించారు. దర్శకుడు చెప్పినట్టే ఈ సినిమా అజిత్ ఫ్యాన్స్‌కు పక్కా దివాళీ లాంటి మూవీ అని నెటిజన్ కామెంట్ చేశాడు.
విదాముయార్చి సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అజిత్ కుమార్‌కు ధనుష్ ఫ్యాన్స్ తరపున అభినందనలు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తుంది. అజిత్ తనదైన శైలిలో 2025 సంవత్సరాన్ని బిగ్ బ్యాంగ్‌తో ప్రారంభించడం ఖాయం అని అభిమానులు ట్వీట్ చేశారు.
ఫస్టాఫ్ సాలిడ్‌గా ఉంది. మూవీ స్లోగా ప్రారంభమైనప్పటికీ.. స్టోరీ చాలా ఎంగేజింగ్‌గా ఉంది. అసలు కథ, ట్విస్టులు మొదలైన తర్వాత ప్రేక్షకుడిని కట్టిపడేసేలా స్క్రీన్ ప్లే ఉంది. సెకండాఫ్‌లో యాక్షన్ సీన్లు, మూమెంటమ్ అందుకొన్న తర్వాత మూవీ గ్రిప్పింగ్‌గా ఉంది. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు అదిరిపోయింది. ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సీన్లు, సెకండాఫ్‌లో ట్విస్టులు, టర్నులు బాగున్నాయి.
అజిత్ సార్.. ఆఫ్ స్క్రీన్‌లో మీ విజయయాత్ర చూసి తరించాం. ఇక బిగ్ స్క్రీన్‌పై బ్లాక్ బస్టర్ విజయాన్ని చూడబోతున్నాం. విదాముయార్చి సినిమా యూనిట్ సభ్యులందరికి మా అభినందనలు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకొంటున్నాం అని సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











