Virupaksha Review బొమ్మాళి రేంజ్‌లో సంయుక్త మీనన్.. ట్విస్టుల, థ్రిల్లింగ్‌తో విరూపాక్ష
నటీనటులు: సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్, సునీల్, సాయిచంద్, అభినవ్ గోమటం తదితరులు
సమర్పణ: బాపినీడు.బి
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
దర్శకత్వం: కార్తీక్ దండు
స్క్రీన్ ప్లే: సుకుమార్
సినిమాటోగ్రాఫర్ : శ్యామ్‌దత్ సైనుద్దీన్
మ్యూజిక్ డైరెక్టర్: బీ అజనీష్ లోక్‌నాథ్
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగల
క్రియేటివ్ ప్రొడ్యూసర్: సతీష్ బి.కె.ఆర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ బండ్రెడ్డి
బ్యానర్స్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్
పీఆర్వో: వంశీ కాకా,మడూరి మధు
విరూపాక్ష కథ:రుద్రవనం అనే గ్రామంలో చేతబడి చేస్తున్నారనే కారణంతో తాంత్రిక విద్యలు తెలిసిన వైద్యుడు వెంకటాచలం కుటుంబాన్ని గ్రామస్థులు సజీవ దహనానికి పాల్పడుతారు. అయితే సజీవ దహనం సమయంలో పుష్కరకాలం తర్వాత మీ ఊరు సర్వనాశనమవుతుందని వెంకటాచలం భార్య శపిస్తుంది. సరిగ్గా పన్నెండేళ్ల తర్వాత రుద్రవనం గ్రామానికి వచ్చిన సూర్య (సాయిధరమ్ తేజ్) నందిని (సంయుక్తా మీనన్)ను చూసి ప్రేమలో పడిపోతాడు. అయితే అదే సమయంలో ఆ గ్రామంలో నిర్వహించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అమ్మవారి గుడిలో గ్రామస్థుడు రక్తం కక్కుకుని చస్తాడు. అయితే జాతర సమయంలో ఏర్పడిన విఘాతంతో ఊరిని అష్టదిగ్బంధం చేస్తారు. అష్ట దిగ్బంధం సమయంలో సుధ (సోనియా) గ్రామం దాటి వెళ్తుంది. దాని వల్ల నందిని ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. దాంతో నందిని దక్కించుకోవడానికి సూర్య సిద్దమవుతాడు.

విరూపాక్షలో ట్విస్టులు:రుద్రవనం గ్రామానికి సూర్య తన కుటుంబంతో ఎందుకు వచ్చాడు? రుద్రవనంలో సూర్య పిన్ని (యాంకర్ శ్యామల), పాల వ్యాపారి, సుధ ఆకస్మిక మరణాలకు కారణం ఏమిటి? నందినికి ఉన్న మూర్ఛవ్యాధికి కారణం ఏమిటి? అష్ట దిగ్బంధం తర్వాత గ్రామంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రామస్థుల ప్రాణాలకు ముప్పు ఏర్పడిన సమయంలో సూర్య చేసిన ప్రయత్నాలు ఏమిటి? గ్రామస్థులను ఎలా సూర్య ఎలా రక్షించాడు. తన ప్రేయసి నందిని ప్రాణాలను కాపాడుకొని సూర్య తన ప్రేమను సఫలం చేసుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే విరూపాక్ష సినిమా కథ.
విరూపాక్ష ఫస్టాఫ్ ఎనాలిసిస్:విరూపాక్ష సినిమా ఒక హై ఎమోషనల్ సీన్‌తో అత్యంత ఆసక్తికరంగా మొదలవుతుంది. రుద్రవనం గ్రామంలో జరిగే సంఘటనలు, సన్నివేశాలు ఒళ్లు జలదరించేలా ఉంటాయి. దర్శకుడు కార్తీక్ దండు రాసుకొన్న కథ, దానికి సరిపడే కథనాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేలా ఉన్నాయి. ఆద్యంతం ట్విస్టులను రివీల్ చేస్తే స్టోరిని ఒక రేంజ్‌కు తీసుకెళ్లడంలో కార్తీక్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్‌లో ఆకస్మిక మరణాలు చాలా థ్రిల్లింగ్‌గా ఉంటాయి. రొటీన్ సీన్లు కాకుండా సన్నివేశాలను కొత్త రాసుకోవడం, ప్రేక్షకుడి ఊహకు అందకుండా సన్నివేశాలను డిజైన్ చేసిన తీరు ఫస్టాఫ్‌ను టాప్ గేర్‌లో సాగేలా చేసింది.

విరూపాక్ష సెకండాఫ్ ఎలా ఉందంటే?:ఇక ఫస్టాఫ్‌లోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సెకండాఫ్ ఏమౌతుందోననే ఉత్కంఠకు తగినట్టుగానే దర్శకుడు కార్తీక్ కథను మంచి ఫీల్‌తో కొనసాగించాడు. ఫ్యాష్ బ్యాక్ ఎపిసోడ్స్ మంచి భావోద్వేగానికి గురి చేస్తాయి. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు కథకు మరింత బలంగా మారిందని చెప్పవచ్చు. సెకండాఫ్‌లో సంయుక్త మీనన్ క్యారెక్టర్ సినిమాను మరో రేంజ్‌లోకి తీసుకెళ్లిందని చెప్పవచ్చు. కథను ట్రాక్ తప్పకుండా సూర్య క్యారెక్టర్‌ను డీల్ చేసిన విధానం బాగుంది. సెకండాఫ్ కొంత సాగదీసినట్టు అనిపించిన కథ డిమాండ్ మేరకు తప్పలేదనిపిస్తుంది.
డైరెక్టర్ మేకింగ్, టేకింగ్:దర్శకుడు కార్తీక్ దండుకు తొలి సినిమా అయినప్పటీకీ.. ఎక్కడ కొత్త దర్శకుడనే ఫీలింగ్ కలుగనివ్వలేదని చెప్పవచ్చు. క్యారెక్టర్లను డీల్ చేసిన విధానం.. కథను ఆద్యంతం రక్తి కట్టించేలా ప్లాన్ చేసుకొన్న విధానం ఈ సినిమాకు అత్యంత బలంగా మారింది. ఇక సుకుమార్ డిజైన్ చేసిన స్క్రీన్ ప్లే మూవీకి మరో స్పెషల్ ఎట్రాక్షన్. స్క్రీన్ ప్లే సినిమా ఫ్లేవర్‌ను మార్చేసిందని చెప్పవచ్చు. టేకింగ్‌లో పర్‌ఫెక్షన్‌తో ప్రేక్షకుడికి ప్రతీ క్షణం కొత్త అనుభూతిని పంచడంలో కార్తీక్ సక్సెస్ అయ్యాడు.

సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ గురించి:సూర్య క్యారెక్టర్‌లో సాయిధరమ్ తేజ్ మెచ్యుర్డ్ ఫెర్ఫార్మెన్స్‌ను చూపించారు. కమర్షియల్ హంగులకు ఎక్కడ తావివ్వకుండా కథను ముందుకు తీసుకెళ్లే పాత్రలో ఒదిగిపోయాడు. కొన్ని సన్నివేశాల్లో భావోద్వేగమైన నటనను ప్రదర్శించారు. ఇక సంయుక్త మీనన్ ఈ సినిమాకు వన్ ఉమెన్ షో అని చెప్పవచ్చు. అరుంధతి సినిమాలో అనుష్క రేంజ్‌లో ఫెర్ఫార్మ్ చేశారని చెప్పవచ్చు. సినిమాకు వెన్నెముకగా లాంటి నందిని పాత్రను అద్బుతంగా పోషించింది. ఈ సినిమా విషయంలో ప్రేక్షకులకు సంయుక్త మీనన్ రోల్ స్పెషల్ సర్‌ప్రైజ్ అని చెప్పవచ్చు. ఈ సినిమాతో సంయుక్త మీనన్ తన రేంజ్ మరింత పెంచుకోనేంతగా నటించారు.
మిగితా పాత్రల్లో:మిగితా పాత్రల విషయానికి వస్తే.. సాయిచంద్, సోనియా, సునీల్, యాంకర్ శ్యామల కథకు బలంగా నిలిచే పాత్రల్లో కనిపించారు. యాంకర్ శ్యామల మంచి ఫీల్ గుడ్ పాత్రలో కనిపించారు. సునీల్ బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకొంటుంది. ఇంటెన్సిటీ ఉన్న పాత్రలో సాయిచంద్ మెరిసారు. కథకు చాలా ఇంపార్టెంట్ అయిన పాత్రకు సోనియా న్యాయం చేసింది. అభినవ్ గోమటం, రాజీవ్ కనకాల తమ పాత్రల పరిధి మేరకు రాణించారు.

టెక్నికల్‌గా ఎలా ఉందంటే?:సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. విరూపాక్షకు సౌండ్ ఎలిమెంట్ ఫుల్ ఎనర్జీని ఇస్తుంది్. ప్రేక్షకుడిని కథలో లీనమయ్యేలా బీజీఎంను అజనీష్ లోక్‌నాథ్ మ్యాజిక్ చేశారనే చెప్పాలి. కాంతార తర్వాత మరో విరూపాక్షకు తన మ్యూజిక్‌తో ప్రాణం పోశారు. ఇక మ్యూజిక్ తర్వాత సినిమాను అద్బుతంగా మలచడంలో ఎడిటర్ ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సన్నివేశాలను పేర్చిన విధానం, కథను నడించిన తీరు విషయంలో నవీన్ నూలీ వర్క్ సూపర్బ్‌గా ఉంది. సినిమాటోగ్రఫి, ఇతర విభాగాలు మంచి పనితీరును ప్రదర్శించాయి.
విరూపాక్ష ఫైనల్‌గా ఎలా ఉందంటే?:విరూపాక్ష థ్రిల్లింగ్, ఎమోషనల్, టెక్నికల్ అంశాలతో మంచి అనుభూతిని పంచే మిస్టికల్ థ్రిల్లర్. పాత్రలు, కథలోని ట్విస్టులు, సస్పెన్స్ ఎలిమెంట్స్, స్క్రీన్ ప్లే ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. లాజికులు వెతకుండా సినిమాను ఆస్వాదిస్తే మంచి ఫీలింగ్‌ను కలిగిస్తుంది. కార్తీక్ దండు డైరెక్షన్, సుకుమార్ స్క్రీన్ ప్లే, సంయుక్త మీనన్ ఫెర్ఫార్మెన్స్, సాయిధరమ్ తేజ్ ప్రజెన్స్ ఈ సినిమాకు పాజిటివ్ అంశాలు. మంచి థ్రియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న చిత్రం.. పక్కా పైసా వసూల్ చిత్రమని చెప్పవచ్చు


Click it and Unblock the Notifications











