twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రఘువరన్ యావరేజ్ షో... (విఐపి-2 రివ్యూ)

    ‘విఐపి 2’ మూవీ యావరేజ్‌గా ఉంది. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు.

    By Bojja Kumar
    |

    Rating:
    2.0/5
    Star Cast: ధనుష్, కాజోల్, వివేక్, సముద్రఖని, రైజా విల్సన్
    Director: సౌందర్య ఆర్ అశ్విన్

    ధనుష్ హీరోగా వచ్చిన తమిళ చిత్రం 'విఐపి' తెలుగులో 'రఘువరన్ బిటెక్' పేరుతో విడుదలై భారీ విజయం అందుకుంది. ఇపుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'విఐపి 2' చిత్రం వచ్చింది. ఈ సారి ఈ ప్రాజెక్టును రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య హ్యాండిల్ చేశారు.

    ప్రముఖ బాలీవుడ్ నటి కాజోల్ ఈ చిత్రంలో ధనుష్ ప్రత్యర్థి పాత్రలో నటించడం విశేషం. తొలి భాగం హిట్ కావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ప్రేక్షకుల అంచనాలను ఈ సినిమా ఏ మేరకు అందుకుంది అనేది రివ్యూలో చూద్దాం.

    కథ ఏమిటంటే...

    కథ ఏమిటంటే...

    రఘువరన్(ధనుష్) అనితా కన్‌స్ట్రక్షన్స్‌లో ఇంజనీరుగా పని చేస్తుంటాడు. తన విఐపి గ్రూఫులోని ఇంజనీర్లతో కలిసి సొంతగా కన్‌స్ట్రక్షన్ కంపెనీ స్థాపించాలనేది అతడి గోల్. సౌతిండియాలో అతిపెద్ద కంపెనీ ‘వసుంధర కన్‌స్ట్రక్షన్స్ ఎండీ వసుంధర(కాజోల్)కు కాస్త తల పొగరు ఎక్కువే. తాను కోరుకున్నది సాధించడానికి ఎంతవరకైనా వెళ్లేరకం. రఘవరన్ టాలెంట్ తెలిసి తన కంపెనీలో పని చేయాల్సిందిగా ఆఫర్ లెటపర్ పంపిస్తుంది. రఘువరన్ దాన్ని తిరస్కరించడంతో వసుంధర ఇగో హర్టయి అతడిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. అతడు పని చేస్తున్న కంపెనీకి ఎలాంటి ప్రాజెక్టులు రాకుండా అడ్డకుంటుంది. తన వల్ల ఆ కంపెనీకి నష్టం రావడం ఇష్టం లేని రఘువరన్ రాజీనామా చేసి బయటకొస్తాడు. సొంత ఇల్లు తాకట్టుపెట్టి ‘విఐపి కన్‌స్ట్రక్షన్స్' కంపెనీ మొదలుపెడతాడు. ఈ క్రమంలో వసుంధర నుండి ఎదురైన అడ్డంకులను రఘువరన్ ఎలా అధిగమించాడు అనేది తర్వాతి కథ.

    Recommended Video

    Dhanush And Kajol Speech @ VIP 2 Team Press Meet
    పెర్ఫార్మెన్స్

    పెర్ఫార్మెన్స్

    పెర్ఫార్మెన్స్ పరంగా ధనుష్ అదరగొట్టాడు. రఘువరన్ పాత్రలో తనదైన యాటిట్యూడ్‌తో ప్రేక్షకులను మెప్పించాడు. బాలీవుడ్ నటి కాలోజ్ పొగరుబోతు వసుంధర పాత్రలో ధనుష్‌తో పోటీపడి నటించింది. రఘువరన్ భార్య పాత్రలో అమలా పాల్‌‌ ఓకే. ఆమె కొన్ని సీన్లకు మాత్రమే పరిమితం కావడంతో నటించడానికి స్కోపు లేకుండా పోయింది. సముద్రఖని, వివేక్ తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.

    టెక్నికల్ అంశాల పరంగా

    టెక్నికల్ అంశాల పరంగా

    సమీర్ థాహిర్ సినిమాటోగ్రఫీ ఫర్వా లేదు, మ్యూజిక్ యావరేజ్ గా ఉంది. డైలాగులు ఫర్వా లేదు. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది.

    కథ, కథనం

    కథ, కథనం

    సినిమా కథలో చెప్పుకోదగ్గ ఆసక్తికర అంశాలు ఏమీ లేవు. స్క్రీన్ ప్లే కూడా చాలా యావరేజ్‌గా సాగింది. మొదటి భాగం సినిమాతో పోలిస్తే స్టోరీ నేరేషన్లో ఇంటెన్షన్ తగ్గిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇది పూర్తిగా స్క్రిప్టు వైఫల్యం, దర్శకురాలు సౌందర్య వైఫల్యం అని చెప్పక తప్పదు.

    అవి మిస్సయినందు వల్లే

    అవి మిస్సయినందు వల్లే

    గతంలో వచ్చిన మొదటి భాగంలో..... కొన్ని సీన్లు, డైలాగులు రోమాలు నిక్కపొడిచేలా ఉండటం సినిమాకు హైలెట్ అయింది. అయితే ఇందులో ఆ మ్యాజిక్ మిస్సయింది. మొదటి భాగంలో అమ్మ సెంటిమెంట్ సినిమాకు ప్లస్ అయింది. రెండో భాగంలో ఆ అవకాశం లేకుండా పోయింది.

    ధనుష్-అమలా పాల్

    ధనుష్-అమలా పాల్

    తొలి భాగంలో ధనుష్-అమలా పాల్ ప్రేమికులుగా ఉన్నారు. వారి మధ్య వచ్చే లవ్ ట్రాక్ ప్రేక్షకులను బాగా ఎంటర్టెన్ చేసింది. అయితే ఇందులో ఇద్దరూ భార్యాభర్తలుగా కనిపించారు. తొలి భాగంలో వర్కౌట్ అయినట్లుగా రెండో భాగంలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు.

    కాజోల్ పాత్ర బలంగా లేదు

    కాజోల్ పాత్ర బలంగా లేదు

    హీరో ధనుష్ పాత్రకు పోటీగా కాజోల్ పాత్రను చూపించారు. అయితే కాజోల్ పాత్రలో అంత బలం కనిపించలేదు. రఘువరణ్ పాత్ర డామినేషన్ ఎక్కువ కావడంతో..... సినిమాలో వార్ వన్ సైడ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది.

    ప్లస్ పాయింట్స్

    ప్లస్ పాయింట్స్

    ధనుష్ పెర్ఫార్మెన్స్
    కాజోల్ పెర్ఫార్మెన్స్
    క్లైమాక్స్

    మైనస్ పాయింట్స్

    మైనస్ పాయింట్స్

    కొత్తదనం లేని కథ, ఆకట్టుకోలేని కథనం
    తొలి నుండి చివరి వరకు సినిమా లాగినట్లు ఉండటం
    మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్

    ఫైనల్ వర్డ్

    ఫైనల్ వర్డ్

    రఘువరన్ బీటెక్ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన వీఐపీ2 చిత్రం ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది. రఘువరన్ స్ఠాయికి తగినట్టుగా లేకపోవడం నిరాశ కలిగించే అంశం.

    English summary
    VIP 2 movie telugu review and rating. VIP2 was one of the most awaited movies of the year. The sequel to Velai Illa Pattadhaari, this film has Dhanush, Amala Paul, Samuthirakani and Vivekh reprising their roles in addition to Kajol making a comeback in Kollywood after almost two decades. Directed by Soundarya Rajinikanth and penned by Dhanush himself, the film is all about Raghuvaran and how he deals with unemployment. The plot then proceeds to build around Raghuvaran’s company and him locking horns with corporate honcho of sorts, Vasundhara. All of this was already known before.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X