For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  విష్ణు..మహాప్రభో!

  By Staff
  |

  Vishnu
  -జలపతి గూడెల్లి
  చిత్రం: విష్ణు
  నటీనటులు: విష్ణువర్థన్‌ బాబు, వేదిక, నీతూ చంద్ర,
  మురళీమోహన్‌, జయసుధ, తదితరులు
  సంగీతం: ఇస్మాయిల్‌ దర్బార్‌
  నిర్మాత: మోహన్‌ బాబు.ఎం
  స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: షాజీ కైలాస్‌

  ఫక్తు ఫార్మాలా చిత్రం ఇది. వంశాంకురాలను పరిచయం చేసే చిత్రాలన్నింటి మాదిరిగానే బోర్‌ కొట్టించే చిత్రం. మోహన్‌ బాబు కేరళ వెళ్ళి దర్శకుడు షాజీ కైలాష్‌ ను, ముంబై వెళ్ళి సంగీత దర్శకుడు ఇస్మాయిల్‌ దర్బార్‌ ను తీసుకొని రావడంలో చూపిన శ్రద్ధ కథ మీద చూపలేదు. కెమెరా పనితనంతో, తన స్టైలీష్‌ టేకింగ్‌ తో సినిమాను చుట్టేయాలని దర్శకుడు షాజీ కైలాష్‌ ప్రయత్నించాడు. కానీ సినిమా తొలి షాట్‌ నుంచి శుభం కార్డు వరకు ఫార్మూలా చిత్రమే అని తెలిస్తూనే ఉంటుంది.

  ఎక్కడా ఇంట్రెస్టింగ్‌ గా అనిపించే అవకాశమే లేదు. ఇక మంచు విష్ణువర్ధన్‌ బాబు ఫైట్స్‌ బాగా చేస్తాడు, డాన్సులు బాగా చేస్తాడని పేరు వచ్చిందని తర్వాత ప్రచారం చేసుకునేందుకు కాబోలు సినిమాలో దానిపైనే దృష్టిపెట్టారు. మోహన్‌ బాబు కుమారుడు విష్ణువర్ధన్‌ బాబు కూడా తనకు భావాలు ఎలా ఎక్స్‌ ప్రెస్‌ చేయాలో తెలియదని నిరూపించుకున్నాడు. ఎన్టీఆర్‌ జూనియర్‌ పరిచయం చేస్తూ తీసిన 'నిను చూడాలని' సినిమా మాదిరిగానే ఫరమ బోర్‌ చిత్రం ఇది.

  కథ ఏమిటంటే.. శ్రీ విష్ణు ఇంజనీరింగ్‌ విద్యార్థి. చిన్నప్పుడు వైష్ణవి (వేదిక అలియాస్‌ శిల్పాఆనంద్‌) విష్ణును ప్రమాదం నుంచి కాపాడుతుంది. వీరిద్దరు అప్పుడే ఫ్రెండ్స్‌ అవుతారు. ఇద్దరు పచ్చబొట్లు పొడిపించుకుంటారు. కానీ వైష్ణవి కుటుంబం చిన్ననాడే హైదరాబాద్‌ వెళ్ళిపోతారు. పద్నాలుగు ఏళ్ళు గడిచినా..విష్ణు వైష్ణవిని మరిచిపోలేకపోతాడు. వైష్ణవి కూడా తన చదువుతోన్న కాలేజీలోనే చేరుతుంది.

  విష్ణు చేసే కొన్ని చేష్టల వల్ల ఆమె అతను పెద్ద రౌడీ అని భావిస్తుంది. తన మంచితనంతో మంచి చేసుకొని తర్వాత తను 'విష్ణు' అని బయటపెట్టాలని శ్రీ అనే పేరుతోనే కాలేజ్‌ లో చలామణి అవుతాడు. ఇక ఇటు వైష్ణవి తండ్రి పెద్ద ఫ్యాక్షనిస్ట్‌. వైష్ణవిని ఆమె బావకిచ్చి పెళ్ళి చేయాలని అనుకుంటాడు. వైష్ణవికి ఇష్టముండదు. ఇదే సమయంలో శ్రీ, విష్ణు అని తెలుస్తోంది. ఇక ఇంటర్వెల్‌ తర్వాత..రైలు షాట్లు, బైక్‌ ఛేజ్‌ లతో శ్రీ, విష్ణు పెళ్ళి చేసుకోవడమే.

  కెమెరా పనితనం మాత్రం బాగుంది ఈ చిత్రంలో. దర్శకుడికి, కెమెరెమెన్‌ కు విష్ణు కళ్ళు బాగా నచ్చాయోమో, సినిమాలో సగం షాట్లు క్లోజప్‌ షాట్లే. పరుచూరి బ్రదర్స్‌ రాసిన అర్ధరహితమైన డైలాగ్స్‌ ను అసందర్భంగా హీరో వల్లించడం పెద్ద జోక్‌. శిల్పా చాలా అందంగా ఉంది. ఇస్మాయిల్‌ దర్బార్‌ సంగీతం రాగాల పరంగా బాగున్నా, అవి పెద్దగా ఆకట్టుకోవు.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X