twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రేక్షకుల దురదృష్టం

    By Staff
    |

    Vijayam
    - జలపతి గూడెల్లి
    చిత్రం: విజయం
    నటీనటులు: రాజా, గజాలా, మురళీమోహన్‌, గిరిబాబు, సునీల్‌
    సంగీతం: కోటి
    నిర్మాత: డి.రామానాయుడు
    కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు

    ఎన్ని చిత్రాలు నిర్మించినా, ఎన్ని చిత్రాలకు దర్శకత్వం వహించినా 'ఫిల్మ్‌ మేకింగ్‌'లో పరిణితి రాకపోవడం ఒక్క తెలుగువారికే సాధ్యం కాబోలు. వందకు పైగా చిత్రాలు నిర్మించిన రామానాయుడు, గతంలో ఉత్తమ చిత్రాలు అందించిన సింగీతం శ్రీనివాసరావులిద్దరు కలిసి ఇంత అమెచ్యుర్‌ గా సినిమా తీసి ప్రేక్షకుల మీదకు రుద్దుతారని ఎవరూ ఊహించరు. కానీ విజయం అనే ఈ చిత్రంలో జరిగింది మాత్రం అదే. వృద్దులైనీ ఈ ఫిల్మ్‌ మేకర్స్‌ ఇద్దరూ 'ఈనాటి సోకాల్డ్‌ యూత్‌ ట్రెండ్‌'కు అనుగుణంగా సినిమా తీద్దామనుకొని చాలా బోర్‌ కొట్టే సినిమా తీసి మనమీదకు వదిలారు. కథ వీక్‌. కథనం సాగతీత.

    మధ్యలో ఉండే కామెడీ మీర ఛీప్‌. పాటలు బాగున్నా సినిమా కథనంలో అవి పెద్దగా ఉపయోగపడలేదు. అందం, నటించే సత్తా ఉన్న గజాలా మరో రాంగ్‌ చిత్రంలో నటించింది. 'ఓ చినదాన' చిత్రంలో నటించిన రాజా ఈ చిత్రంతో హీరోగా రంగప్రవేశం చేశాడు. చూడ్డానికి అందంగానే ఉన్నా, రాజాకు పెద్దగా నటించే స్కోప్‌ లేకపోవడంతో అతని ఆరంగేట్రం పేలవంగానే ముగిసింది. సింపుల్‌ గా ఈ సినిమాను స్కిప్‌ చేయడం ఉత్తమం.

    కథ తెలుసుకోవాలనువారికోసం...రాజా గిరిజనుడు. అతన్ని 'ఏదో పెద్దవాడిని' చేయాలని మురళీమోహన్‌ పట్నంలో చదవిపిస్తుంటాడు. రాజా సేమ్‌ కాలేజ్‌ లో చదువుకుంటోన్న ధనవంతురాలైన గజాలాను ప్రేమిస్తాడు. తనూ ప్రేమిస్తుంది. కానీ రాజా స్నేహితులు తమాషాకు రాజా చాలా పెద్ద ధనవంతుడని చెప్తారు. చివరికి ఈ అబద్దమే వీరినిద్దరినీ విడదీస్తుంది. చివరికి హీరోగారు గోల్డ్‌ మెడల్‌ సంపాదించి..తన నిజాయితీని నిరూపించుకుంటాడు.

    ఇలాంటి లాజిక్‌ రహిత కథకు అంతే స్థాయిలో సాగే అతి సాధారణ కథనం. పేరుగాంచిన సంభాషణల రచయిత సత్యానంద్‌ ఎంత త్వరగా రాయడం మానుకుంటే టాలీవుడ్‌ కు అంత మంచిది. ఏ మాత్రం నవ్యత లేని, సృజనాత్మకత కొరవడిన ఆయన సంభాషణలు చాలా చిత్రాలకు మైనస్‌ పాయింట్‌ గా నిలిచాయి (ఇటీవల విడుదలైన టక్కరిదొంగ, జానీ తదితర చిత్రాలు).

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X