Vikkatakavi OTT Review: వికటకవి వెబ్ సిరీస్ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: నరేష్ అగస్త్య, మేఘా ఆకాశ్, సిజ్జు, తారక్ పొన్నప్ప, రఘు కుంచె, ముఖ్తార్ ఖాన్, అమిత్ తివారీ తదితరులు
దర్శకత్వం: ప్రదీప్ మద్దాలి
నిర్మాతలు: రజనీ తళ్లూరి
మ్యూజిక్: అజయ్ అర్సాదా
సినిమాటోగ్రపి: షోయబ్ సిద్దిఖీ
ఎడిటర్: సాయి బాబు తలారీ
బ్యానర్: SRT ఎంటర్‌టైన్‌మెంట్స్
OTT Release: ZEE5
OTT Episode: 6 (30-40 mins)
రిలీజ్ డేట్: 2024-11-28

శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలోని అమరగిరి ప్రాంతంలోని దేవతల గుట్ట ఆటవీ ప్రాంతంలో మిస్టరీగా ప్రజలు జ్ఞాపకశక్తి కోల్పోయి గతం కోల్పోతుంటారు. ఈ మిస్టరీని ఛేదించడానికి ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన విద్యార్థి రామకృష్ణ (నరేష్ అగస్త్య) డిటెక్టివ్ అవతారం ఎత్తి అమరగిరి చేరుకొంటాడు.

Vikkatakavi Web Series Review and Rating in Telugu  Pradeep Maddali and Naresh Agastya impresses

అమరగిరి గ్రామస్థులు ఎందుకు గతాన్ని మరిచిపోతుంటారు? దేవతల గుట్టలో అగ్ని వర్షం కురువడానికి దేవత శాపమే కారణమా? ఇంతకు రామకృష్ణ ఎవరు? అమరగిరికి రామకృష్ణ ఎందుకు వెళ్లాడు? రామకృష్ణను ఆ గ్రామ పెద్ద రాజ నర్సింహ రావు (సిజ్జు), ఎమ్మెల్యే రఘుపతి (రఘు కుంచె) ఎందుకు అడ్డుకున్నారు? మహాదేవ్‌ (తారక్ పొన్నప్ప)కు రామకృష్ణ ఉన్న రిలేషన్ ఏమిటి? లక్ష్మీ (మేఘా ఆకాశ్)తో ప్రేమ బంధం ఎలా సాగింది? సౌత్ పాకిస్థాన్ ఏర్పాటు లక్ష్యంగా అజయ్ ఖాన్ చేసిన దుష్ట ప్రయత్నాలను రామకృష్ణ ఎలా తిప్పికొట్టాడు? అనే ప్రశ్నలకు సమాధానమే వికటకవి వెబ్ సిరీస్ కథ.

వికటకవి కథ విషయానికి వస్తే.. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం బ్యాక్ డ్రాప్‌తో స్టోరీ 70వ దశకంలో ప్రారంభమవుతుంది. అటవీ ప్రాంతంలో ఓ ప్రదేశానికి వెళ్లిన వారంతా గతాన్ని మరిచిపోవడమనే పాయింట్‌తో ప్రేక్షకుడిని కథలోకి దర్శకుడు ప్రదీప్ మద్దాలి తీసుకెళ్లిన తీరు బాగుంది. చిన్న చిన్న ట్విస్టులతో ప్రతీ ఎపిసోడ్‌లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన విధానం బాగుంది. ఫ్లాష్ బ్యాక్‌ను డీల్ చేసిన విధానం, పాత్రలను కథలోకి జొప్పించిన విధానం ఆయన ప్రతిభకు అద్దం పట్టింది. ఎమోషన్స్‌తోపాటు యాక్షన్ పార్టుగా తీర్చిదిద్దిన తీరు మెప్పించేలా ఉంది.

Vikkatakavi Web Series Review and Rating in Telugu  Pradeep Maddali and Naresh Agastya impresses

నటీనటుల విషయానికి వస్తే.. రామకృష్ణగా నరేష్ అగస్త్య బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడనే కంటే.. వెబ్ సిరీస్‌ను మొత్తం తన భుజాల మీద మోశాడనే చెప్పాలి. రామకృష్ణగా మాత్రమే కనిపిస్తూ.. మెచ్యురిటీతో కూడిన నటనను ప్రదర్శించాడు. తన కెరీర్‌లో ఈ వెబ్ సిరీస్ ద్వారా బెస్ట్ ఇచ్చాడనే ఫిలింగ్ కల్పించాడు. రాజాగా సిజ్జు హుందాతనంతో కనిపించాడు. ఎమ్మెల్యే రఘుపతిగా మరోసారి రఘు కుంచె చెలరేగిపోయాడు. పవర్‌ఫుల్ విలనిజంతో నటుడుగా తన రేంజ్ ఏంటో చెప్పకనే చెప్పాడు. మహదేవగా తారక్ పొన్నప్ప, లక్ష్మీగా మేఘా ఆకాశ్, మిగితా పాత్రల్లో కనిపించిన వారాంత ఉత్తమ నటనను ప్రదర్శించారు.

మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌కు ఏం రేంజ్ మ్యూజిక్ కావాలో ఆ స్థాయిలో అజయ్ అరసదా సంగీతాన్ని అందించాడు. సోషబ్ సిద్దిఖీ సినిమాటోగ్రఫి సిరీస్‌ను రిచ్‌గా మార్చింది. స్టోరీ ఎలిమెంట్స్‌కు తగినట్టుగా కలర్ టోన్ ఉపయోగించిన తీరుతొ సన్నివేశాలు మరింత రిచ్‌గా కనిపించాయి. ఎడిటింగ్ విభాగం పనితీరు బాగుంది. సీజీ వర్క్‌పై మరింత దృష్టిపెట్టాల్సి ఉండాల్సిందనిపిస్తుంది. రజనీ తాళ్లూరి నిర్మాతగా అనుసరించిన ప్రొడక్షన్ వ్యాల్యూస్ హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి.

Vikkatakavi Web Series Review and Rating in Telugu  Pradeep Maddali and Naresh Agastya impresses

దేశభక్తి, రూరల్ డ్రామా, మిస్టరీ, సస్పెన్స్, యాక్షన్ తదితర అంశాలను కలబోసి రూపొందించిన థ్రిల్లర్ మూవీ వికటకవి. ఈ మధ్యకాలంలో వచ్చిన వెబ్ సిరీస్‌లో ది బెస్ట్ అనే ఫీలింగ్ కల్పిస్తుంది. యాక్టర్ల పెర్ఫార్మెన్స్, టెక్నిషియన్స్ పనితీరు ఈ సినిమాను అత్యంత బలంగా మార్చాయి. తెలంగాణ డైలాగ్స్ పర్‌ఫెక్ట్ సింక్‌లో పేలాయి. కథాపరంగా, మేఘా ఆకాశ్ క్యారెక్టర్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండేదనిపిస్తుంది. ఓవరాల్‌గా నిరాశపరచకుండా.. మంచి అనుభూతిని కలిగిస్తుంది. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు తీరిక ఉన్న సమయంలో చూస్తూ చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. డోంట్ మిస్ ఇట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X