Virgin Boys Movie Review: వర్జిన్ బాయ్స్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.5/5

నటీనటులు: కౌశల్ మందా, గీతానంద్, మిత్రా శర్మ, శ్రీహన్, రోనీత్ రెడ్డి, జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్, అన్షులా ధావన్, శ్వేతా తివారీ, సుజిత్ కుమార్, బబ్లు, అభిలాష్ తదితరులు
దర్శకత్వం: దయానంద్
నిర్మాత: రాజా దారపునేని
మ్యూజిక్ డైరెక్టర్: స్మరణ్ సాయి
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
సినిమాటోగ్రఫి : వెంకట ప్రసాద్
లిరిక్స్- పూర్ణ చారి
సింగర్ - ఆదిత్య ఆర్ కె
బ్యానర్: రాజ్ గురు ఫిలిమ్స్
రిలీజ్ డేట్: 2025-07-11

ఆర్య (గీతానంద్), రోని (రోనిత్ రెడ్డి), డూండీ (శ్రీహాన్) డికిన్‌సన్ కాలేజీలో చేరుతారు. ఆ కాలేజీలో దాదాపు స్టూడెంట్స్ అందరికి గర్ల్‌ఫ్రెండ్స్ ఉంటారు. కానీ ఈ ముగ్గురికి ఎవరూ తోడు ఉండరు. ఆ సమయంలో కాలేజీలోకి సరయు (మిత్రా శర్మ) అడుగుపెడుతుంది. తొలి చూపులోనే ఆర్య ఆమెను ప్రేమించేస్తాడు. రోని, డూండీ తమ కాలేజీలోని శ్లోక, లైలా (జెన్నీఫర్, అన్షులా ధావన్)ను లవ్ చేస్తుంటారు. ( అయితే ఈ ముగ్గురు పెళ్లికి ముందే తమ బ్రహ్మచర్యాన్ని (వర్జినిటీ)ని కోల్పోవాలనే ప్రయత్నంలో ఉంటారు. ఆ సమయంలో తమ సీనియర్ (కౌశల్ మందా) వర్జినిటీ కోల్పోయేందుకు ఓ ఛాలెంజ్ విసురుతాడు. ఆ పరిస్థితుల్లో ఆర్య, సరయు మధ్య విభేదాలు చోటుచేసుకొంటాయి. ఈ క్రమంలో ముగ్గురికి ఓ ప్రేమ పరీక్ష ఎదురవుతుంది.

Virgin Boys Movie Review

ఆర్య, రోని, డూండీ ఎలాగైనా పెళ్లికి ముందే వర్జినిటీ కోల్పోవాలని ఎందుకు నిర్ణయం తీసుకొంటారు? ఈ ముగ్గురు తమ తోడు కోసం ఎలా వేట సాగించారు? ఈ ముగ్గురి తమ ప్రేమను ఎలా వ్యక్తపరిచి తమ ప్రియురాళ్లకు చేరువ అయ్యారు? ఆర్య, సరయు మధ్య గొడవకు కారణమేమిటి? వారిద్దరూ చివరకు కలుసుకోవడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి? ఈ ముగ్గురు పెళ్లికి ముందే బ్రహ్మచర్యాన్ని పోగొట్టుకొన్నారా? తమ ప్రేమను ఎలా నిలబెట్టుకొన్నారు? ఈ మూడు జంటల మధ్య ప్రేమ విషయంలో ఎలాంటి సమన్వయం కుదిరింది? ప్రేమ, పెళ్లి, వర్జినిటీ గురించి వారు చివరకు తెలుసుకొన్నదేమిటి? అనేది వర్జిన్ బాయ్స్ సినిమా కథ.

నేటి యువతరం పోకడలు, అలవాట్లు, అభిరుచులను దృష్టిలో పెట్టుకొని ప్రేమ, పెళ్లి, వర్జినిటీ అనే అంశాలను జోడించి దర్శకుడు దయానంద్ రాసుకొన్న పాయింట్ బాగుంది. ఆ పాయింట్‌ను ఎంటర్‌టైనింగ్‌గా చెప్పేందుకు రాసుకొన్న సన్నివేశాలు కొన్ని చాలా బాగున్నాయి. మరికొన్ని తేలిపోయాయి. అయితే కొత్త నటీనటులతో పెర్ఫార్మెన్స్ రాబట్టుకొన్న తీరు చూస్తే అతడి సత్తా ఏమిటో తెలుస్తుంది. ఫస్టాఫ్‌ను పక్కా యూత్‌ఫుల్‌గా, ఎంటర్‌‌టైన్‌మెంట్‌‌గా చెప్పేసి.. సెకండాఫ్‌లో ఎమోషనల్ డ్రామాను, అలాగే ఫ్యామిలీ ఆడియెన్స్ కావాల్సిన కంటెంట్‌ను జొప్పించి సినిమాను బ్యాలెన్స్ చేసేందుకు ప్రయత్నించారనిపిస్తుంది. ఓవరాల్‌గా ప్రజెంట్ జనరేషన్ ఆలోచనా విధానానికి అద్దం పట్టేలా సినిమాను రూపొందించారు.

దర్శక, నిర్మాతల విజన్‌ను దృష్టిలో పెట్టుకొని నటీనటులంతా తమ వంతుగా, తమ పరిధిలో మంచి పెర్ఫార్మెన్స్ చేశారు. గీతానంద్‌కు హీరోగా నటించిన అనుభవం ఉండటంతో తనదైన శైలిలో ఫన్, ఎమోషనల్ డ్రామాను బాగా పడించారు. నటనకు కొత్తవారైనా రోనిత్, శ్రీహాన్ తమ పాత్రల స్వభావాన్ని అర్ధం చేసుకొని ఆ పాత్ర పరిధి మేరకు చక్కగా బిహేవ్ చేశారు. ఎక్కడా కొత్తవారనే బెరుకు, తొణుకు లేకుండా నటించారు. ఈ సినిమాలోని హీరోయిన్ రోల్ సరయు పాత్ర చాలా డిగ్నిఫైడ్ క్యారెక్టర్. ఆ పాత్రకు మిత్రా శర్మ న్యాయం చేశారు. కేవలం గ్లామరపరంగానే కాకుండా పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్, అన్షులా ధావన్, శ్వేతా తివారీ తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఈ సినిమాకు మ్యూజిక్, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ ప్లస్ పాయింట్స్. కథ డిమాండ్ చేసినంత మేరకు బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో స్మరణ్ సాయి ఆకట్టుకొన్నాడు. సినిమాటోగ్రాఫర్ వెంకట ప్రసాద్‌ యూత్ ఫుల్ డ్రామాకు అవసరమైన మూడ్‌ను సన్నివేశాల్లో పక్కాగా క్రియేట్ చేశాడు. మార్తాండ్ కె వెంకటేష్ తన అనుభవాన్నంతా రంగరించి ఈ సినిమా చకచకా పరుగులు పెట్టించారు. రాజా దారపునేని ఈ సినిమాను నిర్మించడమే కాకుండా ప్రమోషన్స్ భారాన్ని తన భుజాలపై మోసి మూవీకి మంచి బజ్ క్రియేట్ చేశాడు. సినిమాపరంగా మంచి నిర్మాణ విలువలు పాటించారు. మూవీని నిర్మించిన విధానం చూస్తే.. సినిమాపై ఆయనకు ఉండే అభిరుచి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

ఓవరాల్‌గా మూవీ గురించి చెప్పాలంటే?... పెళ్లికి ముందు వర్జినిటీ ముఖ్యమా? లేదా జీవితాంతం కలిసి బతికేందుకు ప్రేమ ప్రధానమా? అనే బేసిక్ పాయింట్‌తో యూత్‌ఫుల్ ఎలిమెంట్స్, స్టూడెంట్స్ ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా అంశాలను కలిపి రూపొందించిన సినిమా వర్జిన్ బాయ్స్. టైటిల్‌లోనే తమ సినిమా కంటెంట్ ఏమిటో నిజాయితీగా చెప్పారు. కాబట్టి ఈ సినిమాలోని కంటెంట్ గురించి పెద్దగా ప్రస్తావించనక్కర్లేదు. కానీ సెకండాఫ్‌లో రాధాకృష్ణుల డ్రామా, ఆ తర్వాత వచ్చే ఫ్యామిలీ సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. స్క్రిప్టు పరంగా చాలా లోపాలు ఉన్నప్పటికీ.. ఎంటర్‌టైన్‌మెంట్ జొప్పించడం, నటీనటుల ఫెర్ఫార్మెన్స్ కారణంగా అవి బయటకు కనిపించకుండా ఉండేలా చేశాయి. ఫన్‌తో కూడిన యూత్ డ్రామాను చూడాలనుకొనే వారు ఈ సినిమా ఓసారి థియేటర్‌లో చూడొచ్చు. ఎక్కువగా ఆశించి.. అంచనాలు లేకుండా వెళితే.. నిరాశ పడకుండా ఉంటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X