twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'విద్యార్ధి' పాసవడం కష్టమే

    By Staff
    |

    Vidyardhi
    -జోశ్యుల సూర్యప్రకాష్‌
    చిత్రం: విద్యార్ధి
    నటీనటులు: రమేష్‌, అదితి అగర్వాల్‌, ప్రకాష్‌రాజ్‌, రాహుల్‌దేవ్‌, గిరిబాబు తదితరులు
    మాటలు : రవి, బాలాచారి
    సంగీతం: మణిశర్మ
    కెమెరా: శ్రీనివాస్‌
    కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: బాలాచారి
    నిర్మాత: ఆర్‌బి చౌదరి

    'రాజా'' సూర్యవంశం' వంటి ఎన్నో మంచి సినిమాలు అందించిన ఆర్‌బి చౌదరి తన కుమారుడు రమేష్‌ను హీరోగా పరిచయం చేస్తూ 'గంగోత్రి' ఫేం అదితి అగర్వాల్‌ హీరోయిన్‌గా సీనియర్‌ కో-డైరెక్టర్‌ బాలాచారికి దర్శకుడిగా ప్రమోషన్‌ ఇచ్చి తీసిన చిత్రం 'విద్యార్ధి'.

    కథ: క్రాంతి (రమేష్‌) హైదరాబాద్‌లోని ఇంజినీరింగ్‌ కాలేజి విద్యార్ధి. చదువు పక్కన పెట్టి, టీజింగ్‌తో క్లాస్‌మేట్‌ జాహ్నవి (అదితి)ని, ప్రిన్సిపాల్‌ (ప్రకాష్‌ రాజ్‌)ని ఇబ్బంది పెడుతుంటాడు. అది తట్టుకోలేక జాహ్నవి ఆత్మహత్యా యత్నం చేస్తుంది. కానీ హీరోయిన్‌ కదా అందుకే బతుకుతుంది. హైదరాబాద్‌లో చదువు కొన సాగించలేనని సొంత ఊరు ముంబాయికి వెళ్ళిపోతుంది. అక్కడ కూడా క్రాంతి ప్రత్యక్షమవుతాడు. ఈసారి ఆమె కేర్‌ చేయదు. సారీ అంటూ ఆమె వెనుక పడతాడు. ఈ ప్రేమ ట్రాక్‌కు బ్రేక్‌గా ఆ కాలేజీకో సమస్య ఉంటుంది. ముంబాయి మాఫియా డాన్‌ సలీం (రాహుల్‌ దే వ్‌) కాలేజి నడుపుతున్నందుకు పన్నుగా రెండు కోట్ల రూపాయలు ఇవ్వమని కాలేజి యజమానిని డిమాండ్‌ చేస్తాడు. ఇవ్వనందుకు చంపేస్తాడు. ఆయన పెద్ద కొడుకుని కూడా చంపేస్తాడు. చిన్న కొడుకు కాలేజి షట్టర్లు మూసుకుంటాడు. కాలేజి అర్ధంతరంగా మూసేయడంతో నిస్పృహ చెందిన కొందరు విద్యార్ధులు ఆత్మహత్యా ప్రయత్నాలు చేస్తుంటే చూసి తట్టుకోలేక హీరో విలన్‌ పై విజృంభిస్తాడు. తర్వాత కథ మామూలే.

    తెలుగు సినిమాపై ఇంకా 'శివ' ప్రభావం నుంచి బైట పడలేదనడానికి ఈ సినిమా మంచి ఉదాహరణ. ముంబాయి డాన్‌ అక్కడి వాడిలా కాకుండా అమలాపురం వాడిలా ఉండడం ఎబ్బెట్టుగా ఉంది. ఫైట్స్‌ జరుగుతున్నప్పుడు ముంబాయి రోడ్లు నిర్మానుష్యమైపోవడం కూడా విడ్డూరం. ముంబాయి డాన్‌లు కూడా తెలుగులో మాట్లాడుతుంటారు. ఫస్టాఫ్‌లో కథ బాగా డ్రాగ్‌ కావడంతో బోర్‌ కొడుతుంది. ప్రకాష్‌ రాజ్‌ వంటి మంచి నటుడిని వాడుకోలేదు. నిర్మాత కుమారుడు రమేష్‌ విలన్‌ పాత్రలకు సరిపోతాడు కానీ హీరోగా పనికి రాడని తేలిపోయింది. దర్శకుడి ప్రతిభ కంటే సీనియారిటీ కన్పిస్తుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X