Vidya Vasula Aham Review శివానీ రాజశేఖర్ గ్లామరస్‌గా.. రొమాంటిక్, ఫ్యామిలీ మూవీ ఎలా ఉందంటే?
Rating: 2.75/5
నటీనటులు: రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస్ రెడబ్డి, రవివర్మ అద్దూరి, కాశీ విశ్వనాథ్, రూపాలక్ష్మీ తదితరులు
దర్శకత్వం: మణికాంత్ గెల్లీ
నిర్మాతలు: నవ్య మహేష్, రంజిత్ కుమార్ కొడాలి, చందన కట్టా
మ్యూజిక్ డైరెక్టర్: కల్యాణి మాలిక్
సినిమాటోగ్రఫి: అఖిల్ వల్లూరి
ఎడిటర్: సత్య గిడుతూరి
రిలీజ్ డేట్: 17-05-2024
విద్యా (శివానీ రాజశేఖర్), వాసు (రాహుల్ విజయ్) స్వతంత్ర భావాలున్న నేటితరం యువతీ, యువకులు. పెళ్లి మీద వారికి ఆసక్తి లేకపోయినప్పటికీ.. అనుకోకుండా వారి పరిచయం, పెళ్లి చూపులు వారిద్దరూ పెళ్లి చేసుకోనేలా చేస్తుంది. అయితే విద్యకు అహం (ఇగో) ఎక్కువ.. అంతే మొత్తంలో వాసుకు కూడా పట్టింపు ఎక్కువ.

ఇలాంటి భిన్నాభిప్రాయాలు ఉన్న జంటకు పెళ్లి తర్వాత వారి దాంపత్య జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చాయి? వారిద్దరూ వైవాహిక జీవితంలో కలతలకు కారణాలు ఏమిటి? నిలువెత్తు ఇగో ఉన్న వారికి వచ్చిన ఇబ్బందులు ఏమిటి? కొత్తగా పెళ్లైన దంపతులు ఎలాంటి విషయాల్లో గొడవలు పడ్డారు. వారి గొడవలకు ఎలా పరిష్కరించుకొన్నారనేది ఈ సినిమా కథ.
దర్శకుడు మణికాంత్ ఎంచుకొన్న పాయింట్ బాగుంది. సున్నితమైన అంశాలను అంతే సున్నితంగా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే కథలోను, భార్య, భర్తల మధ్య గొడవల్లో బలమైన కాన్‌ఫ్లిక్ట్ లేకపోవడం వల్ల ఒక డిఫరెంట్ కంటెంట్ చూస్తామనే ఫీలింగ్ ఉండదు. కానీ ఓ సెన్సిబుల్ యంగ్ మ్యారీడ్ లైఫ్‌ను తెర మీద చూస్తున్నామనే అభిప్రాయం కలుగుతుంది. కొత్తగా పెళ్లి చేసుకొన్న ప్రతీ జంటలోను, అలాగే పక్కింటి కాపురంలో కనిపించే విషయాలను మనసుకు హత్తుకునేల చెప్పారనిపిస్తుంది. సన్నివేశాలను బలంగా రాసుకొని ఉంటే.. గతంలో వచ్చిన కొన్ని కొత్త పెళ్లి సినిమాల సరసన నిలచేదనిపిస్తుంది.

నటీనటులు ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. విద్య పాత్రకు శివానీ రాజశేఖర్ పూర్తిగా న్యాయం చేసింది. పాత్రలో ఓదిగిపోయి అత్యంత సహజంగా నటించారు అనే కంటే.. రోల్ స్వభావాన్ని బట్టి బిహేవ్ చేసిందనే ఫీలింగ్ కలుగుతుంది. కేవలం ఫెర్ఫార్మెన్స్ మాత్రమే కాకుండా గ్లామర్‌ను కూడా పండించింది. ఇక రాహుల్ కూడా తన పాత్ర స్వభావాన్ని బట్టి నేచురల్‌గా ఫెర్ఫార్మ్ చేశాడు. శివానీ, రాహుల్ ఇద్దరూ పోటీ పడి నటించారు. ఇక దేవతలు విష్ణు, లక్ష్మీగా అవసరాల శ్రీనివాస్, అభినయ, నారదుడిగా శ్రీనివాస్ రెడ్డి, ఇతర పాత్రల్లో మిగితా వారు ఒకే అనిపించారు.
ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. కల్యాణి మాలిక్ మ్యూజిక్ బాగుంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను ఎలివేట్ చేసింది. అఖిల్ వల్లూరి సినిమాటోగ్రఫి బాగుంది. శివానీ రాజశేఖర్‌ను గ్లామరస్‌గా చూపించారు. ఆర్ట్ వర్క్ బాగుంది. నవ్య మహేష్, రంజిత్ కుమార్ కొడాలి, చందన కట్టా అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఖర్చుకు రాజీ పడకుండా ప్రతీ ఫ్రేమ్‌ను రిచ్‌గా చూపించే ప్రయత్నం చూస్తే..వారికి సినిమాపై ఉన్న ప్యాషన్ కనిపిస్తుంది.
విద్య, వాసుల అహం సినిమా యూత్‌ఫుల్, రొమాంటిక్ ఎలిమింట్స్‌తో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఎలాంటి అశ్లీలతకు తావు లేకుండా క్లీన్‌గా సినిమాను తెరకెక్కించారు. అయితే కథ, సన్నివేశాలు బలహీనంగా ఉంది. దాని వల్ల అక్కడక్కడే స్టోరి తిరిగినట్టు అనిపిస్తుంది. ఈ స్టోరి పాయింట్‌కు బలమైన కాన్‌ప్లిక్ట్, ఎమోషన్స్ మరింత వర్కవుట్ అయిఉంటే.. మంచి రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయి ఉండేదనిపిస్తుంది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్నది. తీరిక వేళలలో మంచి రొమాంటిక్ మూడ్ సెట్ చేసుకొని చూసేయండి..


Click it and Unblock the Notifications











