»   » విజేత మూవీ రివ్యూ: ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా..

విజేత మూవీ రివ్యూ: ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా..

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Vijetha Cinema Review విజేత సినిమా రివ్యూ

  Rating:
  2.5/5
  Star Cast: కల్యాణ్ దేవ్, మాళవిక నాయర్‌, మురళీ శర్మ, తనికెళ్ల భరణి, జయప్రకాష్‌
  Director: రాకేష్ శవి

  విజేత సినిమా పేరు గుర్తుకు రాగానే మెగాస్టార్ చిరంజీవిని నటుడిగా ఆకాశానికి ఎత్తిన చిత్రం గుర్తుకు వస్తుంది. అలాంటి ప్రజాదరణ పొందిన టైటిల్‌తో సినిమా వస్తుందంటే ప్రత్యేకమైన అటెన్షన్ తప్పక ఉంటుంది. అదికాకుండా మెగా ఫ్యామిలీ నుంచి అలాంటి టైటిల్‌తో వస్తున్నారంటే ఇంకా స్పెషల్ ఎట్రాక్షన్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ విజేత టైటిల్‌తో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం కాబోతున్నాడు.

  తన మొదటి చిత్రానికి తండ్రి, కొడుకుల మధ్య నడిచే భావోద్వేగాన్ని కథగా మలిచుకొన్నాడు. అలాగే తొలిచిత్ర దర్శకుడు రాకేశ్ శశిని తనతోపాటు టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. తమ తొలిచిత్రాలతో హీరో, దర్శకులు ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకొన్నారా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

  విజేత కథ

  రామ్ (కల్యాణ్ దేవ్) ఇంజినీరింగ్ పూర్తి చేసి బాధ్యత లేకుండా తిరుగుతుంటాడు. తండ్రి శ్రీనివాసరావు ఓ కంపెనీలో మామూలు ఉద్యోగి. కొడుకు స్థిరపడితే చూడాలనే ఆందోళనతో ఉంటాడు. ఓ సందర్భంలో ఆకట్టుకొని, ఎదురింట్లోకి అద్దెకు వచ్చిన జైత్ర (మాళవిక నాయర్)‌ ప్రేమిస్తుంటాడు. ఈ క్రమంలో తనకు నచ్చిన పని చేయాలనే ఉద్దేశంతో లోకల్ బాయ్స్.. సర్ఫ్‌రైజ్ ప్లానర్ అనే ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని ప్రారంభిస్తాడు. రామ్ చేసిన ఓ పని కారణంగా తండ్రికి గుండెపోటు వస్తుంది. చెల్లెలి పెళ్లి కోసం భారీ కట్నం ఇవ్వాల్సిన సమస్య ఎదురవుతుంది. ఇదిలా ఉండగా, కుటుంబం కోసం తన తండ్రి తనకిష్టమైన వృత్తిని ఎంచుకోకుండా మాములు ఉద్యోగి మారుతాడనే విషయాన్ని రామ్ తెలుసుకొంటాడు.

  విజేతగా నిలిచేదెవరంటే

  కుటుంబం కోసం శ్రీనివాసరావు త్యాగం చేసింది ఏమిటి? తండ్రి కోరికను కొడుకుగా రామ్ తీర్చడానికి ఏం చేశాడు. అనారోగ్యానికి పాలైన తండ్రిని ఎలా కాపాడుకొన్నాడు. తాను ప్రారంభించిన ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీతో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది? జైత్ర ప్రేమ ఎక్కడి వరకు వచ్చింది? చెల్లెలి పెళ్లి కోసం రామ్ ఏం చేశాడు. చివరికి తండ్రి దృష్టిలో రామ్ హీరోగా ఎలా మారాడు అనే ప్రశ్నలకు సమాధానమే విజేత చిత్ర కథ.

  తొలిభాగంలో

  తొలిభాగంలో విజేత సినిమా రెగ్యులర్ కమర్షియల్ అంశాలతో ప్రారంభమవుతుంది. హీరో ఇంట్రడక్షన్, పాట, అమ్మాయిని చూసి ఆకర్షణకు లోనవ్వడం అనే అంశాలు రొటీన్‌గా ఉన్నప్పటికీ.. వినోదం మధ్య ఫీల్‌గుడ్‌గా అనిపిస్తాయి. ప్రేక్షకుడు ఓ కొత్త అనుభూతికి లోనయ్యే విధంగా తండ్రి, కొడుకుల మధ్య ఎమోషనల్ సీన్లు తెరపైన కదలాడుతాయి. హీరోయిన్ తల్లి (ప్రగతి) బైక్ నడిపించే అంశాలు సాధారణ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. తండ్రి ఆరోగ్య సమస్య తలెత్తడం, అందుకు కారణం హీరోనే కారణం అనే ఎలిమెంట్‌తో విశ్రాంతి కార్డు పడుతుంది.

  రెండోభాగంలో

  రెండో భాగంలో జీవితంలో తనకు తాను నిలబడేందుకు చేసిన ప్రయత్నాలను ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఇక సర్ప్రైజ్ ప్లానర్ ఈవెంట్‌లో భాగంగా ఓ కంపెనీ సీఈవో కుటుంబాన్ని కలిపే ఎపిసోడ్ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ఓ ఉన్నత కుటుంబంలో నెలకొన్న విభేదాలను పరిష్కరించే అంశం చక్కగా ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ ఎపిసోడ్‌ను చెల్లెలి పెళ్లికి ముడిపెట్టే అంశాన్ని దర్శకుడు చక్కగా ముడిపెట్టడం ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతుంది. ఇక తండ్రిని హీరోగా చేసేందుకు చేసిన క్లైమాక్స్ ఎపిసోడ్ బాగానే ఉన్నప్పటికీ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లే సత్తా కనిపించదు.

  దర్శకుడు రాకేష్ ప్రతిభ

  తండ్రి, కొడుకుల భావోద్వేగాలతో దర్శకుడు రాకేష్ అల్లుకొన్న కథ సగటు ప్రేక్షకుడిని ఉద్వేగానికి గురిచేసేలా ఉంటుంది. కానీ పూర్తిస్థాయిలో స్క్రిప్టుపై వర్క్ చేయలేదనే అంశం క్లైమాక్స్ సాదాసీదాగా ముగించడం కొంత మైనస్ అనిచెప్పవచ్చు. కాకపోతే ఫస్టాఫ్‌లో ప్రగతి సీన్ గానీ, తండ్రి, కొడుకుల మధ్య వచ్చే కొన్ని సీన్లను, అలాగే సెకండాఫ్‌లో ఫ్యామిలీ ఎలిమెంట్స్‌ను తెరకెక్కించిన దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టాయి. అన్ని విభాగాలను బ్యాలెన్స్ చేయడం వల్ల తొలిచిత్రంతోనే రాకేష్ మంచి మార్కులు కొట్టేశాడని చెప్పవచ్చు.

  కల్యాణ్ దేవ్ విజేతనే

  ఇక కల్యాణ్ దేవ్‌కు హీరోగా మొదటి చిత్రం. టాలీవుడ్‌లో గొప్ప ఫ్యామిలీ నుంచి హీరోగా వస్తున్నాడంటే మాస్, కమర్షియల్ అంశాలను భారీగా దట్టించి, సినిమా భారాన్ని మొత్తం హీరోపైనే వేస్తారు. విజేత సినిమాలో అలాంటి రొటీన్ ఫార్ములాకు కల్యాణ్‌ దూరంగా ఉండటం ఆయన విజన్ ఎంటో చెప్పకనే చెబుతుంది. సినిమా భారాన్ని తనపై వేసుకోకుండా జాగ్రత్త పడటం కల్యాణ్ టాలీవుడ్‌లో లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలనే ప్రయత్నం కనిపిస్తుంది. డ్యాన్సులు, నటన, డైలాగ్ డెలివరీ, ఇతర అంశాలను మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. తొలి సినిమా వరకు కల్యాణ్ డిస్టింక్షన్ మార్కులు సంపాదించుకోకపోయినా క్లాస్ మార్కులు సొంత చేసుకొన్నారని చెప్పవచ్చు. తన పాత్రపై ఫోకస్ పెట్టకుండా ఉండటంతో కల్యాణ్ విజేతగా నిలిచారు.

  మాళవిక నాయర్ గురించి

  జైత్రగా మాళవిక నాయర్‌కు అంతగా ప్రాధాన్యం లేని పాత్ర లభించింది. పాటల్లో కూడా పెద్దగా కనిపించదు. హీరో, హీరోయిన్ల ట్రాక్ లేకపోవడంతో కొన్ని సీన్లకే పరిమితం అయింది. ఎదురింటి అమ్మాయిలానే కనిపించారు. తన పాత్ర పరిధి పరిమితం కావడం వల్ల మాళవిక నటన గురించి పెద్దగా ప్రస్తావించాల్సిన అవసరం లేదనే చెప్పవచ్చు.

  మురళీ శర్మ విన్నర్

  విజేత చిత్రంలో అసలు విన్నర్ మురళీ శర్మ. బాధ్యతలు, సమస్యలతో సతమతమయ్యే తండ్రి పాత్రలు పోషించడంలో ఇటీవల ఆయనను మించిన వారెవరు లేరనే అభిప్రాయం నెలకొంది. ఈ చిత్రంలోనూ పలు రకాల షేడ్స్ శ్రీనివాసరావు క్యారెక్టర్‌లో కనిపిస్తాయి. బరువైన పాత్రను అతిగా అందంగా తెరమీద ఆవిష్కరించడంలో మురళీ శర్మ అద్భుతంగా రాణించారు. వాస్తవ జీవితంలో ప్రతీ ఇంటిలో కళ్ల ముందు కనిపించే తండ్రిని గుర్తు తెచ్చేంతగా తన పాత్రకు ప్రాణం పోసారు.

  సెంథిల్ కుమార్ ఫొటోగ్రఫీ

  భారీ బడ్జెట్ చిత్రాలకు, ప్రజాదరణ పొందిన చిత్రాలకు పనిచేసిన సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్. విజేత చిత్రాన్ని తెర మీద ఆహ్లాదకరంగా రూపొందించడంలో సెంథిల్ తన మార్కును చూపించారు. కొన్ని సన్నివేశాలను అందంగా తెరకెక్కించి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.

  హర్షవర్ధన్ మ్యూజిక్

  విజేత చిత్రానికి హర్షవర్ధన్, రామేశ్వర్ సంగీతాన్ని అందించారు. భావోద్వేగంతో నడిచే సన్నివేశాలకు రిరీకార్డింగ్ అదనపు బలాన్ని ఇచ్చింది. కో కొక్కొరోకో, అడుగుగున, ఆకాశానికి తాకే పాటలు బాగున్నాయి.

  ఎడిటింగ్, ఇతర విభాగాలు

  కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ ఫర్వాలేదు. తొలిభాగంలో కొన్ని సీన్లు కథ వేగాన్ని అడ్డుకునేలా ఉంటాయి. కామెడీ కోసం ఉంచడం వల్లనో ఏమో కథ నెమ్మదిగా నడిచినట్టు అనిపిస్తుంది. ఆర్ట్, ఇతర విభాగాల పనితీరు బాగుంది.

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  విజేత చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వరాహి సంస్థ రూపొందించింది. సాయి కొర్రపాటి, రజనీ కొర్రపాటి నిర్మాతలుగా వ్యవహరించారు. క్లాస్ టచ్‌తో సినిమాలోని ప్రతీ ఫ్రెమ్ రిచ్‌గా కనిపించింది. సాంకేతిక విభాగాల ఎంపిక బాగుంది. వరాహి సంస్థ బ్రాండ్‌కు తగినట్టే నిర్మాణ విలువలను పాటించారు. భారీగా హైప్ క్రియేట్ చేయకుండా లో ప్రొఫైల్‌లో సినిమాను విడుదల చేసినట్టు కనిపించింది. ప్రమోషన్‌తో మరింత ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.

  ఫైనల్‌గా

  తండ్రి, కొడుకుల మధ్య సంఘర్షణ, భావోద్వేగంతో నిండిన కథయే విజేత. మురళీశర్మ నటన అదనపు ఆకర్షణ. వీకెండ్‌లో ప్రేక్షకులకు రెండు గంటలపాటు చక్కటి వినోదాన్ని పంచే చిత్రం. మాస్, థ్రిల్లర్ సినిమాలతో విసిగిపోయిన ప్రేక్షకులకు విజేత కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు.

  కథ, కథనాలు

  • మురళీ శర్మ యాక్టింగ్
  • మ్యూజిక్, సినిమాటోగ్రఫీ

  మైనస్ పాయింట్స్

  • కల్యాణ్ దేవ్ యాక్టింగ్
  • మాళవిక శర్మ
  • ఫస్టాఫ్‌లో స్లో నెరేషన్

  తెర ముందు, తెర వెనుక

  నటీనటులు: కల్యాణ్ దేవ్‌, మాళవిక నాయర్‌, మురళీ శర్మ, తనికెళ్ల భరణి, జయప్రకాష్‌, కిరిటి దామరకొండ, ప్రగతి తదితరులు
  దర్శకత్వం : రాకేష్‌ శశి
  నిర్మాత : సాయి కొర్రపాటి, రజనీ కొర్రపాటి
  సంగీతం : హర్షవర్దన్‌, రామేశ్వర్‌
  సినిమాటొగ్రఫి: సెంథిల్ కుమార్

  English summary
  Tollywood is welcoming another hero from Mega family. Mega star Chiranjeevi son in law Kalyan Dhev is introducing with Vijetha movie. This movie deals with the journey of a man who’s aimless and carefree about life. The story explores the relationship between a father and his son. Vijetha set to release on July 12th. In ocassion, Kalyan speaks to media about the movie.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more