Vishnu Vinyasam Public Talk: విష్ణు విన్యాసం పబ్లిక్ టాక్ .. శ్రీ విష్ణు సినిమా ఎలా ఉందంటే?
Vishnu Vinyasam Public Talk: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు (Sree Vishnu) వరుస విజయాలతో దూసుకపోతున్నారు. సామజవరగమన, ఓం భీమ్ బుష్, శ్వాగ్, సింగిల్ వంటి హిట్స్ తర్వాత తాజాగా విష్ణు విన్యాసం (Vishnu Vinyasam)తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. డెబ్యూ డైరెక్టర్ యదునాథ్ మారుతి రావు తెరకెక్కించిన ఈ కామెడీ-డ్రామా ఫిబ్రవరి 27న గ్రాండ్‌గా విడుదలైంది. యూ/ఏ సర్టిఫికెట్‌తో, కేవలం 1 గంట 59 నిమిషాల రన్‌టైమ్‌తో కాంపాక్ట్ ఎంటర్‌టైనర్‌గా థియేటర్లలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో శ్రీ విష్ణు నటించిన విష్ణు విన్యాసం మూవీకి పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?
విష్ణు విన్యాసం (Vishnu Vinyasam)సినిమాలో శ్రీ విష్ణు జూనియర్ లెక్చరర్‌గా కనిపిస్తాడు. కానీ, అతని అసలు క్యారెక్టర్ ట్విస్ట్ ఏమిటంటే.. జాతకాలు, న్యూమరాలజీ, రంగులు, శుభముహూర్తాలు అన్నింటినీ బలంగా నమ్మే వ్యక్తి. డ్రెస్ వేసుకోవాలంటే కూడా జాతకం చూసుకుంటాడు. ఏ రోజు ఏ కలర్ షర్ట్ వేయాలో కూడా నెంబర్ ప్రకారం ఫిక్స్ చేసుకుంటాడు. హీరో ఇతరులతో ఫ్రెండ్షిప్ చేయాలన్నా ముందుగా వారి జాతకం మ్యాచ్ అవుతుందా లేదా చూసేంతగా అతని నమ్మకం పీక్స్‌లో ఉంటుంది. అలాంటి వ్యక్తి జీవితంలో హీరోయిన్ (Nayana Sarika) ఎంట్రీ ఇస్తుంది. ఆమె వచ్చిన తర్వాతే అసలు విన్యాసాలు మొదలవుతాయి. జాతకం వర్సెస్ లాజిక్ అన్న కాన్సెప్ట్ ఈ సినిమా స్టోరీ.

ఫిబ్రవరి 26 రాత్రి ఓవర్సీస్ ప్రీమియర్ షోలు పడగా, అక్కడి నుంచే సోషల్ మీడియాలో పాజిటివ్ స్పందనలు వెల్లువెత్తాయి. ట్విట్టర్ లో నెటిజన్లు తమ అభిప్రాయాలు పంచుకుంటూ 'స్ట్రెస్ ఫ్రీ ఎంటర్‌టైనర్' గా అభివర్ణిస్తున్నారు. మొదటి భాగం పూర్తి స్థాయి కామెడీ ట్రాక్‌లో సాగుతుందని, శ్రీ విష్ణు థియేటర్లలో నవ్వులు పూయించాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక మరికొందరూ ' ఫస్టాఫ్ అదిరిపోయింది. నవ్వి నవ్వి పోయాం. శ్రీ విష్ణు-నయన్ సారిక కెమిస్ట్రీ సూపర్' మరొకరు 'సెకండాఫ్ ఫ్లో బాగుంది. ప్రీ క్లైమాక్స్ లవ్ ట్రాక్ హార్ట్ టచ్ చేసింది. ఎండ్ కార్డ్ కామెడీ పంచ్‌లు వర్క్ అయ్యాయి' అంటూ రివ్యూ ఇస్తున్నారు.
ఇక మరికొందరూ ఈ సినిమాపై ఓ ప్రేక్షకుడు ఇలా స్పందించాడు. 'ఫస్ట్ హాఫ్ పూర్తిగా నవ్వుల వర్షం. శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ మామూలు కాదు. డైరెక్టర్ టేకింగ్ చాలా క్లీన్‌గా ఉంది'అని ఓ ప్రేక్షకుడు రివ్యూ ఇచ్చాడు. సిట్యుయేషనల్ కామెడీ, సెటైరికల్ డైలాగ్స్ బాగా వర్క్ అయ్యాయని పబ్లిక్ టాక్. 'నమ్మకం, మూఢనమ్మకమా?' అన్న ప్రశ్నతో కథ ముందుకు సాగుతుంది. ఎమోషన్, లవ్ ట్రాక్, చిన్న చిన్న ట్విస్టులు కథను బ్యాలెన్స్ చేస్తాయని అంటున్నారు. 'కొత్త కథలు చూడాలనుకునేవారికి ఇది పర్ఫెక్ట్ మూవీ' అని మరో అభిప్రాయం. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ఆర్ సినిమాకు పెద్ద ప్లస్ అని ఆడియన్స్ చెబుతున్నారు. హీరోయిన్ నయన సారిక స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుందని, శ్రీ విష్ణుతో కెమిస్ట్రీ బాగుందని రివ్యూలు చెబుతున్నాయి. సహాయ పాత్రల్లో సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్ తమ పాత్రలకు న్యాయం చేశారని అభిప్రాయం.
అయితే.. సోషల్ మీడియా మీమ్ ఆధారం సినిమా తెరకెక్కినట్టు కాస్త మిక్స్డ్ టాక్ ఉంది. శ్రీ విష్ణు సెటైరికల్ డైలాగ్స్, టైమింగ్ మరోసారి ఆయన స్ట్రెంగ్త్‌గా నిలిచాయి. అయితే మీమ్ రిఫరెన్స్‌లు, బ్యాక్‌గ్రౌండ్ మీమ్ మ్యూజిక్ కొంతమందికి ఓవర్‌గా అనిపించిందని అభిప్రాయాలు కూడా వచ్చాయి. అలాగే.. రెండో భాగంలో ఎమోషనల్ యాంగిల్ కొద్దిగా ల్యాగ్‌గా అనిపించినా, క్లైమాక్స్‌లో మళ్లీ ఫన్ మోడ్‌కు రావడం సినిమాకు ప్లస్ అయిందని ప్రేక్షకులు అంటున్నారు. ఎండ్ టైటిల్స్ వరకూ వినోదాన్ని కొనసాగించడం మెచ్చుకున్నారు.
ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు సరిపోయిందని, ఎడిటింగ్ కట్టుదిట్టంగా ఉండడం వల్ల సినిమా క్రిస్ప్‌గా అనిపించిందని అభిప్రాయాన్ని చెబుతున్నాయి. డెబ్యూ డైరెక్టర్ యదునాథ్ మారుతి రావు కామెడీ-ఎమోషన్ బ్యాలెన్స్ చేయడంలో మంచి ప్రయత్నం చేశారని టాక్. 'విష్ణు విన్యాసం' భారీ అంచనాలు లేకుండా వెళ్తే సరదాగా నవ్వుకునే వీకెండ్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందనే పబ్లిక్ టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











