Vishnu Vinyasam Movie Twitter Review: విష్ణు విన్యాసం మూవీ ట్విట్టర్ రివ్యూ

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైనర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ హీరో శ్రీవిష్ణు. హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు శ్రీవిష్ణు. మినిమమ్ గ్యారంటీ హీరోగా, ప్రేక్షకులను డిజప్పాయింట్ చేయని నటుడిగా ఆయన పేరుతెచ్చుకున్నారు. తాజాగా శ్రీవిష్ణు నటించిన చిత్రం విష్ణు విన్యాసం. కామెడీ, ఫ్యామిలీ, ఎంటర్‌టైనర్‌గా రూపొందింది.

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌లో సుమంత్ నాయుడు జీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విష్ణు విన్యాసం మూవీలో శ్రీవిష్ణు సరసన నయన్ సారిక, సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు యదునాథ్ మారుతిరావు దర్శకత్వం వహిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా.. రాదన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. కార్తీకేయన్ రోహిణి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఫిబ్రవరి 27వ తేదిన విష్ణు విన్యాసం మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై నెటిజన్లు అందించిన టాక్ ఏమిటీ? క్రిటిక్స్ రివ్యూ ఏమిటీ? అనే వివరాలు పరిశీలిస్తే..

Vishnu Vinyasam Movie Twitter Review in Telugu  Is Sree Vishnu s Movie hits the bulls eye

విష్ణు విన్యాసం దాదాపు పూర్తిగా శ్రీవిష్ణు సిగ్నేచర్ స్టైల్, అతని ఎనర్జిటిక్ కామిక్ టైమింగ్ మీద నడిచింది. సెకండాఫ్‌లో కొన్ని సరదా క్షణాలను అందిస్తుంది. దర్శకుడు మారుతి రైటింగ్‌లో లింక్ మిస్ అయినట్లుగా ఉంది. ప్రారంభంలో పంచ్‌లు బాగానే పేలాయి. కానీ అవి సినిమా ఆసాంతం కొనసాగలేదు. సన్నివేశాలు పరిమితికి మించి ఉన్నట్లుగా ఉండి.. సినిమా ప్రభావాన్ని తగ్గించాయని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.

విష్ణు విన్యాసం ఔట్‌డేటెడ్ కామెడీ ఎంటర్‌టైనర్. కథాంశం శ్రీవిష్ణు వన్ లైనర్‌లా అనిపించినా.. డబ్బింగ్ తరహా కామెడీ పునరావృతమయ్యేలా కనిపించింది. ఈసారి ఇది వర్కవుట్ కాలేదు.. బలవంతంగా హాస్యాన్ని ఇరికించడంతో పాటు అతి ఎక్కువగా కనిపించింది. మీమ్స్ రిఫరెన్స్‌లు, మీమ్స్ మ్యూజిక్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల చికాకు కలుగుతుంది. పాటలు ఏమాత్రం అలరించకపోగా.. ఫ్లోకు అంతరాయం కలిగించాయి. ఇలాంటి సినిమాకి బలమైన కథ అవసరం లేదు. కానీ ఫ్లో ఎట్రాక్టింగ్‌గా లేకపోగా.. కొన్ని చోట్ల మాత్రమే కామెడీ క్లిక్ అయ్యింది. శ్రీవిష్ణు తన యాక్టింగ్ టాలెంట్‌తో కాపాడాలని ప్రయత్నించినా సినిమా నిరాశపరిచిందని ఓ యూజర్ కామెంట్ చేశాడు.

సెకండాఫ్‌లో ఎమోషనల్ యాంగిల్ కొంచెం లాగ్ అనిపించింది. కానీ బాగానే వర్క్ అయ్యింది. శ్రీవిష్ణు నాకు బాగా నచ్చేశాడు. మళ్లీ ఫన్‌తోనే సినిమాను ఎండ్ చేశారు. టైటిల్స్ పడే టైంలో కూడా వదల్లేదు. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌కి మంచి సినిమా అని ఓ ట్విట్టర్ యూజర్ కామెంట్ పెట్టాడు.

విష్ణు విన్యాసం టైం పాస్‌బుల్.. ఫస్టాఫ్, సెకండాఫ్‌లలో కొన్ని కామెడీ సీన్స్ బాగానే వర్కవుట్ అయ్యాయి. శ్రీవిష్ణు .. సింగిల్ లైన్ పంచ్‌లు, సంగీతం బాగున్నాయి. స్టార్టింగ్ నుంచి క్లైమ్యాక్స్ వరకు ఫ్లో కొనసాగింది. మొత్తానికి శ్రీవిష్ణు హవా కొనసాగుతోంది.

విష్ణు విన్యాసం మూవీ ఈ వారానికి డీసెంట్ కామెడీ ఎంటర్‌టైనర్. శ్రీవిష్ణు మరోసారి తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. స్టోరీ డీసెంట్‌గా ఉంది. ట్రెండింగ్ మీమ్స్‌తో చేసిన కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది. మొత్తానికి ఇది శ్రీవిష్ణు కామెడీ విన్యాసమని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.

More from Filmibeat

Read more about: Vishnu Vinyasam sree vishnu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X