Viduthalai Part 1 Review వెట్రిమారన్ మేకింగ్ సూపర్బ్.. విజయ్ సేతుపతి, సూరి ఎలా చేశారంటే?

Rating: 3/5

నటీనటులు: సూరి, విజయ్ సేతుపతి, భవానీ స్రే, గౌతమ్ వాసుదేవన్ మీనన్, రాజీవ్ మీనన్, చేతన్, ఇలవరసు, బాలాజీ శక్తివేల్ తదితరులు
దర్శకత్వం: వెట్రిమారన్
స్క్రీన్ ప్లే: వెట్రిమారన్, బీ జెయమోహన్
నిర్మాత: ఎల్‌రెడ్ కుమార్
సినిమాటోగ్రఫి: ఆర్ వెల్‌రాజ్
మ్యూజిక్: ఇళయరాజా
బ్యానర్: ఆర్ఎస్ ఇన్ఫోటైయిన్‌మెంట్, గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ
రిలీజ్ డేట్: 2023-03-31

విడుదలై పార్ట్ 1 కథ ఏమిటంటే?

విడుదలై పార్ట్ 1 కథ ఏమిటంటే?

తమిళనాడు, కర్ణాటక సరిహద్దులో ముతువేల్ అనే ప్రాంతంలోని పోలీస్ డిపార్ట్‌మెంట్ క్యాంపులో కుమరేషన్ (సూరి) డ్రైవర్‌గా చేరుతాడు. మక్కల్ పడై అనే అతివాద సంస్థకు చెందిన నాయకుడు పెరుమాల్ అలియాస్ వాతియార్ (విజయ్ సేతుపతి)ను పట్టుకొనేందుకు పోలీసులు కూంబింగ్ జరుపుతుంటారు.

ఆ ప్రాంతంపై గట్టిపట్టున్న సూరి పోలీసులకు సహకరిస్తుంటాడు. తీవ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నారనే కారణంతో ఆ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతుంటారు. కూంబింగ్ ఆపరేషన్‌లో భాగంగా వాతియార్‌ జాడ కనుక్కొనేందుకు ఆ ప్రాంత మహిళపై పోలీసులు దారుణాలకు పాల్పడుతుంటారు.

విడుదలై పార్ట్ 1 ట్విస్టులు

విడుదలై పార్ట్ 1 ట్విస్టులు

ముత్తువేల్ ప్రాంతంలో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ తర్వాత పోలీసులు కూంబింగ్ ఎలా సాగింది? పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరిన తర్వాత ఎలాంటి పరిస్థితులను కుమరేషన్ చూశాడు? మక్కల్ పడై సంస్థ తరఫున పెరుమాల్ ఎలాంటి వ్యూహాలను చేపట్టాడు? ట్రైన్ యాక్సిడెంట్‌కు అసలు కారణం ఎవరు? అటవీ ప్రాంతంలోని మహిళలపై పోలీసుల అరాచకాలు ఎలా సాగాయి? పోలీసుల అరాచకాలను కుమరేషన్ అడ్డుకోవడానికి ఎలా ప్రయత్నించాడు? కూంబింగ్‌లో పోలీసులకు చిక్కిన పెరుమాల్ పరిస్థితి ఏమైంది అనే ప్రశ్నలకు సమాధానమే విడుదలై పార్ట్ 1 సినిమా కథ.

విడుదలై పార్ట్ 1 ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

విడుదలై పార్ట్ 1 ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

విడుదలై పార్ట్ 1 సినిమా కథ.. ట్రైన్ యాక్సిడెంట్‌తో ఓ ఎమోషనల్ ఎపిసోడ్‌తో సహజమైన వాతావరణంతో కథ ప్రారంభమవుతుంది. కుమరేషన్ పోలీసుల్లో చేరడం, తీవ్రవాదులను పట్టుకొనేందుకు పోలీసుల పథకాలతో కొంత ఆసక్తిని రేపుతుంది. కుమరేషన్ క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేయడానికి కొంత సమయం తీసుకోవడంతో ఫస్టాఫ్ నిదానంగా సాగినట్టు అనిపిస్తుంది.

సునీల్ మీనన్ (గౌతమ్ వాసుదేవ్ మీనన్) క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథలో జోష్, ఇంటెన్సిటీ పెరుగుతుంది. పెరుమాల్ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమా మరో లెవెల్‌కు వెళ్తుంది. ఫస్టాఫ్‌లో గ్రామస్థులపై పోలీసుల క్రూరమైన చర్యలను కళ్లకుకట్టినట్టు చూపించడం వెట్రిమారన్‌కే సాధ్యమనిపిస్తుంది.

విడుదలై పార్ట్ 1 సెకండాఫ్ గురించి

విడుదలై పార్ట్ 1 సెకండాఫ్ గురించి

విడుదలై పార్ట్ 1 సెకండాఫ్ విషయానికి వస్తే.. కథలో భావోద్వేగాలు ఎక్కువగా కనిపిస్తాయి. పెరుమాల్ ఆచూకీ కోసం గ్రామస్థులపై దాడులు చేయడం, గ్రామంలోని మహిళలను నగ్నంగా ఊరేగించడం పైశాచికంగా కనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు గ్రామంలో జరిగే ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్‌గా నిలుస్తాయి. విజయ్ సేతుపతి అరెస్ట్ తర్వాత పార్ట్ 2కు ఇచ్చిన లీడ్, ట్విస్టు ఆసక్తికరంగా కనిపిస్తుంది.

విజయ్ సేతుపతి, సూరి ఫెర్ఫార్మెన్స్ గురించి

విజయ్ సేతుపతి, సూరి ఫెర్ఫార్మెన్స్ గురించి

నటీనటుల విషయానికి వస్తే.. గత చిత్రాల్లో సూరి చేసిన పాత్రలకు భిన్నంగా కుమరేషన్ రోల్ ఉంటుంది. విడుదలై పార్ట్ 1 సినిమాకు సూరి వెన్నముకగా నిలిచాడు. సెకండాఫ్‌లో సూరి యాక్టింగ్ సూపర్బ్‌గా ఉంటుంది. మహిళలపై పైశాచిక చర్యల సమయంలో సూరి చూపించిన ఫెర్ఫార్మెన్స్ బాగుటుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి రోల్ పరిమితిగా ఉన్నప్పటికీ.. ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటుంది. భవానీ స్నే పాత్ర నిడివి తక్కువైనా ఆకట్టుకొనే విధంగా ఉంటుంది.

టెక్నికల్‌గా ఎలా ఉందంటే?

టెక్నికల్‌గా ఎలా ఉందంటే?

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. అటవీప్రాంతంలో సన్నివేశాలను ఆర్ వెల్‌రాజ్ అద్బుతంగా చిత్రీకరించాడు. యాక్షన్ ఎపిసోడ్స్‌ను సహజసిద్దంగా కెమెరాలో ఒడిసిపట్టుకొన్నాడు. ఇక సినిమాకు ఇళయరాజా అందించిన మ్యూజిక్ మరో హైలెట్. బీజీఎం సినిమాకు ప్రాణంగా నిలిచింది. ఇతర సాంకేతిక విభాగాలు పనితీరు కూడా బాగుంది. ఆర్ఎస్ ఇన్ఫోటైయిన్‌మెంట్, గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ, ఎల్‌రెడ్ కుమార్ అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

విడుదలై పార్ట్ 1 ఫైనల్‌గా మూవీ ఉందంటే?

విడుదలై పార్ట్ 1 ఫైనల్‌గా మూవీ ఉందంటే?

గ్రామీణ ప్రాంతాల్లో పోలీసులకు, ఉద్యమకారులకు జరిగే సంఘర్షణను కళ్లకు గట్టినట్టు చూపించిన చిత్రం విడుదలై పార్ట్ 1. అతివాదులకు, పోలీసుల వర్గాల మధ్య జరిగే వైరంలో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారనే విషయాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. సహజసిద్దంగా కథను చెప్పిన తీరు అందర్నీ ఆకట్టుకొనే విధంగా ఉంటుంది. సూరి, విజయ్ సేతుపతి, గౌతమ్ వాసుదేవన్, భవానీ స్రే ఫెర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్ అనిచెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X