twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓ రేంజిలో పేలింది ('తుపాకి' రివ్యూ)

    By Srikanya
    |

    -జోశ్యుల సూర్య ప్రకాష్

    Rating:
    3.0/5
    సంస్థ: ఎస్‌.వి.ఆర్‌.మీడియా ప్రై. లి.
    నటీనటులు: విజయ్‌, కాజల్‌, అక్షరగౌడ, జయరామ్‌, విద్యుత్‌ జమ్వాల్‌, అనుపమ్‌ ఖేర్‌, సత్యన్‌, మనోబాల, ప్రశాంత్‌ నాయర్‌, దీప్తి నంబియార్‌ తదితరులు.
    సంగీతం: హారిస్‌ జైరాజ్‌
    ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
    ఫోటోగ్రఫీ: సంతోష్ శివన్
    మాటలు: శ్రీ రామకృష్ణ
    కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మురుగదాస్‌
    నిర్మాత: శోభారాణి

    విలన్ 'జీహాద్' అని అదే పనిగా చెవి కోసిన మేకలా అరుస్తూంటాడు.. అప్పుడు ఎక్కడ నుంచో వాళ్లపైకి దూకిన హీరో పాకిస్ధాన్ ని తనదైన శైలిలో పెద్ద పెద్ద లెంగ్తీ డైలాగులతో విమర్శిస్తూ, దేశభక్తిని మిక్స్ చేసి ఆ టెర్రరిస్టు విలన్స్ తో భారీ ఎత్తున ఫైట్ చేసి దేశాన్ని రక్షిస్దాడు. అలాంటి సినిమాలు అంటే జనం భయపడిపోయారు. ఆ తరహా సినిమాలు టెర్రరిస్టు లు విసిరే బాంబులకన్నా పవర్ ఫుల్ అని భాక్స్ లు మొదటి రోజే మూటకట్టి, ప్లాప్ సీల్ వేసి మొహమాటం లేకుండా వెనక్కి పంపించేస్తున్నారు. ఎక్కడో రిలీజ్ రోజే ధియోటర్ లో నిద్రపోదామనుకున్న వారు తప్ప వాటి జోలికి పోవటం లేదు. అలాంటి క్లిష్టమైన ఈ సమయంలో మురగదాస్.. టెర్రరిజం బ్యాక్ డ్రాప్ చిత్రం తీసి వదిలారు. అయితే హిట్ టాక్ తెచ్చుకున్నారు. అదెలా సాధ్యమైందీ.. అంటే...

    జగదీష్(విజయ్) ఆర్మీ ఆఫీసర్.. సెలవలకు సొంత ఊరు ముంబైకి వస్తాడు. సర్లే ఈ సెలవల్లోనే అతనికి పెళ్లి చేసి పంపేయాలని ఇంట్లో వాళ్లు నిషా(కాజల్)తో పెళ్లి చూపులు ఎరేంజ్ చేస్తారు. అయితే పెళ్లి చూపుల్లో నచ్చని ఆమె ఆ తర్వాత అతనికి కనపడి ప్రేమలో పడేలా చేస్తుంది. ఆ ట్రాక్ అలా నడుస్తూండగా... సిటిలో టెర్రరిస్టులు బాంబు ప్రేలుళ్లకు ప్లాన్ చేస్తారు. ఆ విషయం అనుకోని పరిస్ధితుల్లో ఓ టెర్రరిస్టు తన చేతికి చిక్కటంతో తెలుసుకుంటాడు జగదీష్. అంతేగాక సిటిని టార్గెట్ చేస్తూ 12 చోట్ల బాంబులు ప్రేలేలా ప్లాన్ చేసారని తెలుసుకుంటాడు. అక్కడనుంచి జగదీష్ ఏం చేసి, సిటినీ ఆ టెర్రరిస్టుల నుంచి కాపాపాడు.. అనేది కథలో కీలకాంశం. అది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

    సినిమాలో విలన్, హీరో వేసే ఎత్తుకు పై ఎత్తులు... ఇద్దరూ ఒకే రకంగా ఆలోచించటం వంటి ఎపిసోడ్స్ చూస్తూంటే మనకి ఈ మధ్యనే వచ్చిన త్రివిక్రమ్ జులాయి చిత్రం గుర్తుకు వస్తుంది. ఇద్దరూ బ్యాట్స్ మెన్ రైజింగ్ లో విలన్ జోకర్ పాత్రనుంచి ప్రేరణ పొందటం వలన కావచ్చు. అది ప్రక్కన పెడితే టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో ఎక్కడా మన దృష్టి మరల్చకుండా సీన్స్ వేయటం, స్క్రీన్ ప్లే తయారు చేయటం కత్తి మీద సామే. ఎందుకంటే ప్రేక్షకుడకి తెలియని విషయాలు(స్లీపర్ సెల్స్ వంటివి), ప్రపచం(టెర్రరిజం) గురించి కొద్దిగా హింట్స్ ఇస్తూ ముందుకు సాగాలి. అందులో మురగదాస్ పూర్తి స్ధాయి సక్సెస్ అయ్యారు. అయితే ఇంటర్వెల్ దాకా విలన్, హీరో ల మధ్య గేమ్ స్టార్ట్ కాకపోవటంతో కాస్త లాగినట్లు అనిపిస్తుంది. కాని సెకండాఫ్ ఆ విషయం మర్చిపోయాలా చేస్తుంది. హైలెట్స్ లో ఇంటర్వెల్ ముందు వచ్చే ఎపిసోడ్ ని హైలెట్ గా తీసాడు. థియోటర్ లో అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ముందే చెప్పుకున్నట్లు దేశభక్తి డైలాగులతో నింపలేదు. ఎక్కడా ఒక్క డైలాగు కూడా ఎగస్ట్రా లేకుండా కథనం నడిపాడు. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ మంచి ఉత్కఠను రేపాయి. కాజల్,జయరామ్ పాత్రలు కథలో ఇమడకపోయినా రిలీఫ్ కు పనికివచ్చాయి. నటీనటుల్లో విజయ్.. ఆర్మీ ఆఫీసర్ గా అదరకొట్టాడు. కాజల్.. తన రెగ్యులర్ బాణీలో గ్లామర్ తో సీన్స్ పండించే ప్రయత్నం చేసింది. విలన్ గా వేసిన విద్యుత్‌ జమ్వాల్ హీరోకి పోటీ ఇచ్చాడు. మిస్టర్ ఫెరఫెక్ట్ అమర్ ఖాన్ అంతటి వాడిని మెప్పించిన మురగదాస్ దర్శకత్వ ప్రతిభ గురించి కొత్తగా చెప్పేదేమి లేదు. ఛాయాగ్రహణం బాగుంది. సంగీతం సోసోగా ఉంది. హారిస్‌ జైరాజ్‌ స్ధాయిలో పాటలు లేవు. విజయ్ కు చెప్పించిన డబ్బింగ్ కూడా బావుంది.

    ఫైనల్ గా విజయ్ ఏ చిత్రమూ తెలుగులో ఆడలేదు. అలాంటిది ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందే అవకాసం కనిపిస్తోంది. యాక్షన్ ధ్రిల్లర్స్ ఇష్టపడేవారికి బాగా నచ్చే చిత్రం ఇది. ఫ్యామిలీతో కూడా వెళ్లి ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేయవచ్చు. అయితే సినిమా చూడటం పూర్తైన తర్వాత ఎందుకు మనకు తెలుగులో ఇలాంటి వైవిధ్యమైన సినిమాలు రావు అనే బాధ మాత్రం కలుగుతుంది. అందుకు ప్రిపేరయ్యి వెళ్లాలి.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Vijay's dubbed movie 'Thuppaki' released with hit talk.The story revolves around the main character Jagadish, played by Vijay, a youngster from a Tamil family in Mumbai. He leads a happy life until he goes through an unexpected turn. The remaining story talks about how he copes with the problem and what decision he takes to solve the crisis.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X