Vidyarthi movie review.. పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్‌తో లవ్ స్టోరి.. విద్యార్థి మూవీ ఆకట్టుకొన్నదా?

నటీనటులు: చేతన్ చీను, బన్నీ వోక్స్, టీఎన్నాఆర్, నవీన్ నేని, రఘుబాబు, జీవా, మణిచందన, అరుణ్, యాదమ రాజు తదితరులు
రచన, దర్శకత్వం: మధు మాదాసు
నిర్మాత: ఆళ్ల వెంకట్
ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి
సంగీతం: విజయ్ బుల్గానిన్
ఛాయాగ్రహణం: కన్నా పీసీ
డైలాగ్స్: నవీన్ కోలా, మధు మాదాసు
రిలీజ్ డేట్: 2024-04-29

బాపట్లకు చెందిన భూపతి కుమార్తె మహాలక్ష్మీ (బన్నీ వోక్స్) తన క్లాస్ మేట్ అనాథైన చైతన్యతో ప్రేమలో పడుతుంది. వారిద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేని విధంగా పీకల్లోతు ప్రేమలో ఉంటారు. ఆ గ్రామంలో సత్యం, భూపతి మధ్య పాత కక్షల కారణంగా శత్రుత్వం కొనసాగుతుంటుంది. భూపతిపై కోపం పెంచుకొన్న సత్యం వర్గం మహాలక్ష్మీపై ఎటాక్ చేస్తుంది.

భూపతి, సత్యం మధ్య వైరం ఎందుకున్నది? భూపతిపై కోపంతో మహాలక్ష్మీపై ఎందుకు సత్యం ప్రతీకారం తీర్చుకోవాలని అనుకొన్నాడు? భూపతి, సత్యం మధ్య వివాదం నేపథ్యంలో మహాలక్ష్మీ తన ప్రేమను ఎలా రక్షించుకొన్నది? చైతన్యతో మహాలక్ష్మీ పెళ్లి జరిగిందా? వారిద్దరి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలిపారా? ఇలాంటి ప్రశ్నలకు భావోద్వేగమైన సమాధానమే విద్యార్థి సినిమా కథ.

Vidyarthi movie review

ప్రతీ ప్రేమకు కులం, మతాలు అడ్డుగోడలుగా నిలవడం చూస్తూనే ఉంటాం. అలాంటి భావోద్వేగమైన కథను పాయింట్‌గా దర్శకుడు మధు మాదాసు చక్కగా అల్లుకొన్నాడు. రెండు వర్గాల మధ్య పగ ప్రతీకారాల చుట్టు అల్లుకొన్న ప్రేమకథ కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. నటీనటులందరితోను నటనను రాబట్టుకొన్న విధానాన్ని అభినందించాల్సిందే. యూత్ ఓరియెంటెడ్ ఫిలింగ్ రూపొందించిన దర్శకుడి తీరు బాగుంది. స్టోరీ బోర్డు ద్వారా కథ చెప్పిన విధానం అతడి ప్రతిభకు అద్దం పట్టింది.

Vidyarthi movie review

నటీనటులు పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. చేతన్ చీను ప్రేమికుడి పాత్రలో స్టూడెంట్‌గా తన నటనతో ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. కాలేజీలో మహాలక్ష్మీతో లవ్ ట్రాక్‌లో తన పాత్ర పరంగా సెన్సిబుల్‌గా బిహేవ్ చేశారు. రొమాన్స్ సీన్లలో హాట్ హాట్‌గా నటించారు. ఇక ఇప్పుడిప్పుడే వర్థమాన తారగా రాణిస్తున్న బన్నీ వోక్స్ మరో మంచి పాత్రలో కనిపించింది. టీఎన్నాఆర్, నవీన్ నేని, యాదమ్మ రాజు, రఘు బాబు పాత్ర నడివి తక్కువైనప్పటీకీ గుర్తుండి పోతారు.

సాంకేతి విభాగాల పనితీరు విషయానికి వస్తే.. విజయ్ బుల్గానిన్ పాటలు, రీకార్డింగ్ బాగున్నది. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్ చాలా బాగుంది. లవ్ స్టోరికి కావాల్సిన ఫీల్‌ను తెరపైన చూపించేలా తన ప్రతిభను చాటుకొన్నారు. కన్నా పీసీ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. సినిమాలో డైలాగ్స్ ఆకట్టుకొనేలా ఉన్నాయి. నిర్మాత ఆళ్ల వెంకట్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. మూవీ తెరకెక్కించిన విధానం చూస్తే..సినిమాపై ఆయనకు ఉన్న అభిరుచిని తెలియజేసింది. గ్రామ రాజకీయాల నేపథ్యంతో వచ్చే ప్రేమకథలను ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X