Vidaamuyarchi First Review: విదా ముయార్చి ఫస్ట్ రివ్యూ.. అజిత్ కమ్ బ్యాక్ మూవీ అవుతుందా?

దక్షిణాదిలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పాపులర్ నిర్మాత సుభాస్కరన్ అలీరాజా నిర్మించిన చిత్రం విదా ముయార్చి. తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. మగీజ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన దుబాయ్ క్రిటిక్ ఉమేర్ సంధూ వెల్లడించిన రివ్యూ మీ కోసం..

దక్షిణాదిలో పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలో అర్జున్ సర్జా, రెజీనా కసండ్రా, ఆరవ్, రమ్య సుబ్రమణ్యం తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హాలీవుడ్ రైటర్ జోనాథన్ మోస్టో బ్రేక్ డౌన్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దాదాపు ఈ చిత్రాన్ని సుమారుగా 350 కోట్ల రూపాయలతో భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించారు. ఈ సినిమాకు ఓం ప్రకాశ్ సినిమాటోగ్రఫి, ఎన్‌బీ శ్రీకాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

Vidaamuyarchi Review by Critic Umair Sandhu  Is Ajith Kumar s Comeback Movie

ఇక ఫిబ్రవరి మొదటి వారంలో విడుదలకు సిద్దమైన ఈ సినిమాకు చెందిన సెన్సార్ కార్యక్రమాలు దుబాయ్‌లో ముగిసాయి. ఈ సినిమాను అక్కడి క్రిటిక్ ఉమేర్ సంధూ చూసి..ఈ మూవీపై తన రివ్యూను అందించారు. ఈ సినిమా గురించి వెల్లడిస్తూ.. స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

విదా ముయార్చి (పట్టుదల పేరుతో తెలుగులో) స్టైలిష్ థ్రిల్లర్. ఈ సినిమా క్లాస్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకొంటుంది. ఈ మూవీ రిలీజ్ తర్వాత అజిత్‌ కుమార్‌కు డిఫరెంట్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఇండియాలో స్టైలిష్ థ్రిల్లర్ సినిమాలకు న్యూ కింగ్ ఆయనే అవుతారు అని ఉమేర్ సంధూ తన ట్వీట్‌లో వెల్లడించారు.

Vidaamuyarchi Review by Critic Umair Sandhu  Is Ajith Kumar s Comeback Movie

విదా ముయార్చి సినిమా చిత్రానికి సినిమాటోగ్రఫి ప్లస్ పాయింట్. అజర్‌బైజాన్ దేశంలో చిత్రీకరించిన సన్నివేశాలు ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. స్టోరీ స్క్రీన్ ప్లే బాగుంది. యాక్షన్ సన్నివేశాలు, క్లైమాక్స్‌కు ఫుల్ మార్కులు వేయొచ్చు. ఈ సినిమా కేవలం క్లాస్ ఆడియెన్స్‌కు మాత్రమే. అజిత్ కుమార్ పవర్ ప్యాక్డ్ పెర్పార్మెన్స్‌తో వచ్చే అజిత్ కుమార్‌కు ఇది డెఫినెట్‌గా కమ్ బ్యాక్ మూవీనే అవుతుంది అని ఉమేర్ సంధూ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉండగా, విదా ముయార్చి సినిమాకు దక్షిణాదిలోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ రెస్పాన్స్ వస్తున్నది. ఈ సినిమా రిజల్డ్ ఎలా ఉన్నప్పటికీ.. భారీ ఒపెనింగ్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు కన్ఫార్మ్ చేశారు. ఇక ఈ సినిమా ఏ రేంజ్ విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X