VIraaji Review and Rating: విరాజి మూవీ రివ్యూ అండ్ రేటింగ్
మూవీ: విరాజి
నటీనటులు: వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరాం, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, కుశాలిని పూలప, ప్రసాద్ బెహరా తదితరులు
దర్శకత్వం: అదిత్యనాథ్ హర్ష
నిర్మాత: మహేంద్రనాథ్ కొండ్ల
మ్యూజిక్: ఎబెనైజర్ పాల్
సినిమాటోగ్రఫి: జీవీ అజయ్ కుమార్
ఎడిటర్: రాము తుము
బ్యానర్: M3 మీడియా, మహా మూవీస్
రిలీజ్ డేట్: 2024-08-02
వైజాగ్ నగర శివారులోని గోంగూర హోటల్‌లో ఈవెంట్‌కు ఫ్రీ కూపన్స్ ద్వారా సీఐ ప్రభాకర్
(బలగం జయరామ్ ), గైనకాలజిస్టు సుధా( ప్రమోదీని), స్టాండ్ అప్ కమెడియన్ వేద( కుశాలిని), సినిమా నిర్మాత కోదండరాం(కాకినాడ నాని), సెలబ్రిటీ ఆస్ట్రాలజిస్ట్ రామకృష్ణ( రఘు కారుమంచి), ఫోటోగ్రాఫర్ కాన్సెప్ట్ రాజు( రవితేజ నన్నిమాల)ను ఆహ్వానిస్తారు. అయితే శివ భక్తుడు, నృత్యకారుడు ఆండీ (వరుణ్ సందేశ్) డ్రగ్స్ తీసుకొంటూ అక్కడి వచ్చి గందరగోళం సృష్టిస్తాడు. అయితే ఉన్నట్టుండి అక్కడికి వచ్చిన వాళ్లు మృత్యువాత పడుతుంటారు.

గోంగూర హోటల్‌కు అందర్ని ఎవరు ఆహ్వానించారు. గోంగూర హోటల్ అని చెప్పి పిచ్చాసుపత్రికి ఎందుకు రప్పించారు? అక్కడికి వచ్చిన వారందరూ ఎందుకు చనిపోతుంటారు? గైనకాలజిస్ట్ సుధాకు వచ్చిన కష్టం ఏమిటి? అండీ అక్కడికి ఎందుకు వచ్చాడు? పాడుబడ్డ పిచ్చాసుపత్రిలో చావులకు కారణం ఏమిటి? ఈవెంట్‌కు వచ్చిన ప్రముఖులకు వచ్చిన సమస్యను ఆండీ ఎలా పరిష్కరించారు అనే ప్రశ్నలకు సమాధానమే విరాజి సినిమా కథ.
హోటల్‌లో ఈవెంట్‌కు అందర్నీ ఆహ్వానించి.. అందులోకి చేరిన తర్వాత క్రియేట్ చేసిన హారర్ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్‌ను దర్శకుడు అదిత్యనాథ్ హర్ష క్రియేట్ చేసిన విధానం బాగుండటమే కాకుండా కథలో కనెక్ట్ కావడానికి అవకాశం ఏర్పడింది. అలాగే సస్పెన్స్ ఎలిమెంట్స్ ద్వారా కథను నడిపిని విధానం ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ క్రియేట్ చేసేలా ఉంటుంది.
ఇక సెకండాఫ్‌లో ప్రీ క్లైమాక్స్‌లోని ట్విస్టు సినిమాలోని సన్నివేశాల్లో భావోద్వేగ వాతావరణాన్ని క్రియేట్ చేయడం ఈ సినిమాకు ప్లస్‌గానే కాకుండా బలంగా కూడా మారిందని చెప్పవచ్చు. సీఐ ప్రభాకర్ చుట్టూ తిరిగే కథలో గైనకాలజిస్టు సుధా ఎమోషనల్ రోల్ సినిమా మూడ్‌ను మార్చేలా చేస్తుంది.
స్టోరీని ముందుకు తీసుకెళ్లడంలో అండీ పాత్ర ద్వారా వరుణ్ సందేశ్ టాస్క్ మాస్టర్‌గా వ్యవహరించి ఓ డిఫరెంట్ రోల్‌లో ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. వరుణ్ సందేశ్ గెటప్, బాడీ లాంగ్వేజ్ బాగుంది. సెలబ్రిటీ జ్యోతిష్కుడుగా వేణు స్వామిని పోలీన పాత్రలో రఘు కారుమంచి మంచి కామెడీని పండించారు. మిగితా పాత్రల్లో నటించిన వారందరూ కూడా ఫర్వాలేదనిపించారు.
వాస్తవ సంఘటనల ఆధారంగా సొసైటీలో అక్రమార్కుల కోణంలో దర్శకుడు ఆదిత్యనాథ్ హర్ష రాసుకొన్న కథ ఎమోషనల్‌గా ఉంది. చిన్న నటులతో కూడా మంచి పెర్ఫార్మెన్స్‌ను రాబట్టుకొన్న తీరు ఈ సినిమాకు బలంగా మారింది. మ్యూజిక్, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ విభాగం పనితీరు బాగుంది. విభిన్నమైన సినిమాలను అంధించాలనే తాపత్రయం ఉన్న నిర్మాత మహేంద్రనాథ్ కొండ్ల అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాను రిచ్‌గా అందించడంలో ఉన్నత ప్రమాణాలు పాటించారని చెప్పవచ్చు.
దేశవ్యాప్తంగా ఇసుక మాఫియా ద్వారా జరిగిన నేరాలు, ఘోరాలు సంఘటనలను ఆధారంగా చేసుకొని రాసుకొన్న క్రైమ్ థ్రిల్లర్ విరాజి. కథను చెప్పడానికి దర్శకుడు అనసరించిన తీరు, నటీనటుల ఫెర్ఫార్మెన్స్ సినిమా ప్లస్ పాయింట్స్. ఎమోషనల్‌గా ఇంకా స్కోప్ ఉన్నప్పటికీ.. నిడివిని చాలా చిన్నగా రూపొందించడం వల్ల పూర్తిగా భావోద్వేగాలు పండలేదనే ఫీలింగ్ కలుగుతుంది. కథను ఇంకాస్త విస్తరించి.. మాఫియా సంఘటనలను ఇంకాస్త తెర మీద విస్తరించి ఉంటే డెఫినెట్ మంచి థ్రిలర్ మూవీ అయి ఉండేదనిపిస్తుంది. వాస్తవ సంఘటనలు ఆధారంగా రూపొందే సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











