Liger First Review: సీటి మార్​ ఎంటర్​టైనర్..​ లైగర్​ ఫస్ట్​ రివ్యూ ఇదే..

టాలీవుడ్ డేరింగ్​ అండ్​ డ్యాషింగ్​ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫస్ట్​ టైమ్​ నటించిన చిత్రం లైగర్​. ప్రముఖ బాలీవుడ్​ సినీ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్ బ్యానర్స్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ, కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా మిక్స్​డ్​ మార్షల్​ ఆర్ట్స్​ నేపథ్యంలో లైగర్​ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతో క్రేజ్​ సంపాదించుకున్న ఈ లైగర్​ మూవీ ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్​ ఇండియా లెవెల్లో ఆగస్టు 25న అంటే గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే లైగర్​ విడుదలకు ముందే మూవీ ఫస్ట్​ రివ్యూ వచ్చేసింది. అదెలా ఉందో చూసేద్దామా!

ఇప్పుడు టాలీవుడ్​ ప్రేక్షకులే కాదు.. తెలుగు చిత్రసీమ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు ఇలా ఎంతోమంది ఎదురుచూస్తున్న సమయం. ఓ వైపు రౌడీ స్టార్​, మరోవైపు మాస్​ డైరెక్టర్ పూరీ జగన్నాథ్​. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న లైగర్​ మూవీపైనే అందరి చూపులు.

ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న తరుణం ఎట్టకేలకు రానే వచ్చింది. గురువారం వరల్డ్​వైడ్​గా క్రేజీ బజ్​ క్రియేట్​ చేసిన 'లైగర్: సాలా క్రాస్​ బీడ్' మూవీ విడుదలకు ఇక ఒక రోజే మిగిలింది. ఇంకా చెప్పాలంటే ఇంకొన్ని గంటలే మిగిలి ఉన్నాయి.

Vijay Devarakonda Liger First Review By Umair Sandhu Says Its Citii Mar Entertainer

ఈ క్షణంలో లైగర్​ మూవీ ఎలా ఉంటుందనే ఉత్కంఠత ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. ఇస్మార్ట్​ శంకర్​ సినిమాతో ఫామ్​లోకి వచ్చిన డైరెక్టర్​ పూరి జగన్నాథ్​.. ఈసారి ఎలాంటి మ్యాజిక్​ క్రియేట్​ చేస్తాడా? అని ఓ వైపు సినీ ప్రియులు, మరోవైపు క్రిటిక్స్​ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్​, సాంగ్స్​ అన్నీ సూపర్బ్​ రెస్పాన్స్​ అందుకున్నాయి. అంతకుమించి వివిధ రాష్ట్రాల్లో లైగర్​ టీమ్​కు వచ్చిన స్పందన గురించి ఎంత చెప్పిన తక్కువే. ఇక వరంగల్​లో ఫ్యాన్​డమ్​ ఈవెంట్​, గుంటూర్​లో జరిగిన ప్రీ రిలీజ్​ ఈవెంట్​లు చాలా గ్రాండ్​గా జరిగాయి.

ఈ ప్రమోషన్స్​లో భాగంగా విజయ్​ దేవరకొండ చెప్పిన డైలాగ్​లు ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటాయి. ఆగస్టు 25న ఇండియా షేక్​ కాబోతుంది అంటూ విజయ్​ చెప్పినట్లు తెలిసిందే. అంత కాన్ఫిడెంట్​గా విజయ్ చెప్పిన డైలాగ్​ నిజమవుతుందో చూడాలని క్రిటిక్స్​ ఎదురుచూస్తున్నారు.

Vijay Devarakonda Liger First Review By Umair Sandhu Says Its Citii Mar Entertainer

ఈ క్రమంలోనే లైగర్ మూవీ ఫస్ట్​ రివ్యూ రానే వచ్చేసింది. ప్రముఖ సెన్సార్​ సభ్యుడు, విశ్లేషకుడు అయిన ఉమర్​ సంధు.. లైగర్​ సినిమాను వీక్షించి తన అభిప్రాయాన్ని రివ్యూ రూపంలో తెలిపాడు. ఈ రివ్యూను సోషల్​ మీడియా వేదికగా షేర్​ చేశాడు. ​

'లైగర్​ మూవీ ఒక సీటి మార్​ మాస్​ ఎంటర్​టైనర్​. విజయ్​ దేవరకొండ వన్ మ్యాన్​ షో చేశాడు. సినిమా మొత్తం విజయ్ ఒక్కడే కనిపిస్తాడు. యాక్షన్​ స్టంట్స్​, దర్శకత్వం అద్భుతంగా ఉన్నాయి. ఇక రమ్యకృష్ణ ఒక సర్​ప్రైజ్​ ప్యాకేజీ. స్టోరీ, స్క్రీన్​ప్లే మాత్రం యావరేజ్​గా ఉన్నాయి' అని ఉమర్​ సంధు ట్వీట్​ చేశాడు. అలాగే లైగర్ మూవీకి 3 స్టార్​ రేటింగ్​ సైతం ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X