Mumbaikar Review: విజయ్ సేతుపతి తొలి హిందీ మూవీ 'ముంబైకర్' రివ్యూ.. ఎలా ఉందంటే?

రేటింగ్: 2/5

టైటిల్: ముంబైకర్
నటీనటులు: విజయ్ సేతుపతి, విక్రాంత్ మస్సే, హ్రిదు హరూన్, తాన్య మణిక్తాల, సంజయ్ మిశ్రా, సచిన్ ఖేడేకర్, రణ్‌వీర్ షోరే
సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్
సంగీతం: సలిల్ అమృతే (బీజీఎమ్)
నిర్మాత: జ్యోతి దేశ్ పాండే
ఒరిజనల్ స్టోరీ: లోకేష్ కనకరాజ్
దర్శకత్వం: సంతోష్ శివన్
ఓటీటీ విడుదల తేది: జూన్ 2, 2023
ఓటీటీ వేదిక: జియో సినిమా

విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్నారు విజయ్ సేతుపతి. ఇప్పటివరకు తెలుగు, తమిళ చిత్రాల్లో అదిరిపోయే పాత్రలతో విపరీతమైన ప్రేక్షకులను సంపాదించుకున్నారు. అయితే ఆయన తొలిసారిగా చేసిన హిందీ చిత్రమే 'ముంబైకర్' (Mumbaikar). ఈ మూవీతో విజయ్ సేతుపతి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎప్పుడో థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమా అనేక కారణాలతో ఎట్టకేలకు ఓటీటీలో నేరుగా రిలీజైంది. జియో సినిమాలో జూన్ 2 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ముంబైకర్ మూవీ ఎలా ఉందో రివ్యూలో (Mumbaikar Review Telugu) తెలుసుకుందాం!

Vijay Sethupathi Vikrant Massey Mumbaikar Movie Review And Rating In Telugu

కథ: ప్రభల్ కాంత్ పాటిల్ అలియాస్ పీకేపీ (రణ్‌వీర్ షోరే) ముంబై నగరంలోనే మాఫియా డాన్. ఒక మేనెజర్ కొడుకుని కిడ్నాప్ చేయబోయి పీకేపీ కొడుకును స్కూల్ నుంచి అపహరిస్తుంది మున్ను (విజయ్ సేతుపతి) గ్యాంగ్. తాము తీసుకొచ్చింది పీకేపీ కొడుకు అని తెలుసుకున్న మున్ను గ్యాంగ్ ఏం చేసింది?

ఈ కిడ్నాప్ తో తాను ప్రేమించిన అమ్మాయి ఇషిత (తాన్య మణిక్తాల) కోసం ఏమైనా చేసే ముంబై వాసి (విక్రాంత్ మస్సే), ముంబై నగరానికి ఉద్యోగం కోసం వచ్చిన ఆది (హ్రిదు హరూన్), అలాగే ఊరికి కొత్త అయిన ట్యాక్సీ డ్రైవర్ (సంజయ్ మిశ్రా) జీవితాలు ఎలా ముడిపడ్డాయి? వాళ్ల జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి? ముంబైలో ఆదికి ఎదురైన సంఘటనలు ఏంటీ? అనే తదితర ఆసక్తికర విషయాల సముహారమే 'ముంబైకర్'.

Vijay Sethupathi Vikrant Massey Mumbaikar Movie Review And Rating In Telugu

విశ్లేషణ: నిజానికి 'ముంబైకర్' సినిమా 'విక్రమ్'తో సెన్సేషనల్ హిట్ కొట్టిన డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ మొదటి చిత్రం 'మానగరం' మూవీకి అధికారిక రీమేక్. దాదాపుగా 'మానగరం' సినిమా అన్ని భాషల్లో డబ్ అయింది. తెలుగులో 'నగరం'గా రిలీజ్ చేశారు. అయితే రీమేక్ గా వచ్చిన ఈ 'ముంబైకర్' చిన్న చిన్న మార్పులతో తీశారు.

అయితే 'నగరం' సినిమా అంతలా ఎంగేజింగ్ గా అస్సలు ఉండదు. సినిమా గందరగోళంగా స్టార్ట్ అవుతుంది. విజయ్ సేతుపతి ఎంట్రీ తర్వాత తన నటనతో కాస్తా ఆసక్తిగా అనిపిస్తుంది. అనంతరం సినిమా అంతా ప్లాట్ గా సాగుతుంది. కొత్తగా ఎక్కడా అనిపించదు.

Vijay Sethupathi Vikrant Massey Mumbaikar Movie Review And Rating In Telugu

దర్శకుడిగా ఎంట్రీ: బీజీఎమ్ ఓకే. నిర్మాణ విలువలు అంతగా బాగోలేవు. ఇక తెలుగు డబ్బింగ్ అయితే అస్సలు వినాలనిపించదు. ముంబైకర్ అని టైటిల్ లోనే ఉండగా.. ఇంకా తెలుగు నేటివిటీ కోసం హైదరాబాద్, ఆంధ్రా అని డబ్బింగ్ లో చెప్పించడం అస్సలు బాగోలేదు. సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ చేసినవాళ్లందరు పొటెన్షియల్ ఉన్న యాక్టర్స్. కానీ వారిని సరిగ్గా వాడుకోలేదు.

నిజానికి వాళ్ల నటన అనుభవమే మూవీకి కొంత ప్లస్. ఈ మూవీతో డైరెక్టర్ గా పరిచయమయ్యారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్. ఎన్నో హిట్ చిత్రాలకు సినిమాటోగ్రఫీ చేసిన ఆయన దర్శకుడిగా ప్లాప్ అయ్యారనే చెప్పుకోవచ్చు.

Vijay Sethupathi Vikrant Massey Mumbaikar Movie Review And Rating In Telugu

ఎవరెలా చేశారంటే?: బాలీవుడ్ నటుడు విక్రాంత్ మస్సే చాలా వరకు సాఫ్ట్ క్యారెక్టర్స్ చేశాడు. మీర్జాపూర్ లో కూడా తెలివైన సౌమ్యుడిగానే ఉంటుంది ఆయన పాత్ర. అయితే ఇందులో మాత్రం మాస్ రోల్ చేయడమే కాకుండా అదరగొట్టాడు. మాస్ రోల్స్ లో కూడా పర్ఫెక్ట్ సెట్ అయ్యేలా ఉంది విక్రాంత్ నటన. హ్రిదు హరూన్ నటన చాలా బాగుంది.

సంజయ్ మిశ్రాతోపాటు మిగతా వారి నటన కూడా ఆకట్టుకుంటుంది. డాన్ కావాలనుకునే పాత్రలో విజయ్ సేతుపతి నటించారు. ఆయన పాత్రలో ఉన్నంతలా నవ్వించారు. చాలా బాగా చేశారు. కానీ సినిమా పూర్తయ్యక అలాంటి నటుడు ఈ పాత్రకు ఎలా ఒప్పుకున్నారనే సందేహం రాక మానదు.

Vijay Sethupathi Vikrant Massey Mumbaikar Movie Review And Rating In Telugu

ఫైనల్ గా చెప్పాలంటే?: సందీప్ కిషన్ నగరం సినిమా చూసిన వాళ్లైతే ముంబైకర్ ను పూర్తిగా లైట్ తీసుకోండి. నటీనటులు యాక్టింగ్ తప్పా సినిమాలో ఎలాంటి కొత్తదనం, ఆసక్తి కనిపించదు. అయినా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కోసం చూద్దామనుకుంటే మాత్రం ఆడియెన్స్ ఎట్ ఓన్ రిస్క్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X