Vikram movie review కమల్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ నట విశ్వరూపం.. సూర్య గెస్ట్ రోల్ ఎలా ఉందంటే?
డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపే ఏజెంట్ విక్రమ్ ( కమల్ హాసన్) సస్పెన్షన్‌కు గురై అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోతాడు. భారీగా డ్రగ్స్‌తో కూడిన కంటైనర్ మిస్ కావడంతో దాని కోసం డ్రగ్ మాఫియా డాన్ సంతానం (విజయ్ సేతుపతి) వెతుకుతుంటాడు.
Recommended Video


విక్రమ్ కథ ఏమిటంటే
డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపే ఏజెంట్ విక్రమ్ ( కమల్ హాసన్) సస్పెన్షన్‌కు గురై అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోతాడు. భారీగా డ్రగ్స్‌తో కూడిన కంటైనర్ మిస్ కావడంతో దాని కోసం డ్రగ్ మాఫియా డాన్ సంతానం (విజయ్ సేతుపతి) వెతుకుతుంటాడు. డ్రగ్ లావాదేవీలను అరికట్టేందుకు అమర్ (ఫాహద్ ఫాజిల్) బ్లాక్ ఆపరేషన్ నిర్వహిస్తుంటాడు. అండర్ గ్రౌండ్‌కు వెళ్లిన విక్రమ్.. కర్ణన్ అనే పేరుతో తన కొడుకుకు కారణమైన వారిని చంపుతుంటాడు.

విక్రమ్ కథలో మలుపులు
ఏజెంట్ విక్రమ్ కొడుకు ఎలా హత్య చేయబడ్డాడు. విక్రమ్ కొడుకును ఎవరు చంపారు? మిస్ అయిన డ్రగ్స్ కంటైనర్ కోసం వెతుకులాటలో సంతానం ఎలాంటి క్రూరత్వం చూపాడు? మనవడి కోసం విక్రమ్ ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు? విక్రమ్, సంతానం మధ్య జరిగే పోరాటంలో అమర్ ఎలాంటి పాత్ర పోషించాడు అనే ప్రశ్నలకు సమాధానమే విక్రమ్ సినిమా కథ.

విక్రమ్ ఫస్టాఫ్ ఇలా..
విక్రమ్ ఫస్టాఫ్ గురించి చెప్పాల్సి వస్తే.. కమల్ హాసన్ ఎంట్రీ సీన్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉండటమే కాకుండా కథలోకి తీసుకెళ్లేందుకు తోడ్పాటునందించింది. ఇక విజయ్ సేతుపతి పాత్ర పరిచయం పవర్‌ఫుల్‌గా, భయానకంగా ఉంది. ఆ తర్వాత ఫాహద్ ఫాజిల్ పాత్ర ఎంట్రీ మరో హైలెట్. ఇంటర్వెల్‌లో కమల్ హాసన్‌కు సంబంధించిన ఓ సీన్ కథను మరో మలుపు తిప్పేలా చేస్తుంది. అయితే ఫస్టాఫ్‌లో కథ ఎక్కడా కనిపించకుండా కథనమే డామినేట్ చేయడం కొంత నిరాశను కలిగించే విషయంగా కనిపిస్తుంది.

సెకండాఫ్ పవర్ ఫ్యాక్ట్‌గా
ఫీల్ గుడ్ ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత అసలు కథ చెప్పడంతో విక్రమ్ సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతుంది. నా కొడుకును చంపిన వాళ్లను చంపడం నా లక్ష్యం కాదు.. డ్రగ్స్ లేని సమాజంలో నా మనవడిని చూడాలని అనుకొంటున్నాను అనే కమల్ చెప్పిన డైలాగ్‌తో అప్పటి వరకు సాగిన సినిమా స్వరూపం ఒక్కసారిగా మారిపోతుంది. ఇక యాక్షన్, థ్రిల్లింగ్, సెంటిమెంట్ ఎలిమెంట్స్‌తో కథ బలంగా కనిపిస్తుంది. చివర్ల సూర్య ఎంట్రీ సినిమాకు మరో హైలెట్. కథకు ప్రాధాన్యం ఇవ్వకుండా.. సీన్లను పేర్చుకొంటూ వెళ్లి చేసిన సరికొత్త ప్రయోగం విక్రమ్.

దర్శకుడు లోకేష్ గురించి
దర్శకుడు లోకేష్ కనకరాజ్ విషయానికి వస్తే.. డ్రగ్స్ నేపథ్యంగా నడిచే రెగ్యులర్ పాయింటే. కానీ స్టార్ వాల్యూ, మేకింగ్ స్టాండర్డ్స్ సినిమాను కొత్తగా మార్చాయి. హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌ల ప్రభావంతో లోకేష్ కనకరాజ్ రాసుకొన్న కథ, కథనాలు ఆసక్తికరంగా మారాయని చెప్పవచ్చు. విజయ్ సేతుపతి, కమల్ హాసన్, ఫాహద్ పాజిల్, సూర్య పాత్రలను కథలోకి జొప్పించిన విధానం, బలంగా ఆ పాత్రలను మలిచిన తీరు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారడమే కాకుండా లోకేష్ కనకరాజ్ ప్రతిభను మరోసారి బయటపెట్టాయి.

నటీనటుల ఫెర్ఫార్మెన్స్
కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ యాక్టింగ్, పెర్ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ స్క్రీన్ మీదకు కమల్ రావడంతో విక్రమ్ ఎలా ఉండబోతుందనే విషయం ఆసక్తిని పెంపొందించి. కచ్చితంగా కమల్, విజయ్ సేతుపతి, ఫాహద్ నట విశ్వరూపాన్ని మరోసారి రుచి చూపించారు. సూర్య అతిథి పాత్ర బ్రహ్మండంగా పేలింది. ఇతర నటీనటులు కూడా మెప్పించే విధంగా నటించారు.

టెక్నికల్ విభాగాల పనితీరు
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ ప్లస్ పాయింట్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో అదరగొట్టాడు. పాటలు పెద్దగా ఆకట్టుకొలేకపోయాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ విభాగాల పనితీరు బాగున్నాయి. ఫైట్స్ సీక్వెన్స్ కొత్తగా ఉంటాయి.

ఫైనల్‌గా ఎలా ఉందంటే
విక్రమ్ సినిమా గురించి చెప్పాలంటే.. రొటీన్ కథకు హాలీవుడ్ స్టైల్ స్క్రీన్ ప్లేను జోడించి చేసిన మ్యాజిక్ అని అనిపిస్తుంది. ఈ సినిమాకు స్టార్ వాల్యూ కొండంత బలంగా మారింది. సినిమా నిడివి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సాంకేతిక విభాగాల పనితీరు, నటీనటుల ప్రతిభ ఈ సినిమాను మరో రేంజ్‌కు చేర్చాయని చెప్పవచ్చు. తప్పకుండా విక్రమ్ సినిమా థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సినిమా. ఓ హాలీవుడ్ సినిమా స్థాయి యాక్షన్, ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తాయి. కాబట్టి ఓటీటీలో చూడటం కంటే.. థియేటర్‌లో చూస్తేనే మంచి ఎక్స్‌పీరియెన్స్ కలుగుతుంది.

బలం, బలహీనతలు
పాజిటివ్ పాయింట్స్
కమల్, విజయ్ సేతుపతి, ఫాహద్, సూర్య
టెక్నికల్ అంశాలు
అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్
సూర్య గెస్ట్ అప్పియరెన్స్
యాక్షన్ ఎపిసోడ్స్
నెగిటివ్ పాయింట్స్
సినిమా నిడివి
బలమైన కథ లేకపోవడం
రెగ్యులర్ ముగింపు


Click it and Unblock the Notifications











