సున్నా (విజయ్ ‘అన్న’ రివ్యూ)

By Srikanya

---- సూర్య ప్రకాష్ జోశ్యుల

Rating:
2.0/5
రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో రాష్ట్రంలో అనిశ్చితి పరిస్దితి ఉండటంతో తెలుగు స్ట్రైయిట్ పెద్ద సినిమాలన్నీ రిలీజ్ డేట్ ని మార్చుకుని వెనక్కి వెళ్లాయి. దాంతో తమిళ 'తలైవా' డబ్బింగ్ తో విజయ్ ...'అన్న' గా ధియోటర్లలోకి ఉత్సాహంగా దిగింది. సరైన పోటీ లేకపోవటంతో అంతా ఈ చిత్రం మంచి కలెక్షన్స్ తో అదరకొడుతుందనుకుని ట్రేడ్ లో అంచనాలు వేసారు. అయితే విజయ్ కు పెద్దగా ఇక్కడ మార్కెట్ లేకపోవటం,పబ్లిసిటీ సరిగా చేయకపోవటంతో ఓపినింగ్స్ సైతం తెచ్చుకోలేకపోయింది. పోనీ సినిమా బాగుంటే మౌత్ టాక్ తో ముందుకు వెళ్తుందనుకుంటే బ్యాడ్ స్క్రీన్ ప్లే సినిమాను బోర్ గా మార్చేసింది.

'అన్న' గా మారకముందు,మారిన తర్వాత కథలోనూ, టెంపో లోనూ ఏ మార్పు లేకపోవటంతో కథనం నిరుత్సాహపరిచింది. అందులోనూ స్లో నేరేషన్ , ఎన్నో సార్లు చూసిన సీన్స్ మరోసారి రిపీట్ అవటంతో కూడా ప్రేక్షకుడుకి తర్వాతేం ఏం జరుగుతుందో తేలిగ్గా ఊహించేలా ప్రెడిక్టిబుల్ గా మార్చేసి..ఆసక్తిని చంపేసాయి. దర్శకుడు షాట్స్,రిఫెరెన్స్ సినిమాల పై పెట్టిన శ్రద్ద కథ,కథనాలపై కూడా పెట్టి ఉండే బాగుండేది అనిపిస్తుంది. అయితే నటీనటులు ఫెరఫార్మెన్స్ పరంగానూ, టెక్నికల్ గానూ మంచి స్టాండర్డ్స్ లో ఉంది.

వరదరాజ మొదలియార్ కథతో మణిరత్నం 'నాయకుడు' తీసి ఘన విజయం సాధించారు. ఇప్పుడు మొదలియార్ కొడుకు 'అన్న'గా ఎలా ఎదిగాడో చూపిస్తున్నాం అంటూ వచ్చిన ఈ కథలో విశ్వ(విజయ్) ఆస్ట్రేలియాలో మంచి డాన్సర్ కావాలని పోటీలలో పాల్గొంటూంటాడు. అతనికో...మినిరల్ వాటర్ ప్లాంట్ ఉంటుంది. ఆ ప్లాంట్ కి ఓ రెస్టారెంట్ ఓనర్ (సురేష్) నుంచి ఆర్డర్ వస్తుంది. ఆ ఓనర్ కూతురు...మీరా(అమలాపాల్). తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడి..దాన్ని పెళ్లి దాకా తీసుకువెళ్తాడు. పెళ్లి మాటలు మాట్లాడటానికి ..ఇండియా- ముంబై లోని తన తండ్రి వేద (సత్యరాజ్) దగ్గరకకు వస్తాడు. అప్పుడు అతనికో నిజం తెలుస్తుంది.

తన తండ్రిని పోలీసులు షూట్ ఎట్ సైట్ ఆర్డర్ తో వెతుకుతున్నారని, అతనో అక్కడి ప్రజలకు 'అన్న' అని...ఈ నేపధ్యంలో ఊహించని విధంగా మీరా వైపు నుంచి ఓ ట్విస్ట్ వస్తుంది. అక్కడ నుంచి కథ మరో మలుపు తిరుగుతుంది. విశ్వ కూడా 'అన్న' గా మారాల్సిన పరిస్ధితులు క్రియేట్ అవుతాయి. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏమిటి..హాయిగా ఉంటున్న అతని జీవితం నుంచి ఒడిదుడుకులతో టెన్షన్ టెన్షన్ గా సాగే ... జీవితం అయిన 'అన్న' గా మారాల్సిన పరిస్ధితి ఏమి వచ్చాయి అనేది మిగతా కథ.

ధాంక్స్ టు ప్రియదర్శన్, మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ అంటూ మొదట్లో వేసి సినిమా మొదలెట్టిన ఈ చిత్రంలో వారి సినిమాల్లో షాట్స్,సీన్స్ విచ్చలవిడిగా వాడారని మెల్లిమెల్లిగా అర్దమవుతుంది. అయితే మణిరత్నం 'నాయకుడు' లా, రామ్ గోపాల్ వర్మ 'సర్కార్ ' లా తీద్దామనుకున్న ఈ సినిమా..అచ్చ తెలుగు సారీ రెగ్యులర్ తమిళ సినిమాలా ఫస్ట్ హాఫ్ నడుస్తుంది. హీరో ఎక్కడో...ఆస్ట్రేలియాలో ఉండటం..అతనికి తన తండ్రి ముంబైలో పేరు మోసిన డాన్ లాంటి 'అన్న' అని తెలియక... ఇక్కడ హీరోయిన్ తో పాటలు,కమిడియన్ తో జోక్స్ వేసుకుంటూ కాలం గడుపుతాడు.

ఇంటర్వెల్ దగ్గరకి వచ్చేటప్పడికి...ఇంక బాగోదని, అన్ని సినిమాల్లో లాగానే ఇండియా వచ్చేసి.. 'అన్న' అయిపోతాడు. అయితే ఇలా పూర్తి కమర్షియల్ గా సినిమా మొత్తం లాగేస్తే బాగుండేది. అలా కాకుండా సినిమాకి క్లాస్ లుక్ ఇవ్వాలని దర్శకుడు సెకండాఫ్ లో ప్రయత్నం చేసాడు. దానికి తోడు జనం ఎప్పుడు హీరో ఎప్పుడు 'అన్న' లా మారుతాడా..విలన్స్ ని చీల్చి చెండాడుతాడా అని ఎదురుచూస్తూంటే.. అలా చేయకుండా క్లైమాక్స్ దాకా కాలం గడిపి పూర్తిగా విసిగిస్తాడు. సెకండాఫ్ కూడా ఫస్టాఫ్ లాగే మాస్,మాసాలా లా ప్రయత్నించి ఉంటే ప్రశంసలు దక్కకపోయినా కమర్షియల్ గా విజయం అయినా దక్కేది.

మిగతా రివ్యూ స్లైడ్ షో లో...

వన్ మ్యాన్ షో ...

వన్ మ్యాన్ షో ...

విజయ్ ఎప్పటిలాగే ఈ చిత్రంలో వన్ మ్యాన్ షో అన్నట్లుగా నటించుకుంటూ పోయాడు. అయితే ఫస్టాఫ్ లో సత్యరాజ్ (సర్కార్ టైప్ క్యారెక్టర్ ) పాత్రకు ఉన్న బిల్డప్ కూడా ఇవ్వలేదు. చాలా లో ప్రొఫైల్ లో విజయ్ క్యారెక్టర్ ని ఉంచి ఒక్కసారిగా రైజ్ చేద్దామనుకున్నారు. కానీ ఆ సీన్స్ పండలేదు.

కామెడీ...

కామెడీ...

సినిమాలో కొద్దో గొప్పో రిలీఫ్ సంతానం కామెడీ అనే చెప్పాలి. సంతానం వచ్చినప్పుడే జనం విజిల్స్ వేసారంటే తెలుగులోనూ అతని హవా ఏంటో అర్దం చేసుకోవచ్చు. విజయ్ కన్నా అతని రాకకోసమే జనం ఎదురుచూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అవతలి వాడి ఆయుధానికి ఆయుధ పూజ చేయటం తప్పు బ్రదర్ అంటూ విజయ్ కు అమలా పాల్ గురించి చెప్పే డైలాగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

లీడర్

లీడర్

తమిళం మాట్లాడే...ముంబై ప్రజలకు లీడర్ గా ఎదిగే విజయ్ ప్రస్దానం కన్వీన్సింగా ఉండదు. తన తండ్రి చనిపోయాక వారసత్వం తప్పదు అన్నట్లు విజయ్ రంగంలోకి దిగుతాడు. అలాగే తన తండ్రిని చంపేసిన వారిని కూడా పగ తీర్చుకునే ప్రాసెస్ కనపడదు. ఎంతసేపు బిల్డప్ షాట్స్ మీదే ఎక్కువ ఆధారపడ్డాడు దర్శకుడు.

గ్లామర్...

గ్లామర్...

హీరోయిన్ గా అమలా పాల్ ఫస్టాఫ్ లో అమాయకంగా నటించి...ఇంటర్వెల్ దగ్గర ట్విస్ట్ ఇస్తుంది. అది బాగానే పేలింది. అయితే విజయ్,అమలాపాల్ మధ్యన రొమాన్స్ సీన్స్ పండలేదు. సెకండాఫ్ లో ఆమె పోలీస్ ఆఫీసర్ గా నప్పలేదు. సినిమాకు ప్లస్,మైనస్ రెండూ ఆమే.

టెక్నికల్...

టెక్నికల్...

దర్శకుడు తన గత చిత్రాలు లాగానే టెక్నికల్ గా ఈ చిత్రాన్ని భారీగా మంచి స్టాండర్డ్స్ తో తీసారు. కానీ అందుకు తగినట్లు సీన్స్ రాసుకోలేకపోయారు. దాంతో ఎక్కువ గా ఎమోషనల్ గా కనెక్టు కావాల్సిన చోట కూడా సీన్స్ పండక మామూలు సీన్స్ లా మిగిలిపోయాయి.

సంగీతం

సంగీతం

విజయ్ సినిమాల్లో ఆడియో పెద్ద హిట్ అవుతూంటుంది. అయితే ఈ చిత్రంలో ఆడియో అంతగా ఆకట్టుకోదు. రెండు పాటలు బాగున్నాయి. అయితే రీ రికార్డింగ్ మాత్రం బాగా చేసారు. సినిమాలో కొన్ని కీలకమైన సన్నివేశాలకు అది ప్లస్ అయ్యింది.

ఛాయాగ్రహణం,ఎడిటింగ్

ఛాయాగ్రహణం,ఎడిటింగ్

సినిమాని విజువల్ ట్రీట్ లా చాలా సీన్స్ ని కెమెరామెన్ నిరవ్ షా తీర్చిదిద్దారు. ఆయన కెమెరా వర్క్ చాలా ప్లస్. అయితే ఎడిటింగ్ మాత్రం మరింత షార్పు చేయాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఒక విషయం చెప్పటానికి నాలుగైదు సీన్స్ రావటం, వివరణ సినిమాలో ఎక్కువయ్యాయి.

సహ నటీనటులు

సహ నటీనటులు

సినిమాలో సత్యరాజ్ ...విజయ్ తండ్రిగా...వేద అన్నగా చేసారు. కత్తి పట్టినవాడు..చంపటమో....చావటమో చెయ్యాలి తప్పదు అంటూ సాగే ఈ పాత్ర బాగానే ఇంపాక్ట్ ఇచ్చింది. గాడ్ పాధర్ టైప్ ఇంట్రడక్షన్ తో మొదలైన ఈ పాత్ర ...కొడుకుతో అనుబంధం, ఓ పెద్దగా ఆయన అక్కడవారిని ఆదుకునేవి పెద్దగా ఎస్టాబ్లిష్ చేయకుండానే చంపేసారు. దాంతో వారసత్వం గా వచ్చన విజయ్ సీన్స్ పెద్దగా పండలేదు.

క్లైమాక్స్ వీక్...

క్లైమాక్స్ వీక్...

సినిమాకు ప్రాణమైన క్లైమాక్స్ చాలా రెగ్యులర్ గా రొటీన్ ట్విస్ట్ తో వచ్చింది. అక్కడైనా కాస్త కిక్ ఇచ్చి ఉంటే బాగుండేది. అలాగే సినిమాకు లెంగ్త్ కూడా చాలా ఎక్కువై విసిగిస్తుంది. మూడు గంటలకు పైగా సాగిన ఈ చిత్రం ట్రిమ్ చేసి ఉంటే మరింత టైట్ గా ఉండి ఉండేది.

టీమ్...

టీమ్...

బ్యానర్ : శ్రీలక్ష్మినరసింహా విజువల్స్
నటీనటులు: విజయ్, అమలాపాల్,అభిమన్యుసింగ్, సంతానం, రేఖ, రవిప్రకాశ్, వై.జి. మహేంద్ర తదితరులు
మాటలు: శశాంక్ వెన్నెలకంటి,
పాటలు: సీతారామశాస్త్రి, వెన్నెలకంటి, వనమాలి, రాకేందుమౌళి,
సంగీతం: జి.వి. ప్రకాశ్‌కుమార్,
ఛాయాగ్రహణం: నిరవ్ షా.
సమర్పణ: సినీ గెలాక్సీ, 3కె ఎంటర్‌టైన్‌మెంట్స్,
నిర్మాత: బి.కాశీవిశ్వనాథం
కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: ఎల్ .విజయ్

ఫైనల్ గా ఈ చిత్రం....యాక్షన్ అభిమానులను కూడ అలరించటం కష్టమే అనిపిస్తుంది. సాంకేతికంగా ఎంత ఉన్నతంగా ఉన్నా.. కథ,కథనం సరిగ్గా లేకపోతే ఉపయోగం లేదని మరో సారి ప్వూ చేస్తుంది. విజయ్ చిత్రం తెలుగు నాట మరోసారి నిరాసపరిచందనే చెప్పాలి.

(గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X