Vimanam movie Review భావోద్వేగానికి గురిచేసే విమానం.. సముద్రఖని, అనసూయ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే

Rating: 3/5

న‌టీన‌టులు: స‌ముద్ర ఖ‌ని, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, మాస్ట‌ర్ ధృవ‌న్‌, మీరా జాస్మిన్, రాహుల్ రామ‌కృష్ణ‌, ధ‌న్‌రాజ్‌, రాజేంద్ర‌న్, తోటపల్లి మధు తదితరులు
నిర్మాతలు: నిమ్మకాయల ప్రసాద్, కిర‌ణ్ కొర్ర‌పాటి,
బ్యానర్స్: జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్‌
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: శివ ప్ర‌సాద్ యానాల‌
సినిమాటోగ్ర‌ఫీ: వివేక్ కాలేపు
ఎడిట‌ర్‌: మార్తాండ్ కె.వెంక‌టేష్‌
మ్యూజిక్‌: చ‌ర‌ణ్ అర్జున్‌
ఆర్ట్‌: జేజే మూర్తి
డైలాగ్స్‌: హ‌ను రావూరి (తెలుగు), ప్ర‌భాక‌ర్ (త‌మిళం)
లిరిక్స్ : స్నేహ‌న్‌(తమిళ్), చరణ్ అర్జున్ (తెలుగు)
పీఆర్వో: నాయుడు - ఫ‌ణి (బియాండ్ మీడియా) (తెలుగు), యువ‌రాజ్ (త‌మిళ్‌)
డిజిట‌ల్ ఏజెన్సీ: హ్యాష్ ట్యాగ్ మీడియా
రిలీజ్ డేట్: 2023-06-09

అంగవైకల్యంతోపాటు పేదరికంతో బాధపడుతూ సులభ్ కాంప్లెక్స్ నడుపుకొనే వీరయ్య (సముద్రఖని) కొడుకు రాజు (మాస్టర్ ధృవన్). తల్లి చిన్నతనంలోనే చనిపోవడంతో రాజును వీరయ్య అల్లారుముద్దుగా పెంచుతాడు. వీరయ్యకు తోడుగా అదే కాలనీలో ఆటో డ్రైవర్ (ధన్ రాజ్), చెప్పులుకుట్టే వృతి చేస్తే (రాహల్ రామకృష్ణ)‌తో సరదాగా జీవితాన్ని వీరయ్య, రాజు సాగిస్తుంటారు. ఊహ తెలిసినప్పటి నుంచి విమానాలంటే ఇష్టమే కాకుండా.. దానిలో ప్రయాణించాలనే కోరికతో రాజు ఉంటాడు. విమానం ఎక్కించమని తండ్రి వీరయ్యను రాజు పదే పదే కోరుతుంటాడు?

Vimanam movie Review

విమానం ఎక్కాలని రాజు ఎందుకు కోరిక కలిగింది? పేదరికంతో బాధపడే వీరయ్య తన కొడుకును విమానం ఎక్కించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు? జీవనాధారమైన సులబ్ కాంప్లెక్స్‌ను అధికారులు కూల్చివేస్తే వీరయ్య పోషణకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? ఉద్యోగం చేసే చోట వీరయ్య ఎలాంటి అవమానాలు, కష్టాలు అనుభవించాడు? కాలనీలో సుమతి (అనసూయ భరద్వాజ్) వేశ్యవృ‌త్తిని ఎందుకు కొనసాగించింది? సుమతిపై చర్మకారుడు (రాహుల్ రామకృష్ణ) ఎందుకు మనసు పడ్డాడు? సుమతి తనను వెంటాడే చర్మకారుడిని ప్రేమను అంగీకరించిందా? విమానం ఎక్కాలనే కోరికను వీరయ్య తీర్చాడా? వీరయ్య, రాజు జీవిత ప్రయాణం ఎలా సాగిందనే ప్రశ్నలకు సమాధానమే విమానం సినిమా కథ.

విమానం చిత్ర కథ తండ్రి, కొడుకుల మధ్య ఎమోషనల్ బాండింగ్‌తో భావోద్వేగంతో మొదలవుతుంది. ఫస్టాఫ్‌లో కథ కొంచెం నిదానంగా సాగిందనే ఫీల్ కలిగించినా.. సన్నివేశాల్లో దట్టించిన ఎమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుడిని కట్టిపడేసేలా దర్శకుడు శివ ప్రసాద్ రాసుకొన్న కథనం ఆకట్టుకొందని చెప్పవచ్చు. కొడుకు రాజుకు సంబంధించిన ఓ క్లిష్టమైన సమస్య కథను మరింత ఎమోషనల్‌గా మారుస్తుంది. అనసూయ, రాహుల్ రామకృష్ణ ఎపిసోడ్, ధన్ రాజ్ ఫ్యామిలీ సన్నివేశాలు సినిమాను వినోదంగాను.. కమర్షియల్‌గా మార్చే ప్రయత్నం చేసింది. ఫస్టాఫ్‌ కొంత స్లోగా సాగిందనిపించినప్పటికి.. మంచి ఫీల్‌ను మాత్రం నింపిందని చెప్పవచ్చు.

Vimanam movie Review

ఇక సెకండాఫ్‌లో వీరయ్యను వెంటాడే సమస్యలు మరీ సినిమాటిక్‌గా అనిపిస్తాయి. అయితే మళ్లీ ఎమోషనల్ డ్రైవ్ సినిమాను నడిపించడంతో అలాంటి లోపాలు కనిపించకుండా ఉంటాయి. రాహుల్ రామకృష్ణ అఫైర్ విషయంలో అనసూయ రియలైజ్ అయ్యే సీన్ సినిమాకు ఓ హైలెట్‌గా నిలుస్తుంది. ఇక చివరి 20 నిమిషాలు సినిమా ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేస్తుందనడంలో ఎలాంటి సందేహమే లేదు.

విమానం సినిమాలో నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. బాలనటుడు ధృవన్, విలక్షణ నటుడు సముద్రఖని ఒకరికొకరు పోటీపడి నటించారు. సముద్రఖని ఫెర్ఫార్మెన్స్‌ను మ్యాచ్ చేస్తూ ధృవన్ నటించిన తీరు ఆకట్టుకొనే అంశంగా మారింది. సముద్రఖని లేకపోతే ఈ సినిమాను ఊహించుకోవడం కష్టమనేంత రేంజ్‌లో ఆయన నటించారు. ధృవన్ మాస్టర్ క్లాస్ ఫెర్ఫార్మెన్స్‌తో మంచి ప్రశంసలతోపాటు మార్కులు కూడా కొట్టేస్తాడు. ఇక వేశ్య పాత్రలో అనసూయ ఒదిగిపోవడం అంటే చిన్నమాటే.. సహజసిద్దంగా ఆ పాత్రలో బిహేవ్ చేశారని చెప్పివచ్చు. రాహుల్ రామకృష్ణ, ధన్ రాజు తమ పాత్రల్లో ఒదిగిపోయారని చెప్పవచ్చు. సంధ్య జనక్, తోటపల్లి మధు తదితర పాత్రలు కూడా గుర్తుండిపోయేలా రాణించాయి.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. విమానం సినిమాకు మ్యూజిక్ బ్యాక్ బోన్‌గా నిలిచింది. మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ అందించిన ట్యూన్లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పెషల్ ఎట్రాక్షన్. పలు సన్నివేశాలను బీజీఎంతో ఫీల్‌గుడ్‌గా మార్చాడని చెప్పవచ్చు. ఇక వివేక్ అందించిన సినిమాటోగ్రఫి అదనపు ఆకర్షణ. ఈ సినిమాలో హను రావూరి అందించిన డైలాగ్స్ పలు సన్నివేశాలను మరింత హైలెట్ చేశాయి. ఆర్ట్ ఇతర విభాగాలు తమ వంతుగా సినిమాను అందంగా తీర్చిదిద్దాయి. నిమ్మకాయల ప్రసాద్, కిరణ్ కొర్రపాటి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

Vimanam movie Review

తండ్రి, కొడుకుల అనుబంధానికి ఎమోషనల్‌ కంటెంట్ జొప్పించిన చిత్రం విమానం. లవ్, సెంటిమెంట్, భావోద్వేగాలను ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా మారాయి. కథ, కథనాలు ఊహించినట్టే ఉంటాయి. స్క్రిప్టు పరంగా కొన్ని లోపాలు ఉన్నాయి. కానీ తండ్రి, కొడుకుల మధ్య ఎమోషనల్ బాండింగ్, ఇతర పాత్రల మధ్య ట్రావెల్ కథను మరింత ఎలివేట్ చేశాయి. చాలా సీన్లు హృదయాన్ని కదలించేలా ఉంటాయి. మరికొన్నిసార్లు కంటతడి పెట్టించేలా ఉంటాయి. మంచి ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో కూడిన కమర్షియల్ సినిమా ఇది. థియేట్రికల్‌గా మంచి అనుభూతిని పండించే కథ, కథనాలు ఉన్నాయి. థియేటర్‌కు వెళ్లి చూస్తే మంచి ఫీలింగ్‌తో బయటకు రావడం గ్యారెంటీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X