Vidudala 2 Movie Review: విడుదల 2 మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating: 3.25/5

నటీనటులు: విజయ్ సేతుపతి, సూరి, మంజు వారియర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, కన్నడ కిషోర్ తదితరులు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వెట్రి మారన్
నిర్మాత: ఎల్‌రెడ్ కుమార్, రామారావు చింతపల్లి
సినిమాటోగ్రఫి: ఆర్ వెల్ రాజ్
ఎడిటింగ్: ఆర్ రామర్
సంగీతం: ఇళయరాజా
బ్యానర్: ఆర్ఎస్ ఎన్ఫోటైన్‌మెంట్, గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ, శ్రీ వేధాక్షర మూవీస్
రిలీజ్ డేట్: 2024-12-20

వామపక్ష సిద్దాంతాలతో సమాజంలో మార్పు తీసుకు రావడం, అసమానతలను రూపుమాపడం లక్ష్యంగా పనిచేసే పెరుమాళ్ (విజయ్ సేతుపతి)ని పోలీసులు అదుపులోకి తీసుకొంటారు. ఆయనను చిత్ర హింసలకు గురిచేసి రైలు ప్రమాదం, ఇతర దాడుల గురించిన సమాచారం రాబట్టాలని ప్రయత్నిస్తారు. అయితే పెరుమాళ్ అక్రమ అరెస్ట్ వార్త మీడియాలో రావడంతో ఆయనను వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో పెరుమాళ్ పోలీసుల నుంచి తప్పించుకొంటాడు.

టీచర్ వృత్తిని కొనసాగించే పెరుమాళ్ చెక్కెర ఫ్యాక్టరీలో కూలీగా ఎందుకు చేరాడు? నక్సల్ ఉద్యమంలోకి రావడానికి కేకే (కన్నడ కిషోర్) ఎలాంటి ప్రభావం చూపించాడు? చెక్కెర ఫ్యాక్టరీ ఓనర్ కూతురు మహాలక్ష్మీని ఎలా ఇష్టపడి పెళ్లి చేసుకొన్నాడు? రైలు ప్రమాద ఘటన వెనుక అసలు వాస్తవం ఏమిటి? శత్రు నిర్మూలన సిద్దాంతాన్ని దారి మరల్చి నక్సల్ ఉద్యమాన్ని మరో కోణంలో నడిపించాలని ఎందుకు నిర్ణయం తీసుకొన్నాడు? పెరుమాళ్ తనకు మరణం సంభవిస్తే.. తన గురించి ఎలాంటి ఎజెండా అమలు చేయాలని భార్యకు చెప్పాడు? పెరుమాళ్ జీవిత లక్ష్యం నెరవేరిందా? అనే ప్రశ్నలకు సమాధానమే విడుదల 2 సినిమా కథ.

Viduthalai Part 2 Movie Review in Telugu  Vijay Sethupathi terrific performance

విడుదల పార్ట్ 1 మూవీ విజయ్ సేతుపతి (పెరుమాళ్) అరెస్ట్‌తో ముగుస్తుంది. విడుదల 2 దానికి కొనసాగింపుగా భావోద్వేగమైన అంశాలతో హృదయాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేలా మొదలవుతుంది. అయితే ఎమోషనల్ సాగే కథలోకి ఎప్పుడైతే పెరుమాల్ లైఫ్ స్టోరీ రావడంతో కథలో వేగానికి కళ్లెం పడుతుంది. ఆ తర్వాత ఫస్టాఫ్‌లో కొన్ని భావోద్వేగమైన నన్నివేశాలు, అలాగే మంజు వారియర్‌తో ట్రాక్, పెళ్లి అంశాలు సినిమాకు బలంగా కనిపించినప్పటికీ.. కథలో వేగాన్ని పెంచకపోవడంతో సెకండాఫ్‌లో ఏం జరుగుతుందనే విషయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

సెకండాఫ్‌లో విడుదల 2 అసలు పాయింట్ మొదలై.. యాక్షన్ జోన్‌లోకి చేరుతుంది. ఎన్‌కౌంటర్లు, ప్రజా దళం ఉద్యమం గురించిన ఎజెండాను సెట్ చేసి ఎన్‌కౌంటర్ ఎపిసోడ్స్‌తో దర్శకుడు వెట్రిమారన్ హోరెత్తించాడు. క్లైమాక్స్‌లో సెన్సిటివ్ పాయింట్‌ను డీల్ చేసిన విధానం బాగుంది.

Viduthalai Part 2 Movie Review in Telugu  Vijay Sethupathi terrific performance

పెరుమాళ్ పాత్రతో విజయ్ సేతుపతి మరోసారి చెలరేగిపోయాడు. పాత్రకు తగిన గెటప్, ఆ రోల్ తగినట్టుగా బాడీ లాంగ్వేజ్‌తో ఆద్యంతం ఆకట్టుకొన్నాడు. కొన్ని సన్నివేశాల్లో పెరుమాళ్ తప్ప విజయ్ సేతుపతి కనిపించడంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. తన కెరీర్‌లో మరోసారి బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పవచ్చు. మంజు వారియర్ తన పాత్రలో హుందాగా కనిపించారు. గ్లామర్‌తో పెర్ఫార్మెన్స్‌తో అలరించారు. కేకే, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సూరి, ఇతరులు తమ పాత్రలకు పరిధి మేరకు మెప్పించారు.

సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. మ్యూజిక్, సినిమాటోగ్రఫి సినిమాకు బలంగా మారాయి. ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సన్నివేశాలు భారీగా ఎలివేట్ అయ్యాయి. వేల్ రాజ్ సన్నివేశాలను అద్బుతంగా చిత్రీకరించారు. ఫారెస్ట్ ఎపిసోడ్స్, యాక్షన్ సీన్ల చిత్రీకరణతో అదరగొట్టారు. రామారావు చింతపలి, ఎల్ రెడ్ కుమార్ అనసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

విడుదల 2 సినిమా విషయానికి వస్తే.. విజయ్ సేతుపతి ఫెర్ఫార్మెన్స్, వెట్రీమారన్ టేకింగ్, డైలాగ్స్, ఓపెనింగ్ ఎపిసోడ్, క్లైమాక్స్, ఆలోచింప చేసే డైలాగ్స్ సినిమాకు ప్రాణంగా నిలిచాయి. ఫస్టాఫ్‌లో కొంత మేర కథను సాగదీశారనిపిస్తుంది. విజయ్ సేతుపతి, మంజువారియర్ నటన కోసం ఎదురు చూసే వారికి ఈ సినిమా తెగ నచ్చేస్తుంది. నక్సల్ బ్యాక్ డ్రాప్, వామపక్ష భావజాలంతో వచ్చే సినిమాలను ఆదరించే వారికి తప్పకుండా కనెక్ట్ అవుతారు. థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సినిమా. ఈ వారం రిలీజైన సినిమాల్లో విడుదల 2 తప్పకుండా మిమ్మల్ని ఆకట్టుకొంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X