For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vidya Balan's Sherni review: విద్యా బాలన్ మెప్పించినా.. అలా విఫలమైన దర్శకుడు!

  |

  Rating:
  2.0/5
  Star Cast: విద్యాబాలన్, శరత్ సక్సేనా, విజయ్ రాజ్, ఇలా అరుణ్, బ్రిజేంద్ర కాలా, నీరజ్ కాబీ
  Director: అమిత్ వీ మసుర్కార్

  చిత్రం: షేర్ని
  నిర్మాతలు: భూషణ్ కుమార్, కిషన్ కుమార్, విక్రమ్ మల్హోత్రా, అమిత్ వీ మసుర్కార్
  కథ: ఆస్తా టికు
  డైలాగ్స్: యశస్వీ మిశ్రా, అమిత్ వీ మసుర్కార్
  మ్యూజిక్: బెనెడిక్ట్ టేలర్, నరేన్ చందవర్కార్, బండీష్ ప్రాజెక్ట్, ఉత్కర్ష్ ధోటేకర్
  సినిమాటోగ్రఫి: రాకేశ్ హరిదాస్
  ఎడిటింగ్: దీపిక హరిదాస్
  రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
  రిలీజ్ డేట్: 2021-06-18

   Vidya Balans Sherni review and rating

  విద్యా విన్సెంట్ (విద్యా బాలన్) ఓ అటవీ ప్రాంతంలో డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్. ఉద్యోగంపై ప్రేమతో భర్త పవన్ (ముకుల్ ఛద్దా)కు దూరంగా ఉంటూ ఆదివాసీల కోసం నిజాయితీగా పనిచేస్తుంటారు. అయితే తాను పనిచేసే ప్రాంతంలో ఆదివాసీలు పులివాత పడి మరణిస్తుంటారు. అయితే గతంలో అడవిలో వదిలిన పులులను గుర్తించి వాటిని నేషనల్ పార్క్‌కు తరలించాలనే లక్ష్యంతో పనిచేస్తుంటుంది. కానీ స్థానిక నేతలు, రంజన్ రాజ్‌హన్స్ అలియాస్ పింటూ (శరద్ సక్సేనా) అనే జంతు వేటగాడి వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి.

  విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించే విద్యకు స్థానికుల నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురైంది? స్థానిక రాజకీయ నేతలను ఎలా ఎదుర్కొన్నారు? పై అధికారులు వివక్ష వల్ల ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు? తన టీమ్‌లో పనిచేసే ఉద్యోగి హసన్ నూరాణీ (విజయ్ రాజ్) నుంచి ఎలాంటి సహకారం అందింది. తన పైఅధికారి నాంగియా (నీరజ్ కోబి) తీరుతో విసిగిపోయిన విద్య తన లక్ష్యాన్ని ఏ విధంగా చేరుకొన్నారు? తాను నమ్మిన సిద్దాంతం ప్రకారం పులలను రక్షించిందా అనే ప్రశ్నలకు సమాధానమే షేర్ని కథ.

  న్యూటన్ లాంటి చిత్రాన్ని అందించిన అమిత్ వీ మసుర్కర్ నుంచి షేర్ని చిత్రం రావడం, అందులో విద్యాబాలన్ కీలక పాత్రను పోషిస్తున్నారనే విషయం ఉండటం సినీ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా అంచనాలను పెంచింది. అయితే పేలవమైన కథనం, ఆసక్తికరంగా లేని సన్నివేశాలతో కథ సాగుతుంది. సినిమా ఆద్యంతం ఎలాంటి ఎమోషన్స్ లేకపోవడం వల్ల దర్శకుడు రూపొందించి తీరుతో ఈ సినిమా డాక్యుమెంటరీకి ఎక్కువ.. సినిమాకు తక్కువ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఆదివాసీల ఆవేదనకు సంబంధించిన సన్నివేశాలను సరిగా రాసుకోలేకపోవడం, అలాగే బ్యూరోకసిలో ఉండే లోపాలను స్పష్టంగా ఎత్తి చూపడంలో పూర్తిగా విఫలమయ్యారనే చెప్పవచ్చు. కథలో ప్రధానంగా కనిపించే విద్య పాత్రకు కూడా జస్టిఫికేషన్ ఇవ్వలేకపోయారు. క్లైమాక్స్‌లో కొద్ది నిమిషాలు ఎమోషనల్‌గా ఉండటం తప్ప సినిమా మొత్తాన్ని పరిశీలిస్తే.. మేకింగ్‌లో ఎక్కడ ప్రొఫెషనలిజం కనిపించదు.

  విద్య విన్సెంట్‌గా విద్యాబాలన్ తన పాత్ర పరిధి వరకు ఫర్వాలేదనిపించింది. తన సత్తా, తాహతును మించి నటనను ప్రదర్శించడానికి కథలో స్కోప్ లేకపోవడంతో సాదాసీదాగానే కనిపిస్తుంది. భార్య, భర్తల మధ్య, తల్లి, కూతుళ్ల మధ్య, అత్తా, కోడల మధ్య ఎమోషనల్‌ సన్నివేశాలకు చోటు ఉన్నా దానిని విస్మరించడంతో విద్యాబాలన్ ప్రతిభ మరుగున పడిపోయిందని అనిపిస్తుంది. ఇక పై అధికారులను ప్రతిఘటించడానికి అవకాశం ఉన్నా అది ఎక్కడ కనిపించదు. పాత్రను చాలా లో ప్రోఫైల్‌లో తొక్కేశారా అనే ఫీలింగ్ కలుగుతుంది.

  ఇక సాంకేతిక విభాగాల పనితీరుకు వస్తే రాకేశ్ హరిదాస్ అందించిన సినిమాటోగ్రఫి షేర్నికి అదనపు ఆకర్షణ. యశస్వీ మిశ్రా, అమిత్ వీ మసుర్కార్ కలిసి అందించిన డైలాగ్స్ అక్కడక్కడా పేలాయి. వందసార్లు అడవిలో పర్యటించినా.. అదీ నీకు ఒక్కసారి మాత్రమే కనిపిసుంది. కానీ పులికి మాత్రం నువ్వు 99 సార్లు కనిపిస్తావు లాంటి డైలాగ్స్ కాస్త నవ్వులు పూయిస్తాయి. జంతువులు ఉంటే... జంగిల్ ఉంటుంది.. అడవులు ఉంటే వానలు పడుతాయి.. వానల పడితే జనం బతుకుతారనే విధంగా చెప్పిన డైలాగ్స్ కూడా ఆకట్టుకొంటాయి. కథ, సన్నివేశాలకు తగినట్టుగానే మ్యూజిక్ ఉందని చెప్పవచ్చు. ఎడిటింగ్, ఇతర విభాగాలు ఫర్వాలేదనిపించాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఫర్వాలేదనిపిస్తాయి.

  ఇక ఓవరాల్‌గా షేర్ని విషయానికి వస్తే.. కథాపరంగా భారీ ఎమోషనల్ ఎలిమింట్స్ జొప్పించడానికి అవకాశం ఉన్నా దానిని సద్వినియోగం చేసుకోలేదనిపిస్తుంది. ఇక సన్నివేశాలను బలంగా రాసుకొనే స్కోప్ కథలో ఉన్నా దానిని విస్మరించారనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. బలమైన పాత్రలు, కథలో విషయం లేకపోవడం వల్ల నిస్సారంగా కథ సాగినట్టు అనిపిస్తుంది. సాధారణంగా చెడుపై మంచి గెలుస్తుంది. కానీ ఈ చిత్రంలో మంచిపైనే చెడు డామినేట్ చేసినట్టు కనిపిస్తుంది. కథకు ఉండే ఓ సార్థకత ఎక్కడ కనిపించకపోవడం ఈ సినిమాకు ప్రధాన లోపం. విద్యా బాలన్ కోసం, టైంపాస్ కోసం ఈ సినిమాను చూడవచ్చు. నేచర్ లవర్స్‌కు ఈ సినిమా నచ్చడానికి అవకాశం ఉంది.

  Actor Murali Mohan About Viceroy Hotel Incident || Filmibeat Telugu

  పంచ్‌లైన్: డ్యాక్యుమెంటరీకి ఎక్కువ.. సినిమాకు తక్కువ

  English summary
  Bollywood actress Vidya Balan's Sherni movie is releasing on Amazon Prime Video on June 18th, 2021. In this occasion, Telugu filmibeat brings exclusive review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X