Virgin Story movie review ఆకట్టుకొనే టీనేజ్ లవ్ స్టోరి!
నటీనటులు: విక్రమ్ సహిదేవ్, సౌమిక పాండియన్, రిషిక ఖన్నా, వినీత్ బవిశెట్టి తదితరులు
సంగీతం: అచు రాజమణి,
సినిమాటోగ్రఫీ: అనీష్ తరుణ్ కుమార్,
ఎడిటర్: గ్యారీ బీ హెచ్
సాహిత్యం: భాస్కర భట్ల, అనంత్ శ్రీరామ్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాఘవేంద్ర,
నిర్మాతలు: లగడపాటి శిరీష శ్రీధర్,
రచన, దర్శకత్వం: ప్రదీప్ బి అట్లూరి
ప్రియాంషి (సౌమికా పాండ్యన్) అనే గొప్పింటి అమ్మాయికి తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ జరుగుతుంది. తన బాయ్‌ఫ్రెండ్ చేసిన మోసానికి ప్రతీకారం తీర్చుకొనే క్రమంలో ఓ పబ్‌లో కనిపించిన విక్రమ్ (విక్రమ్ సహిదేవ్)కు క్లోజ్ అవుతుంది. అయితే వారిద్దరు శారీరకంగా కలిసి తొలి అనుభవంలోని అనుభూతిని పొందాలనుకొంటారు.
ప్రియాంషికి తన బాయ్‌ఫ్రెండ్ ఎలాంటి మోసం చేశాడు? తన బాయ్‌ఫ్రెండ్‌కు బుద్ది చెప్పడానికి ప్రియాంషి ఏం ప్లాన్ వేసింది? విక్రమ్‌నే ప్రియాంషి ఎందుకు ఎంచుకొన్నది? తొలిరాత్రి అనుభవాన్ని తీర్చుకొనే క్రమంలో వారికి ఎదురైన సమస్యలు ఏమిటి? సెక్స్‌ను ఎంజాయ్ చేయాలని అనుకొన్న విక్రమ్, ప్రియాంషిల లక్ష్యం నెరవేరిందా అనే ప్రశ్నలకు సమాధానమే వర్జిన్ స్టోరి సినిమా.

వర్జిన్ స్టోరి పక్కా టీనేజ్ లవ్ స్టోరి. ఇప్పటి వరకు అడల్డ్ లవ్ స్టోరిలను చూసి బోరెత్తిన వారికి వర్జిన్ స్టోరి కొత్తగా అనిపిస్తుంది. తొలి అనుభవాన్ని చవి చూడాలనుకొన్న ఒక అమ్మాయి, అబ్బాయికి మధ్య ఒక రాత్రి జరిగిన కథ ఇది. ఇప్పటి వరకు వచ్చిన ప్రేమ కథలు వేరు.. వర్జిన్ స్టోరి లవ్ స్టోరి డిఫరెంట్. కాలేజీ స్టూడెంట్స్‌కే కాకుండా యూత్, ఫ్యామిలీకి నచ్చే విధంగా కనిపిస్తుంది. టీనేజ్ లవ్ స్టోరి అంటే లిప్‌లాక్స్, మితి మీరిన శృంగారం కనిపిస్తాయి. అలాంటి అంశాలు లేకుండా క్లీన్ కామెడీతో ఆసక్తికరంగా సాగుతుంది. సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు అనవసరంగా జొప్పించారనే ఫిలింగ్ కలుగుతుంది. కథ మంచి జోష్‌తో సాగుతున్న సమయంలో కొన్ని సీన్లు అడ్డం పడినట్టు అనిపిస్తాయి. సెకండాఫ్‌లో ఓ పది, పదిహేను నిమిషాలు ట్రిమ్ చేస్తే సినిమా ఫీల్‌గుడ్‌గా మారే అవకాశం ఉండేది.
వర్జిన్ స్టోరి విషయంలో దర్శకుడు ప్రదీప్ బీ అట్లూరి ఎంచుకొన్న పాయింట్ చాలా బాగుంది. ఈ పాయింట్‌ను తెర మీద తొలి భాగం వరకు అద్భుతంగా ఎక్స్‌ప్లోర్ చేశాడు. పబ్ కల్చర్, ప్రస్తుతం టీనేజ్ యువత పోకడలను కళ్లకు కట్టినట్టు చూపించాడు. అయితే అదే ఊపును సెకండాఫ్‌లో కొనసాగించలేకపోయాడు. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ విషయంలో దర్శకుడి తడబాటు కనిపిస్తుంది. సెకండాఫ్‌పై మరింత దృష్టిపెట్టి ఉంటే డెఫినెట్‌గా టీనేజ్ లవ్ స్టోరీలకు ట్రెండ్ సెట్టర్‌గా అయి ఉండేది.
దిల్ రాజు నిర్మించిన రౌడీ బాయ్స్ సినిమాలో నెగిటివ్ షేడ్స్‌తో ఆకట్టుకొన్న విక్రమ్ వర్జిన్ స్టోరి సినిమాలో డిగ్రీ ఫెయిల్ అయి గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేసే పాత్రలో కనిపించాడు. సినిమాను సొంతంగా భుజాల మీద మోయడమే కాకుండా ఫెర్ఫార్మెన్స్ పరంగా మెచ్యురిటీని ప్రదర్శించాడు. కీలక సన్నివేశాల్లో మంచి ఎమోషన్స్ పలికించాడు. సరైన కథ పడితే.. సత్తా చాటే అవకాశం ఉందనే సంకేతాలిచ్చాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన సౌమికా పాండ్యన్ విక్రమ్‌తో పోటీపడి నటించింది. రొమాంటిక్ సీన్లలో మంచి ఎమోషన్స్ పలికించింది. మిగితా నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు ఫర్వాలేదనిపించాడు. బిగ్‌బాస్ ఫేమ్ జస్వంత్ పడాల పాత్ర చిన్నదైన ఆకట్టుకొన్నాడు.
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. వర్జిన్ స్టోరి సినిమాకు సినిమాటోగ్రఫి స్పెషల్ ఎట్రాక్షన్. పబ్ సీన్లు కానీ, నైట్ ఎఫెక్ట్ సన్నివేశాల చిత్రీకరణ బాగుంది. కథకు తగినట్టుగా ఎంచుకొన్న కలర్ ప్యాలెట్ బాగుండటమే కాకుండా స్క్రీన్ ఆహ్లదకరంగా మార్చింది. అందుకు అనిష్ తరుణ్ కుమార్ ప్రతిభ అద్దం పట్టింది. అచు రాజమణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటర్ గ్యారీ బీహెచ్‌కు ఇంకా చాలానే పని ఉంది. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్‌కు తగినట్టుగా నిర్మాణ విలువలు ఉన్నాయి. నిర్మాతగా లగడపాటి శిరీష శ్రీధర్ అనుసరించిన విలువలు బాగున్నాయి.
ప్రస్తుతం సమాజంలో టీనేజ్‌లో ఉండే యువతీ, యువకుల పోకడ, సంస్కృతి, ఎమోషన్స్‌కు అద్దంపటేలా రూపొందిన చిత్రం వర్జిన్ స్టోరి. వర్జిన్ అంటే శారీరానికి సంబంధించినది కాదు. మనసు, హృదయానికి సంబంధించిన స్వచ్ఛత అనే కోణంలో ఆసక్తికరంగా తెరకెక్కించారు. సెకండాఫ్‌లో కొంత సాగదీసినట్టు అనిపిస్తుంది. కొత్తరకం లవ్ స్టోరిలను ఆదరించే ప్రేక్షకులకు తప్పకుండా వర్జిన్ స్టోరి నచ్చుతుంది. థియేట్రికల్ ఎక్సీపిరియెన్స్ ఫీల్‌గుడ్‌గా ఉంటుంది. లెట్స్ గో ఫర్ రొమాంటిక్ రైడ్ ఆన్ సిల్వర్ స్క్రీన్.


Click it and Unblock the Notifications











