IB 71 Review: 'ఘాజీ' 'అంతరిక్షం' డైరెక్టర్ హిందీ మూవీ 'ఐబీ 71' రివ్యూ.. ఎలా తీశాడంటే?
రేటింగ్: 2.75/5
టైటిల్: ఐబీ 71 (హిందీ)
నటీనటులు: విద్యుత్ జమ్వాల్, అనుపమ్ ఖేర్, విశాల్ జెత్వా, ఫైజాన్ ఖాన్, సువ్రత్ జోషి, దలిప్ తాహిల్ తదితరులు
సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్
ఎడిటర్: సందీప్ ప్రాన్సిస్
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి (బీజీఎమ్), విక్రమ్ మాంట్రోజ్ (పాటలు)
నిర్మాతలు: విద్యుత్ జమ్వాల్, భూషన్ కుమార్ (టీ సిరీస్), అబ్బాస్ సయ్యద్, క్రిష్ణన్ కుమార్
కథ: ఆదిత్య శాస్త్రి
దర్శకత్వం: సంకల్ప్ రెడ్డి
థియేటర్ రిలీజ్: మే 12, 2023
ఓటీటీ విడుదల: జూలై 7, 2023
ఓటీటీ వేదిక: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
తెలుగులో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు సంకల్ప్ రెడ్డి. ఘాజీ (Ghazi Attack), అంతరిక్షం (Antariksham 9000 KMPH) వంటి సైంటిఫిక్ సినిమాలతో ఆకర్షించాడు. తాజాగా సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన హిందీ చిత్రమే 'ఐబీ 71' (IB 71 Movie). యాక్షన్ స్టంట్స్ తో అదరగొట్టే బాలీవుడ్ యాక్టర్ విద్యుత్ జమ్వాల్, సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా మొదటగా థియేటర్లలో మే 12న హిందీ భాషలో విడుదలైంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల కోసం హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో జూలై 7 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో (IB 71 Review Telugu) చూద్దాం.

కథ:1948, 1965 సంవత్సరంలో యుద్దంలో భారత్ చేతిలో పాకిస్తాన్ రెండు సార్లు ఓడిపోయింది. కాబట్టి 1971లో ఇండియాపై ఎలాగైనా గెలవాలని పాకిస్తాన్ ఓ అటాక్ ప్లాన్ చేస్తుంది. అందుకు చైనా చేతులు కలుపుతుంది. దానికి 10 రోజుల సమయం ఉంటుంది. ఈ క్రమంలోనే ఇద్దరు కశ్మీర్ యువకులు ఖాసీమ్ ఖురేషి (విశాల్ జెత్వా), అష్రఫ్ (ఫైజాన్ ఖాన్) ఇండియాకు చెందిన గంగా అనే విమానాన్ని హైజాక్ చేస్తారు. విమానాన్ని అందులోని 30 మంది ప్రయాణికులను పాకిస్తాన్ లాహోర్ కు తీసుకెళ్తారు.

హైలెట్స్: లాహోర్ కు తీసుకెళ్లిన యువకుల డిమాండ్ ఏంటీ? హైజాక్ అయిన వారు ఎవరు? వారిని రక్షించేందుకు భారత ఇంటెలిజెన్స్ బ్యూరో ఏజెంట్ దేవ్ జమ్వాల్ (విద్యుత్ జమ్వాల్) ఏం చేశాడు? పాక్ దాడిని ముందే పసిగట్టిన ఏజెంట్ దేవ్ ఈ హైజాక్ ను ఎలా వాడుకున్నాడు? తర్వాత చోటుచేసుకున్న పరిస్థితులు ఏంటీ? అనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే ఈ ఐబీ71 (IB71 Movie Review) చూడాల్సిందే.

విశ్లేషణ: ఈ సినిమా అంతా 1971లో జరుగుతుంది. అప్పుడు సంచలనం సృష్టించిన ఇండియన్ ఎయిర్ లైన్స్ హైజాక్ ఆధారంగా ఐబీ71 చిత్రాన్ని తెరకెక్కించారు. ఘాజీతో ఇండియన్ నేవీ, అంతరిక్షం సినిమాతో వ్యోమగాములకు ఎదురయ్యే సవాళ్లను చూపించిన సంకల్ప్ రెడ్డి ఐబీ71తో ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) వ్యవస్థను చూపించారు. ఇక పాకిస్తాన్ ప్లాన్ చేసిన దాడిని 10 రోజుల్లో భారత్ ఎలా తిప్పికొట్టిందనేదే సినిమా కథ.
నెమ్మదనం: ఇండియాపై పాక్ దాడి చేసేందుకు చైనా చేతులు కలపడం, ఏజెంట్ దేవ్ సామర్థ్యాన్ని ఎలివేట్ చేసే సన్నివేశాలతో ఇంట్రెస్టింగ్ గా సినిమాను స్టార్ట్ చేశారు. తర్వాత పాకిస్తాన్ అటాక్ ప్లాన్ తెలియడం, దాన్ని అడ్డుకునేందుకు ఏజెంట్ దేవ్ ఓ ఐడియా చెప్పడం, ఐపీ చీఫ్ అధికారి అవస్థి (అనుపమ్ ఖేర్) ముందుగా వద్దని, తర్వాత ఒప్పుకోవడం వంటి సీన్లతో ప్రథమార్థం నడిపించారు. సన్నివేశాలు బాగున్నా కాస్తా నెమ్మదనంగా అనిపిస్తుంది.
హైలెట్స్: ఇక సెకండాఫ్ లో హైజాక్ తర్వాత సినిమాలో వేగం పెరుగుతుంది. లాహోర్ కు భారతీయులు వెళ్లడం, అక్కడ పాక్ అధికారుల కళ్లు కప్పి మళ్లీ ఇండియాకు చేరుకోవడం వంటి సీన్లు ఉత్కంఠత కలిగిస్తాయి. లాహోర్ లో ఇండియన్ ప్యాసెంజర్స్ ఫోన్ లో మాట్లాడే సీక్వెన్స్, ఏజెంట్ దేవ్ స్పెషల్ కోడ్ ద్వారా ఉన్నతాధికారులకు మెసేజ్ ఇచ్చే సీన్ హైలెట్ గా ఉంటుంది.

లిబర్టీ ఎక్కువ: భారత్, పాక్ ప్లాన్స్, తిప్పికొట్టడం వంటి సీన్లతో బాగా నేరెట్ చేశారు. క్లైమాక్స్ ను ముందే గెస్ చేయగలిగినా ఎంగేజింగ్ గా ప్రజంట్ చేశారు. చివర్లో వచ్చే దేశభక్తి సాంగ్ ఆకట్టుకుంటుంది. సినిమాటిక్ లిబర్టీ ఎక్కువైంది. బీజీఎమ్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు అన్నీ బాగున్నాయి.
ఎవరెలా చేశారంటే?: మరో కొత్త ప్రయోగంతో డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి విజయం సాధించాడనే చెప్పొచ్చు. ఏజెంట్ దేవ్ పాత్రలో విద్యుత్ జమ్వాల్ వన్ మ్యాన్ షోగా అదరగొట్టేశాడు. యాక్షన్ సినిమాలు ఆయనకు కొట్టినపిండి. కమాండో సిరీసుతో చాలా పాపులర్ అయ్యాడు. శక్తి, ఊసరవెల్లి, తుపాకి, సికిందర్ సినిమాలతో తెలుగు వారికి పరిచయమే. ఇక అనుపమ్ ఖేర్ తన పాత్ర పరిధి మేర చేశారు. మిగతా పాత్రలంతా బాగా చేశారు. ఫైనల్ గా చెప్పాలంటే 2 గంటల నిడివి ఉన్న 'ఐబీ71' యాక్షన్ లేకుండా మైండ్ గేమ్ తో ఆకట్టుకునేలా ఉంది (IB71 Movie Telugu Review).


Click it and Unblock the Notifications











